breaking news
Q1 net profit
-
తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన లాభాలు
ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 ఏప్రిల్–జూన్ కాలానికి రూ.4,116 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2024 ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,679 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. మొత్తం ఆదాయం రూ.30,874 కోట్ల నుంచి రూ.31,791 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.26,364 కోట్ల నుంచి అధికమై రూ.27,296 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.9,412 కోట్ల నుంచి రూ.9,113 కోట్లకు దిగివచ్చింది. నిర్వహణ లాభం 11% క్షీణించి రూ.7,785 కోట్ల నుంచి రూ.6,909 కోట్లకు తగ్గింది.స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) 4.54% నుంచి 3.52 శాతానికి, నికర ఎన్పీఏలు 0.90% నుంచి 0.62 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు ప్రొవిజన్ల కేటాయింపు రూ.1,651 కోట్ల నుంచి రూ.1,153 కోట్లకు తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 6.83% పుంజుకొని 9,12,214 కోట్ల నుంచి రూ.9,74,489 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో(పీసీఆర్) 116 బేసిస్ పాయింట్లు పెరిగి 93.49 శాతం నుంచి 94.65 శాతానికి చేరింది. మొత్తం వ్యాపారం 5% వృద్ధి చెంది రూ.21,08,762 కోట్ల నుంచి రూ.22,14,422 కోట్లకు ఎగసింది.సెంట్రల్ బ్యాంక్ ఫలితాలు భేష్ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. ఆదా యం మెరుగవడం, మొండి రుణాలు (ఎన్పీఏలు) తగ్గడంతో ఏప్రిల్–జూన్‌లో రూ.1,169 కోట్ల నికర లాభా న్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2024– 25) ఇదే క్యూ1 నికర లాభం రూ.880 కోట్లతో పోలి స్తే ఇది 33% అధికం. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.9,500 కోట్ల నుంచి రూ.10,374 కోట్లకు ఎగసింది.బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.8,335 కోట్ల నుంచి రూ.8,589 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 19% పెరిగి రూ.2,304 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత మెరుగవడంతో స్థూల మొండి బకాయిలు 4.54% నుంచి 3.13 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.73% నుంచి 0.49 శాతానికి తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 9.97% పుంజుకొని 2,50,615 కోట్ల నుంచి రూ.2,75,595 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 96.17 % నుంచి 97.02 శాతం పెరిగింది. కనీస మూలధన నిష్పత్తి 15.6% నుంచి 17.6 శాతానికి మెరుగైంది. మొత్తం వ్యాపారం 11% వృద్ధి చెంది రూ.6,35,564 కోట్ల నుంచి రూ.7,04,485 కోట్లకు ఎగసింది. -
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా
ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 1,111 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 633 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,568 కోట్ల నుంచి రూ. 8,866 కోట్లకు బలపడింది.వడ్డీ ఆదాయం రూ. 6,535 కోట్ల నుంచి రూ. 7,386 కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం రూ. 1,676 కోట్ల నుంచి రూ. 2,358 కోట్లకు జంప్‌చేసింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.89 శాతం నుంచి 1.97 శాతానికి, నికర ఎన్పీఏలు 0.51 శాతం నుంచి 0.32 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 17.82 శాతం నుంచి 18.82 శాతానికి మెరుగుపడింది. ఫలితాల నేపథ్యంలో ఐవోబీ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 40 వద్ద ముగిసింది.బంధన్ బ్యాంక్ లాభం క్షీణత ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 372 కోట్లను తాకింది. మొండి రుణాలు పెరగడం, వడ్డీ ఆదాయం తగ్గడం ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,063 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 6,082 కోట్ల నుంచి రూ. 6,201 కోట్లకు బలపడింది. అయితే వడ్డీ ఆదాయం రూ. 5,536 కోట్ల నుంచి రూ. 5,476 కోట్లకు నీరసించింది.నికర వడ్డీ ఆదాయం రూ. 2,987 కోట్ల నుంచి రూ. 2,757 కోట్లకు వెనకడుగు వేసింది. నిర్వహణ లాభం సైతం రూ. 1,941 కోట్ల నుంచి రూ. 1,668 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 4.23 శాతం నుంచి 4.96 శాతానికి, నికర ఎన్పీఏలు 1.15 శాతం నుంచి 1.36 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 523 కోట్ల నుంచి రూ. 1,147 కోట్లకు భారీగా పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు 1.1 శాతం పుంజుకుని రూ. 187 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన డీమార్ట్
న్యూఢిల్లీ : డీమార్ట్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్టాక్మార్కెట్లో లిస్టు అయిన తొలిరోజే దుమ్మురేపి, అనంతరం కొన్ని రోజుల్లోనే ఆ సంస్థ అధినేత రాధాకృష్ణ దమానీని అపరకుబేరుడిని చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన అవెన్యూ సూపర్‌మార్ట్స్, లాభాల్లోనూ అదరగొట్టింది. శనివారం ప్రకటించిన లాభాల్లో ఏడాది ఏడాదికి 47.60 శాతం పెరుగుదలను నమోదుచేసింది. దీంతో కంపెనీ లాభాలు 2017-18 తొలి త్రైమాసికంలో రూ.174.77 కోట్లగా రికార్డయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ సంస్థ లాభాలు రూ.118.44 కోట్లగా ఉన్నాయి. మొత్తం ఆదాయాలు కూడా రూ.3,620.95 కోట్లకు పెరిగినట్టు కంపెనీ నేడు బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. ఇది ఏడాది ఏడాదికి 36.3 శాతం పెరుగుదల. ఈబీఐటీడీఏలు కూడా ఈ క్వార్టర్లో 36 శాతం పెరిగాయని, అవి రూ.326 కోట్లగా నమోదైనట్టు కంపెనీ చెప్పింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈబీఐటీడీఏలు రూ.239.70 కోట్లగా మాత్రమే ఉన్నట్టు కంపెనీ తన రిపోర్టులో తెలిపింది. అయితే ఈబీఐటీడీఏ మార్జిన్లు మాత్రం ఫ్లాట్‌గా 9 శాతం మాత్రమే నమోదయ్యాయి. కాగ, అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు ఏప్రిల్‌లో రికార్డు వర్షం కురిపించడంతో దమానీ, అత్యంత ధనవంతులైన భారతీయుల్లో ఒకరిగా నిలిచారు. ప్రపంచంలోని 500 మంది కుబేరుల్లో కూడా ఆయనకు చోటు దక్కింది. బ్లూంబర్గ్ బిలినీయర్ గణాంకాల ప్రకారం అప్పుడు దమానీ సంపద 4.10 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2002లో దమానీ అవెన్యూ సూపర్మార్ట్స్ని స్థాపించారు. దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న ఫుడ్ అండ్ గ్రోసరీ రిటైలర్ డీమార్ట్ బ్రాండ్ కింద అవెన్యూ సూపర్‌మార్ట్స్ కంపెనీ పనిచేస్తుంది. మొత్తం 9 రాష్ట్రాలు సహా మరో కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి కంపెనీకి 118 స్టోర్లు ఉన్నాయి. -
కొటక్ నికర లాభం జంప్..అంచనాలు మిస్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది తొలి క్వార్టర్ ఫలితాలు ప్రకటించింది. ఇయర్ ఆన్ ఇయర్ 23 శాతం నికర లాభాలను ప్రకటించినప్పటికీ ఎనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయింది. గురువారం వెల్లడించిన మొదటి జూన్ త్రైమాసిక పలితాల్లో స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ. 912.73 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 742 కోట్లను ఆర్జించింది. అయితే రూ.975 గా ఎనలిస్టులు అంచనావేశారు. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17శాతం ఎగిసి రూ. 2246 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.59 శాతం నుంచి 2.58 శాతానికి, నికర ఎన్పీఏలు 1.26 శాతం నుంచి 1.25 శాతానికి నామమాత్రంగా బలహీనపడ్డాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కొటక్ నికర లాభం 26 శాతం పెరిగి రూ. 1347 కోట్లయ్యింది. ఎన్ఐఐ సైతం 37 శాతం జంప్‌చేసి రూ. 3525 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) మాత్రం 4.6 శాతం నుంచి 4.4 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ఈ త్రైమాసికానికి బ్యాంక్ సీఏఎస్‌ల 43.9 శాతం పెరిగింది. ఈ క్వార్టర్ చివరికి బ్యాంకు మొత్తం ఆస్తుల విలువ రూ. 2,26,385 కోట్లుగా ఉన్నాయి. ఈ ఫలితాలతో కొటక్ మహీంద్ర బ్యాంక్ షేరు 1.7 శాతం లాభాలతో ట్రేడ్ అవుతోంది. -
దూసుకుపోయిన గీతాంజలి
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో ప్రముఖ ఆభరణాల సంస్థ గీతాంజలి జెమ్స్ దూసుకుపోయింది. ఏకీకృత నికర లాభాల్లో దాదాపు మూడు రెట్ల వృద్ధిని నమోదు చేసింది. మంగళవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో రూ 57 కోట్ల నికర లాభాలను గడించినట్టు వెల్లడించింది. గత ఏడాది రూ 19.91 కోట్లుగా ఉంది. దాని నికర ఆదాయం రూ. 3,710 కోట్లకు పెరిగిందని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. 2016-17 సంవత్సరం ఏప్రిల్- జూన్ కాలంలో ఇది రూ.2,845 కోట్లు. ఇక నికర అమ్మకాలపరంగా ఈసారి రూ.2,595 కోట్లను రాబట్టిన సంస్థ..నిరుడు రూ.1,866 కోట్లను అందుకుంది. ఆభరణాల వ్యాపారంలో మంచి వృద్ధిని సాధించింది. రూ. 2,165 నుంచి 2,950 కోట్లకు పెరిగింది. డైమండ్ సెగ్మెంట్లో ఆదాయం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. రూ 848,67 కోట్ల నుంచి రూ 834,82 కోట్లకు తగ్గింది. కాగా దేశీయంలో సుమారు నాలుగువేలకు పైగా విక్రయ కేంద్రాల ద్వారా గీతాంజలి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అలాగే యూరోప్ , పశ్చిమ ఆసియాతోపాటు అమెరికా, చైనా,జపాన్ లలో స్టోర్స్ ఉన్నాయి. -
లాభాల్లో నీరసించిన వొకార్డ్
న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం వొకార్డ్ ఈ ఏడాది ఏకీకృత నికర లాభాల్లో నీరస పడింది. మార్జిన్లు భారీగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం లో నిరుత్సాహకర ఫలితాలు విడుదల చేసింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం దాదాపు 83 శాతం వరకూ క్షీణించి రూ. 16 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆదాయం కూడా 4 శాతం నీరసించి రూ. 1091 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇండియా వ్యాపారం 10 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధానంగా యూఎస్, వర్ధమాన మార్కెట్లలో బిజినెస్ క్షీణించడంతో లాభాలు తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఆదాయంలో 62 శాతం అంతర్జాతీయ మార్కెట్ల నుంచే లభించినట్లు కంపెనీ తెలియజేసింది. అమెరికా ఆదాయం 16 శాతం క్షీణించగా, వర్ధమాన మార్కెట్ల నుంచి కూడా ఆదాయం 16 శాతం తగ్గినట్లు వెల్లడించింది. అయితే యూకే బిజినెస్ 26 శాతం వృద్ది చూపినట్లు పేర్కొంది. ఈ కాలంలో దేశీ మార్కెట్లో 11 కొత్త ఉత్పత్తులను విడుదల చేయగా, మూడు కొత్త ఫైలింగ్స్‌ను చేపట్టామని, యూకే మార్కెట్ నుంచి ఒక ఫైలింగ్‌కు అనుమతి లభించిందని వివరించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 48.5 శాతం క్షీణించి రూ. 85 కోట్లను తాకగా, ఇబిటా మార్జిన్లు 6.7 శాతం పడిపోయి 7.8 శాతానికి చేరాయి. రూ. 10 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదయ్యాయి. ఇతర ఆదాయం మాత్రం రూ. 6.4 కోట్ల నుంచి రూ. 16.9 కోట్లకు ఎగసింది. కాగా కంపెనీ మూడు యూనిట్లలలో తనిఖీ నివేదికలు అందాయని వొకార్డ్ చెప్పింది. అమెరికా ఫూడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ ఆరోపించిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన దశలను ప్రారంభించిందని, పదార్థం పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. -
హ్యుందాయ్ హవా తగ్గుతోందా?
క్యూ1లో 12శాతం పడిపోయిన నికరలాభాలు సియోల్ : సౌత్ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ వరుసగా తొమ్మిదో త్రైమాసికంలో కూడా లాభాలను కోల్పోయింది. హ్యుందాయ్ మోటర్ కు అతి పెద్ద మార్కెటైన చైనాలో, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ కు డిమాండ్ పడిపోవడంతో మొదటి త్రైమాసికంలో నికర లాభాలు 12శాతం పడిపోయాయి. రూ.1,69,027 కోట్లగా(1.69 ట్రిలియన్లు)గా నికర లాభాలను నమోదుచేసినట్టు కంపెనీ ప్రకటించింది. నిర్వహణ లాభాలు కూడా 16 శాతం కిందకు జారి, 1.34 ట్రిలియన్ గా నమోదయ్యాయి. కాగ కంపెనీ రెవెన్యూ 7 శాతం పెరిగి, 22.35 ట్రిలియన్ గా నమోదైంది. హ్యుందాయ్ మోటార్ కు ఈ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు పడిపోయాయి. ఈ అమ్మకాలు 6 శాతం నష్టపోయి, కేవలం 1.1 ట్రిలియన్ వెహికిల్స్ ను మాత్రమే అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది. ఒక్క చైనాలోనే ఈ కంపెనీ అమ్మకాలు 10 శాతం పడిపోయాయని వెల్లడించింది. చిన్న కార్ల కొనుగోలు మీద చైనా పన్నుల కోత విధించినప్పటికీ, అమ్మకాలను మాత్రం పుంజుకోలేకపోయాయని కంపెనీ ఆందోళన వ్యక్తంచేసింది. హ్యుందాయ్ కు బలం, చిన్న,ఇంధన సామర్థ్య సెడాన్ లు కలిగి ఉండటం. గ్లోబల్ ఎకానమీ తిరోగమనంలో నడుస్తున్నప్పటికీ ఈ కంపెనీని ఇండస్ట్రీలో బాగా నడిపించిన శక్తి ఈ వెహికిల్స్ దే. అయితే ఈ మధ్యకాలంలో ఆయిల్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఎక్కువగా గ్యాస్ గజ్లింగ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వైపు మొగ్గుచూపారు. ఈ కారణంతో ఇంధన సామర్థ్యం కలిగిన హ్యుందాయ్ వెహికిల్స్ కు డిమాండ్ తగ్గింది.