breaking news
raitu nestam
-
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్‌లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్.అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్‌ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్‌లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్‌కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు.యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు.రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్‌స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు.పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్‌సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852-రమణమూర్తి మంథా -
చిన్న కమతాలకు పెద్ద అండ యాంత్రీకరణ
సాక్షి, అమరావతి: పవర్ టిల్లర్లు, వీడర్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు, కట్టె గానుగలు వంటి అనేక చిన్నా, పెద్ద యంత్రాల ప్రదర్శనకు గుంటూరు సమీపంలోని పుల్లడిగుంట వేదికైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ ఆదివారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు వందలాదిమంది రైతులు హాజరయ్యారు. పరికరాల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చూసి, చేసి తెలుసుకున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల డీన్, అగ్రికల్చర్ ప్రొఫెసర్ జోసఫ్రెడ్డితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ప్రకృతి, సేంద్రియరంగ సేద్య నిపుణులు రైతులకు యంత్రపరికరాల వినియోగ అవసరాన్ని వివరించారు. రాష్ట్రంలో కమతాలు చిన్నవైనందున వాటికి తగిన యంత్రాలనే ఇక్కడ ప్రదర్శనకు పెట్టామని రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వై.వెంకటేశ్వరరావు చెప్పారు. ఆకట్టుకున్న ప్రదర్శన పత్తి, మిరప వంటి పంటల్లో కలుపు తీసే యంత్రాలు, ట్రాక్టర్ సాయంతో పెద్దఎత్తున పిచికారీ చేసే పరికరాలు, తక్కువ ఖర్చుతో 10, 12 కిలోల కూరగాయలు నిల్వచేసుకునే థర్మోకోల్ రిఫ్రిజిరేటర్లు, అంతరసేద్యం చేసే బుల్లి గొర్రు, చిన్న నాగలి, మనిషి నిల్చొనే గడ్డి పీకేసే పరికరాలు వంటివి అనేకం రైతులను ఆకట్టుకున్నాయి. పలువురు వ్యవసాయ విద్యార్థులు సొంతంగా తయారుచేసిన పరికరాలను రైతులు ఆసక్తిగా పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. ఈ రైతు పేరు పి.సాంబశివరావు. గుంటూరు జిల్లా పసుమర్రు గ్రామం. తన మోపెడ్ వాహనాన్నే సోలార్ పవర్ స్ప్రేయర్‌గా మార్చుకున్నారు. ఎక్కడైనా చేలో మందు చల్లాల్సి వచ్చినప్పుడు మోపెడ్‌కు బిగించిన 20 లీటర్ల క్యాన్‌లో ద్రావణాలను కలిపి సోలార్ పవర్ ఆధారంగా నడిచే చిన్న మోటారు సాయంతో పిచికారీ చేస్తున్నారు. మోపెడ్ మీదనే పొలానికి వెళతారు. చేలో బండి ఆపి మందును పిచికారీ చేస్తారు. మీ పంట చేలో పడిన కోతులను తరమడం పెద్ద బెడదగా మారిందా? అయితే ఇదిగో పరిష్కారం. తక్కువ ఖర్చుతో పెద్ద శబ్దం వచ్చే చిన్నపాటి ప్లాస్టిక్ గన్ను ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. దీన్ని ఎలా వాడాలో రైతులకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇదో పవర్ టిల్లర్. ఎద్దులు, దున్నపోతులతో పనిలేకుండా స్వయంగా రైతే పొలాన్ని దున్నుకునే చిన్నపాటి యంత్రం. దీనిసాయంతో ఎకరం, రెండెకరాల పొలాన్ని సునాయాసనంగా దున్నవచ్చు. లీటర్ పెట్రోలు పోసుకుంటే గంటన్నరకుపైగా నడుస్తుంది. తక్కువ ఖర్చుతో అటు సమయాన్ని, ఇటు శ్రమను ఆదా చేసుకోవచ్చు. -
30 నుంచి బెంగళూరులో కిసాన్ మేళా, దేశీ విత్తనోత్సవం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు (ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.) ఆధ్వర్యంలో మార్చి 30–31 తేదీల్లో రైతు మేళా, దేశీ విత్తనోత్సవం జరగనున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మార్పుల నేపథ్యంలో కరువు, చీడపీడలను తట్టుకోవడానికి తమ సంప్రదాయ విత్తనాన్ని అభివృద్ధి చేసుకొని విత్తుకోవడమే ఉత్తమం. దేశీ విత్తన స్వాతంత్య్రం, దేశీ గోమాతే రైతులకు రక్షగా నిలుస్తాయని ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. భావిస్తోందని ప్రతినిధి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ అంశాలపై రైతులను చైతన్యవంతం చేయడమే లక్ష్యమన్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే దేశీ విత్తన సంరక్షకులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. రెండున్నర కిలోల దేశీ వరివిత్తనంతో ఎకరం సాగు చేసే శ్రీ పద్ధతి, పావు కిలో విత్తనంతో సాగు చేసే పెరుమాళ్లు పద్ధతి, పంటల ప్రణాళిక రూపకల్పన, దేశీ విత్తన సంరక్షణలో మెలకువలు తదితర అంశాలపై ప్రకృతి వ్యవసాయదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907 కుంకుడు గుత్తులు! సాధారణంగా కుంకుడు చెట్టుకు కాయలు విడివిడిగా కాస్తాయి. ఆశ్చర్యకరంగా ఈ చెట్టుకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం జనగామకు సమీపంలో ఓ మెట్టభూమి గట్టు మీద ఈ చెట్టు ఉండగా సుస్థిర వ్యవసాయ కేంద్రం డా. జి. రాజశేఖర్ దృష్టిలో పడింది. ఈ విత్తనాలు కావాలనుకున్న వారు డా. రాజశేఖర్‌ను 83329 45368 నంబరులో సంప్రదించవచ్చు. 24న సేంద్రియ గొర్రెల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈ నెల 24 (ఆదివారం)న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సాంకేతిక అధికారి డా. టి. వెంకటేశ్వర్లు, పశువైద్యులు డా. జి. రాంబాబు(కడప), గొర్రెల పెంపకందారుడు రషీద్ రైతులకు అవగాహన కల్పిస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. వివరాలకు.. 97053 83666, 0863–2286255. కట్టె గానుగల నిర్వహణపై 3 రోజుల శిక్షణ .సహజ సాగు పద్ధతిలో పండించిన నూనెగింజలతో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పరిశుభ్రమైన రీతిలో కట్టె గానుగలో వంటనూనెలను వెలికితీయడంపై యువతీ యువకులకు మార్చి 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షిండె శివశంకర్ తెలిపారు. కనీసం పదోతరగతి చదివిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఆసక్తి గల వారు తమ వివరాలను ఈ నెల 24లోగా 81210 08002, 70133 09949లలో ఏదో ఒక నంబర్‌కు ఎస్.ఎం.ఎస్. లేదా వాట్సప్ ద్వారా సమాచారం పంపాలని ఆయన కోరారు. -
ప్రకృతి వ్యవసాయంలో వరి, మిరప సాగుపై 11న శిక్షణ
గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, మిరప సాగుపై ఈ నెల 11వ తేదీన ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు నాగర్‌కర్నూలుకు చెందిన సీనియర్ రైతు శ్రీమతి లావణ్యా రమణారెడ్డి, గుంటూరు జిల్లా రైతు శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు. పేర్ల నమోదుకు, వివరాలకు.. 83675 35439, 97053 83666. -
21న సమీకృత సహజ సేద్యంపై నారాయణరెడ్డి శిక్షణ
గోఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు, దొడ్డబళ్లాపూర్ (కర్ణాటక)కు చెందిన ప్రముఖ రైతు ఎల్. నారాయణ రెడ్డి (84) అక్టోబర్ 21 (ఆదివారం)న హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ కేఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియం, రెడ్ హిల్స్, లక్డికపూల్లో ౖరైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. భాగ్యనగర్ గోపాలాస్, రైతునేస్తం, నేచర్స్‌వాయిస్ సంయుక్త ఆధ్వర్యం లో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గోఆధారిత సమీకృత సహజ వ్యవసాయం, ఆహారం, జీవన విధా నంపై వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 70939 73999, 70608 43007 నంబర్లలో సంప్రదించవచ్చు. 21న సిరిధాన్యాల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 21(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు ప్రకృతి వ్యవసాయ విధానంలో రబీలో సిరిధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. కడప జిల్లాకు చెందిన సీనియర్ రైతు విజయ్‌కుమార్ రైతులకు శిక్షణ ఇస్తారు. రైతులకు ఉచితంగా వేస్ట్ డీ కంపోజర్‌ను పంపిణీ చేస్తారు. వివరాలకు.. 83675 35439, 97053 83666. -
7న రైతునేస్తం అవార్డుల బహూకరణ
సాక్షి, అమరావతి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఏర్పాటు చేసిన రైతునేస్తం పురస్కారాలను ఈనెల 7న హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అందజేయనున్నట్టు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు జరిగే అవార్డుల బహూకరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులు, అగ్రిజర్నలిస్టులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. పురస్కార గ్రహీతల్లో ప్రముఖ ఆరోగ్య ఆహార నిపుణుడు డాక్టర్ ఖాదర్ వలీ, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, సాక్షి దినపత్రిక సంపాదకులు వి.మురళి, పలువురు వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు ఉన్నారు. -
జిల్లాకు అవార్డుల పంట
హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఐదుగురికి ‘రైతునేస్తం’ పురస్కారాలు అందాయి. హైదరాబాద్‌లోని హోటల్ కత్రియలో ఆదివారం నిర్వహించిన ‘రైతునేస్తం’ 12వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డులు అందజేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ ఇ.కరుణ శ్రీ(కేవీకే సమన్వయకర్త) విస్తరణ విభాగంలోనూ, అసోసియేట్ డీన్ ఎ.సుజాత ఉత్తమ సైంటిస్టులుగానూ అవార్డులు అందుకున్నారు. అలాగే ఉండి ఫిషరీస్ రీసెర్చ్ స్టేష¯Œæకు చెందిన సైంటిస్ట్ టి.సుగుణ ఉత్తమ సైంటిస్ట్‌గాను అవార్డును స్వీకరించారు. జిల్లాకు చెందిన గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలిచిన భూపతిరాజు రామకృష్ణంరాజు రైతు నేస్తం అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో రైతు నేస్తం ఎడిటర్ వై.వెంకటేశ్వరరావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పాల్గొన్నారు. -
రైతు నేస్తం అవార్డుల స్వీకరణ
హన్మకొండ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ రేపల్లె ప్రసన్నకుమార్, గోవిం దరావుపేట మండల పశువైద్యా ధికారి అజ్మీరా ధర్మానాయక్, కేసముద్రం మండలానికి చెందిన రైతు గంటా దామోదర్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతునేస్తం అవార్డులు అందుకున్నారు. కేంద్ర, రాష్ట్ర మం త్రులు వెంకయ్యనాయుడు, హరీష్‌రావు చేతుల మీదుగా వారు అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో రైతు నేస్తం ఎడిటర్ వై. వెంకటేశ్వర్రావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యల మంచలి శివాజీ, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.