breaking news
Q3 revenue
-
షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో,వివో..!
Xiaomi Revenue Fails To Meet Expectations As Competition From Oppo Vivo Intensifies: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమికి సమీప ప్రత్యర్థి స్మార్ట్‌ఫోన్ కంపెనీలైన ఒప్పో, వివో భారీ షాక్‌ను ఇచ్చాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఒప్పో, వివో కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ రావడంతో కంపెనీ ఆదాయ అంచనాలను చేరుకోవడంలో షావోమీ విఫలమైంది. కంపెనీ క్యూ3 రెవెన్యూలో కేవలం 0.4 శాతం వృద్దిని మాత్రమే నమోదు చేసింది. క్యూ3 రెవెన్యూలో షావోమీ 8.2 శాతం పెరుగుదలను సాధించింది. రిఫీనిటివ్ డేటా ప్రకారం...మూడు నెలల్లో (జూలై -సెప్టెంబర్) దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను షావోమీ జరిపింది. ఈ క్యూ3లో సుమారు రూ. 92,300 కోట్లను షావోమీ అంచనా వేసినట్లు తెలుస్తోంది. వన్-టైమ్ లాభాలు, నష్టాలను మినహాయించి, షావోమీ సుమారు రూ. 6,040 కోట్ల లాభాన్ని ఆర్జించింది. షావోమీ ఆదాయం కేవలం 0.4 శాతం పెరిగి రూ. 55,655 కోట్లకు చేరుకుంది. రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం... చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జూలై-సెప్టెంబర్ కాలంలో దాదాపు 5 శాతం మేర పడిపోయాయి. హువావేపై అమెరికా ఆంక్షలను విధించడంతో షావోమీ ఈ మేర లాభాలను పొందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీప ప్రత్యర్థులు ఒప్పో, వివో కంపెనీలు క్యూ3లో గడించిన వృద్ధిని షావోమీ పొందలేకపోయింది. చైనాలో షావోమీ షిప్మెంట్లు మూడో త్రైమాసికంలో కేవలం 4 శాతం మేర పెరిగాయని కెనాలిస్ తెలిపింది. చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ఎన్ఎండీసీ లాభం 1,593 కోట్లు
* క్యూ3 ఆదాయం రూ. 2,943 కోట్లు * హుద్‌హుద్ ప్రభావంతో 5 శాతం తగ్గిన అమ్మకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హుద్ హుద్ తుపాన్ ప్రభావం ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ ఫలితాలపై కనిపించింది. మూడో త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడంతో నికర లాభం స్వల్పంగా పెరిగింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గతేడాదితో పోలిస్తే 1.6% వృద్ధితో రూ. 1,567 కోట్ల నుంచి రూ. 1,593 కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో అమ్మకాలు 5 శాతం క్షీణించి 6.97 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. హుద్ హుద్ తుపాన్ వల్ల రైల్వే ట్రాకులు దెబ్బ తినడంతో కొద్దిరోజులు రవాణా జరగలేదని, అమ్మకాలు తగ్గడానికి ఇది కారణమని ఎన్ఎండీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. కానీ ఇదే సమయంలో ముడి ఇనుము ఉత్పత్తి మాత్రం 11% వృద్ధితో 8.11 మిలియన్ టన్నులకు చేరింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 2,823 కోట్ల నుంచి రూ. 2,946 కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ఈ నెల టన్ను ముడి ఇనుము ధర రూ. 450 వరకు తగ్గించామని, దీని ప్రభావం నాల్గవ త్రైమాసిక ఆదాయం, లాభాలపై కనిపిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.4.25 మధ్యంతర డివిడెండ్ రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు రూ. 4.25 మధ్యంతర డివిడెండ్ ఎన్ఎండీసీ బోర్డు సిఫార్సు చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రకటించిన డివిడెండ్ విలువ రూ.7.25కి చేరింది.