breaking news
polycet notification
-
పాలిసెట్–2019 నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2019 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి బుధవారం జారీ చేసింది. ఇదివరకే పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్ రాయవచ్చని పేర్కొంది. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 4వ తే దీ సాయంత్రం 5 గంట ల వరకు ఆన్లైన్లో (ఠీఠీఠీ.ఞౌ yఛ్ఛ్టి్టట. nజీఛి.జీn) దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.250 ఫీజు చెల్లించి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొంది. టీఎస్ ఆన్లైన్, మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల ని సూచించింది. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 16న ఉదయం 11 నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 24న ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది. అనంతరం వెబ్ ఆప్షన్లు తీసుకొని ప్రవేశాలు చేపడతామని, పూర్తి స్థాయి షెడ్యూలును తరువాత ప్రకటిస్తామని వివరించింది. వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని తెలిపింది. ఇదీ షెడ్యూలు.. 14–3–2019 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 4–4–2019 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు 16–4–2019 ప్రవేశ పరీక్ష 24–4–2019 ఫలితాలు -
పాలీసెట్ ఎప్పుడో?
నోటిఫికేషన్ కోసం 2.5 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపు పాలిటెక్నిక్‌లో ప్రవేశాలపై రెండు రాష్ట్రాలదీ నిర్లక్ష్య వైఖరే వేర్వేరుగా ప్రవేశాలకు ఫైలు పెట్టినా స్పందించని ప్రభుత్వాలు సాంకేతిక విద్యా మండలి పదో షెడ్యూల్లో ఉన్నందునే ఈ పరిస్థితి సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2015 పరీక్ష నోటిఫికేషన్ కు ఏప్రిల్ వచ్చినా మోక్షం లభించడం లేదు. గత ఏడాది ఈ సమయం నాటికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఈసారి నోటిఫికేషన్ జారీకే అడ్డంకులు తొలగలేదు. దీంతో ఈ ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు ఆలస్యం కావడం తప్పేలా లేదు. రెండు రాష్ట్రాల్లో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు పాలీసెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించే సాంకేతిక విద్యామండలి పదో షెడ్యూల్లో ఉన్నందున.. రెండు రాష్ట్రాలకూ కలిపి ఒకేసారి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలా? అనే అంశం ఎటూ తేలలేదు. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు ఓ నిర్ణయాన్ని తీసుకోవడంలో ఎడతెగని జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు ఆయోమయానికి గురవుతున్నారు. రెండు రాష్ట్రాల్లో 470 పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా వాటిలో 1,45,481 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో తెలంగాణలోని 194 కాలేజీల్లో 61 వేల సీట్లు అందుబాటులో ఉండగా ఏపీలోని 276 కాలేజీల్లో మిగతా సీట్లు ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత ఏడాది 2,54,060 మంది విద్యార్థులు రెండు రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రవేశాల్లో తప్పని ఆలస్యం గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో ఏప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. మే 21న రాత పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపట్టారు. కానీ ఈసారి పాలిటెక్నిక్ ప్రవేశాలు సకాలంలో జరిగేలా లేవు. సాంకేతిక విద్యామండలి పదో షెడ్యూల్లో ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష వల్ల సమస్యలొస్తాయని భావించిన అధికారులు వేర్వేరు పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించారు. కానీ దీనిపై ప్రభుత్వాలు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వాల నుంచి ఆమోదం రావడం, నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను ఆహ్వానించడం, పరీక్ష నిర్వహించడం వంటి కార్యక్రమాలకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.