breaking news
Private TV channels
-
టీవీ చానళ్లలో ఆ పదం వాడకూడదు
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలకు చెందిన వారి ప్రస్తావన వచ్చినప్పుడు దళితులు అనే పదాన్ని వాడకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) టీవీ చానళ్లకు సూచించింది. ముంబై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంఐబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ప్రవేటు శాటిలైట్ టీవీ చానళ్లకు ఈ నిబంధన వర్తించనుంది. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఈ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంఐబీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎంఐబీ ప్రవేటు చానళ్లకు రాసిన లేఖలో.. మీడియా దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్ కులాలు అనే పదాన్ని వాడాల్సి ఉంటుందని తెలిపింది.దళిత్ అనే పదానికి బదులుగా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఇంగ్లిష్‌లో షెడ్యూల్ క్యాస్ట్ అని గానీ, దేశంలో ఇతర జాతీయ భాషల్లో దానికి సరిపడు అనువాదాన్ని గానీ వాడాల్సి ఉంటుందని.. అధికారిక లావాదేవీలకు, వ్యవహారాలకు, ధృవపత్రాలకు సంబంధించిన వాటిలో ఈ నిబంధన వర్తిస్తుందని కోర్టు తెలిపిందన్న విషయాన్ని ప్రస్తావించింది. కానీ ఈ సూచనలు పాటించకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై ఎంఐబీ స్పష్టతనివ్వలేదు. కాగా ప్రభుత్వ దస్త్రాల్లో, సమాచార మార్పిడిలో దళిత్ అనే పదం వాడకూడదనే పిటిషన్‌పై విచారణ జరిపిన ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఈ మేరకు జూన్‌లో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్ కులాలు వాడాలని మార్చి 15వ తేదీన సర్య్కూలర్ జారీ చేసింది. -
జీవితం నేర్పే పాఠాలు
ఆకాశవాణి, దూరదర్శన్లలో పనిచేసే రోజుల్లో ప్రైవేటు టీవీ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ అనంతరం మాత్రం పాల్గొంటూ వస్తున్నాను. వీటికోసం కొన్ని రోజులు తెల్లవారుఝామునే తయారు కావాల్సి వస్తోంది. నేనైతే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెడుతున్నా కాని, నన్ను స్టూడియోలకు తీసుకువెళ్లడానికి వచ్చే ఛానెల్ కారుడ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి, ‘టిప్పు’ ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. వీళ్లలో రకరకాల వయస్సు వాళ్లు ఉంటారు. పొరుగుజిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి, స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని, బతుకుబండి లాగించేవాళ్లే ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీగా నేను అనుకోలేదు. వాళ్లు కూడా అపార్థం చేసుకోలేదు. కొందరు ‘‘ఎందుకు సార్, మా డ్యూటీ మేం చేస్తున్నాం’’ అని మృదువుగా అనేవారు. కొంతకాలం క్రితం ఓ స్టూడియో నుంచి తిరిగొస్తూ, కూడలి వద్ద సిగ్నల్ పడ్డప్పుడు పర్స్ తీసి డ్రైవర్‌కు పది నోటు తీసిచ్చాను. అతగాడు ఆ నోటు జేబులో పెట్టుకోకుండా, ఒకచోట కారు వేగం తగ్గించి, రోడ్డుపక్కన ముసలి బిచ్చగత్తె చేతిలో పెట్టాడు. అది చిత్రంగా అనిపించి నోరు తెరిచేలోగా ‘మాఫ్ కీజియే సాబ్’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ‘‘ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచైనా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు ఉంటే నీకంటే అవసరం ఎక్కువ ఉన్నవాళ్లకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడమే కష్టం. అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకో కండి’’ అన్నాడు. అనుకోవడానికి ఏముంది, ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను. - భండారు శ్రీనివాసరావు హైదరాబాద్