breaking news
Punam Pandey
-
దుర్గం చెరువు.. పూనమ్ పాండే
నేడు పూనమ్ షో ఎక్కడ: మరకేష్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ సమయం: రాత్రి 10:00 చలిలో వణుకుతున్న నగరాన్ని న్యూ ఇయర్ ఈవ్ వేడెక్కించనుంది. జూబ్లీహిల్స్‌లోని దుర్గం చెరువు పూనమ్ పాండ్‌గా మారనుంది. వస్త్రధారణలో బహు పొదుపరి, నిరంతర వివాదాలతో తరచు వార్తలకెక్కడంలో కడు గడసరిగా పేరుమోసిన పూనమ్ పాండే తన చిందు చిద్విలాసాలతో హైదరాబాదీలను హీటెక్కించనుంది. తన తొలి తెలుగు చిత్రం ‘మాలిని అండ్ కో’ ప్రోమో కోసం న్యూ ఇయర్ ఈవ్‌కు ఒకరోజు ముందే నగరానికి విచ్చేసిన ఈ బాలీవుడ్ బాంబ్‌షెల్ కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. అవి ఆమె మాటల్లోనే.. వివాదాలే నా విలాసం.. నేను ముంబైలో పుట్టి పెరిగాను. స్కూల్ డేస్ నుంచే వరల్డ్ క్లాస్ టాప్ మోడల్ కావాలని కలలు కనేదాన్ని. అదే దృష్టిలో పెట్టుకుని చదువు పూర్తి చేశాను. అనుకున్నట్లుగానే ఎన్నో మోడలింగ్స్, క్యాలెండర్ యాడ్స్, రియాలిటీ షోస్ చేశాను. నేనందరిలాంటి దాన్ని కాను. నిరంతరం వివాదాలతోనే వార్తల్లో నలుగుతూ పైకొచ్చాను. మంచో, చెడో నాపై చెలరేగిన వివాదాల వల్లనే నాకెన్నో సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో నా సెమీన్యూడ్ ఫొటోస్ జనాల అటెన్షన్ డ్రా చేయడం కోసమే. నేనలా సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకోకుండా ఉంటే, ఇప్పుడు నాకు ఈ అవకాశాలేవీ ఉండేవి కాదు. దానిని కూడా కాంట్రావర్సీ చేస్తే, నేనేం చేయను? ఎనభయ్యేళ్ల వయసులోనూ ఇలానే సెక్సీగా, పర్ఫెక్ట్గా ఉండాలనేదే నా కోరిక. హైదరాబాద్‌తో తెలియని అనుబంధం.. ఇక టాలీవుడ్లో అడుగుపెట్టి, ఒక తెలుగు సినిమా చేయడం నాకు మంచి అనుభూతినిచ్చింది. ఇదే నా మొదటి తెలుగు సినిమా. హైదరాబాద్ లొకేషన్స్‌లోనే ఈ సినిమా షూటింగ్ అంతా జరిగింది. నేను హైదరాబాద్ రావడం కూడా ఇదే మొదటిసారి. ఇక్కడి ప్రజలు నన్ను ఓ ఏంజెల్లా చూసుకుని, ఎంతో ఆదరించారు. నేను ఊహించని విధంగా నన్ను ట్రీట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌తో నాకు ఒక తెలియని అనుబంధం ఏర్పడింది. న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా దుర్గంచెరువు వద్ద స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నా. హైదరాబాద్‌లోని అభిమానుల కోసం కొన్ని సర్ప్రైజింగ్ కాన్సెప్ట్స్, సిజ్లింగ్ డ్యాన్స్ నంబర్స్‌తో న్యూ ఇయర్ బాష్‌ను అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. ఒక తెలుగు సినిమాను, తెలుగు వారితో న్యూఇయర్ బాష్ సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చిన హైదరాబాద్‌ను, 2014 సంవత్సరాన్ని నేను ఎన్నటికీ మరువలేను. - శిరీష చల్లపల్లి -
పూనమ్‌పాండే ‘ఫేస్బుక్’ గల్లంతు
సోషల్ నెట్వర్క్ వెబ్సైట్లలో నిత్యం సందడి చేసే బాలీవుడ్ భామ పూనమ్ పాండే ‘ఫేస్బుక్’ ఖాతా గల్లంతైంది. డీయాక్టివేట్ అయిన ‘ఫేస్బుక్’ ఖాతాను తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియక ఆమె తెగ బాధపడుతోంది. ‘నా ఫేస్బుక్ ఖాతాకు 21 లక్షలకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇది డీయాక్టివేట్ కావడం చాలా బాధగా ఉంది. తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. దీనిని తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఎవరైనా చెప్పరూ..’ అంటూ ‘ట్విట్టర్’లో తన అభిమానులను అభ్యర్థిస్తోంది. ముగ్ధాగాడ్సే మేనేజ్మెంట్ పాఠాలు బాలీవుడ్ భామ ముగ్ధా గాడ్సే మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకుంటోంది. నరేశ్ మల్హోత్రా దర్శకత్వంలోని ‘ఇష్క్నే క్రేజీ కియా’ చిత్రంలోని కార్పొరేట్ మహిళ పాత్ర పోషించనున్న ముగ్ధా, కొద్ది రోజులుగా మేనేజ్మెంట్ పాఠాలతో కుస్తీలు పడుతోంది. తన పాత్ర మరింత సహజంగా ఉండాలనే తపనతో బడా బడా కార్పొరేట్ మహిళా అధికారుల వద్ద చిట్కాలు తెలుసుకుంటూ, వారిని దగ్గరగా పరిశీలిస్తోంది.