breaking news
Pooja Kallur
-
మేడమ్ అని కాకుండా సార్ అని పిలిచారు
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో వీకే నరేశ్, శరణ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజా కొల్లూరు దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో పూజా కొల్లూరు మాట్లాడుతూ– ‘‘సైంటిస్ట్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నప్పటికీ సినిమాతో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చని సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నాను. తెలుగులో ‘మార్టిన్ లూథర్ కింగ్’ నా తొలి సినిమా. కానీ ఈ చిత్రం కంటే ముందు కొన్ని హాలీవుడ్ ్రపాజెక్ట్స్తో అసోసియేషన్ ఉంది. కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. ఇక ‘మార్టిన్ లూథర్ కింగ్’ విషయానికి వస్తే.. వై నాట్ స్టూడియోస్ సంస్థ తమిళ చిత్రం ‘మండేలా’ కథను తెలుగులో చె΄్పాలనుకుని, వెంకటేశ్ మహాగారిని సంప్రదించారు. అయితే నిర్మాణంలో భాగమౌతానని, దర్శకత్వం వహించలేనని ఆయన చె΄్పారు. దీంతో నేను దర్శకత్వం వహిస్తానని వెంకటేశ్ మహాగారికి చెప్పడంతో ఆయన వారికి చె΄్పారు. ఓటర్లు వారి ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలన్నది ఈ సినిమా థీమ్. ఓ సామాన్యుడు నటిస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలని సంపూర్ణేష్ని హీరోగా తీసుకోవడం జరిగింది. వెంకటేశ్ మహా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. నేను ఎడిటింగ్ కూడా చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఏ భాషలోనైనా మహిళలకు అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. నేను లేడీ డైరెక్టర్ని అయినా సెట్స్‌లో చాలాసార్లు ఓకే సార్ అన్నారు కానీ మేడమ్ అనలేదు. అంటే లింగ వివక్ష ఎంతలా నాటుకు΄ోయిందో అర్థం చేసుకోవచ్చు. సమస్యలున్నప్పటికీ మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. -
రష్యాలో ఇద్దరు మహారాష్ట్ర విద్యార్థినుల మృతి
న్యూఢిల్లీ/ముంబై: రష్యా తూర్పు ప్రాంతంలోని స్మొలెన్స్క్ మెడికల్ అకాడమీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థినిలు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. వీరిద్దరు మహారాష్ట్రకు చెందినవారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అకాడమీకి భారత ప్రతినిధి బృందం వెళ్లిందని ఆమె తెలిపారు. అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థినిలు మహారాష్ట్రకు చెందినవారు. నవీ ముంబైకి చెందిన పూజా కల్లూర్(22), పుణేకు చెందిన కరిష్మా భోసలే(20) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ స్మొలెన్స్క్ మెడికల్ అకాడమీలో మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు. పూజ, కరిష్మ మరణవార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ వారంలోనే పూజ, కరిష్మ మృతదేహాలు స్వస్థలానికి తరలించనున్నారు.