breaking news
Political cartoonist
-
Cartoonist Mohan: బొమ్మలు చెక్కిన శిల్పం
బొమ్మలు కూడా మాట్లాడతాయి. మాట్లాడ్డమే కాదు జనం తరఫున పోట్లాడతాయి. కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి. కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి. రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి. అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు. బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టి, ఆ చేతిని కదిపే కళాకారుడి మనసును బట్టి, ఆ మనసులో రెపరెపలాడే ఎర్ర జెండా పొగరును బట్టి బొమ్మలు కాలర్లు ఎగరేస్తాయి. అలాంటి బొమ్మల తాలూకు ఓనర్లలో ముఖ్యులు ఆర్టిస్ట్ మోహన్. తాడి మోహన్ రావు అంటే ఎవ్వరికీ తెలీకపోవచ్చు. కానీ కార్టూనిస్ట్ మోహన్ అంటే మాత్రం తెలీని వాళ్లు ఉండరు. మోహన్ అంటే సకల కళా వల్లభుడు. కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, కేరికేచర్లు, కవర్ పేజీ బొమ్మలు, ఉద్యమాలకు కదం తొక్కండర్రా అని కుర్రకారు గుండెల్లో పౌరుషాగ్ని రగిలించే పోస్టర్లు, రాజ్యాధి కారపు దురహంకారాన్ని కాలరు పట్టు కుని నిలదీసి తిరుగుబాటు చేసే జెండా లపై బొమ్మలు, బిగించిన పిడికిళ్లు, కస్సుమని దూసుకుపోయే కొడవళ్లు, యుద్ధభూమికి కదం తొక్కించే లాంగ్ మార్చ్ కాన్వాస్‌లు! మోహన్ అంటే యుద్ధం. అధర్మంపై అన్యాయంపై చిరు నవ్వుతోనే కత్తులు దూసే యుద్ధమే మోహన్! ఎక్కడో ఏలూరులో పుట్టి, అక్కడెక్కడో పశ్చిమబెంగాల్లో జ్ఞానానికి సానపట్టి, విజయవాడ ‘విశాలాంధ్ర’ మీదుగా హైదరాబాద్‌కు తరలి అదే రాజధానిగా కళాకారుల సామ్రా జ్యాన్ని స్థాపించాడు మోహన్. తెలుగునాట పొలిటికల్ కార్టూన్ అంటే ఇలా ఉండాలిరా నాయనా అన్నట్లు వందల వేల కార్టూన్లతో రాజకీయ నేతల గుండెల్లో అణుబాంబులు పేల్చిన ఉగ్రవాది మోహన్. ఎంత పెద్ద నాయకుడైనా సరే భయం లేదు. ఎంత దుర్మార్గపు నాయకుడైనా సరే ఖాతరే లేదు. తిట్టాలనుకుంటే తిట్టేయడమే. కోపం పెద్దదైతే లాగి లెంప కాయలు కొట్టేయడమే. ఎన్టీఆర్ నుండి నేటి కేసీయార్ వరకు మోహన్ కార్టూన్ బారిన పడని నేత లేరు. మోహన్ తండ్రి తాడి అప్పలస్వామి కమ్యూనిస్టు నాయ కులు. నాన్న నీడలో మండుటెండపు ఉద్యమాలు మోహన్ లోని కళాకారుడికి చిన్నప్పుడే ఓ కర్తవ్య బోధ చేసేశాయి. అదే 5 దశాబ్దాల పాటు తెలుగు నాట ఉద్యమ పోస్టర్లపైనా, తిరుగుబాటు జెండాలపైనా పిడికిళ్లు బిగించిన యోధుల విప్లవ నినాదాలు, కసి ఎక్కిన కొడవళ్ల బెదిరింపులు వగైరాల ఎర్రెర్రటి బొమ్మల రూపంలో మోహన్ సంతకం మెరుస్తూనే ఉంది. (క్లిక్: ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?) ప్రభువెక్కిన పల్లకీలు మోసి, వారి అంతఃపుర రాణుల అందాలు పొగిడి వారిచ్చే చిల్లర బహుమతులు మూట కట్టుకుని మురిసిపోయే కళాకారులు కాలగర్భంలో కలిసి పోతారు. ఎవరికీ గుర్తుకు కూడా రారు. పల్లకి నెక్కిన ప్రభువును కాలర్ పట్టుకుని నీ రాజ్యం చాలా అన్యాయంగా ఉంది గురూ అని అనగలిగిన వాడే నిఖార్సయిన వీరుడు. అసలు సిసలు యోధుడు. అలాంటి వారినే తరతరాలుగా జనం గుర్తు పెట్టుకుంటారు. గుర్తుపెట్టు కోవడమేం ఖర్మ గుండెల్లో గుడి కట్టేసి ఆ గుడిలో ఏనిమేషన్ సినిమాలతో పూజలు చేసేస్తారు. అటువంటి అరుదైన యోధుడూ, కళాకారుడూ మన మోహన్! – సీఎన్ఎస్ యాజులు (సెప్టెంబర్ 21న చిత్రకారుడు మోహన్ వర్ధంతి) -
అద్భుత కార్టూన్ వైరల్: ఉద్యోగం పోయింది
ఆయన వేసిన కార్టూన్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు. అద్బుతం, అమోఘం అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ అవార్డు పులిట్జర్ బహుమతికి యోగ్యమైందంటూ పలువురు సెలబ్రిటీలు, ఇతర రాజకీయ విమర్శకులు పొగడ్తల్లో ముంచెత్తారు. కానీ ఆ పొలిటికల్ కార్టూనిస్ట్ మాత్రం ఉద్యోగాన్ని కోల్పోయారు. ఇంతకీ ప్రచురణ సంస్థ ఆగ్రహానికి ఎందుకు గురయ్యారు? ఆయన ఉద్యోగానికి చేటు తెచ్చిన ఆ కార్టూన్ ఏంటి? వలసదారుల అవస్థలపై స్పందించిన కెనడియన్ కార్టూనిస్ట్ మైఖేల్ డి ఆడెర్ ఒక కార్టూన్‌ను ప్రచురించారు. అదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శిస్తూ ఈ చిత్రాన్ని గీసినందుకు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. ఇటీవల ఎల్ సాల్వడార్ నుంచి మెక్సికో ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తండ్రీ బిడ్డలు (ఆస్కార్ అల్బెర్టో మార్టినెజ్ రామిరేజ్, అతని 23 నెలల కుమార్తె వాలెరియా) ప్రాణాలు పోగొట్టుకున్నసంగతి తెలిసిందే. వీరి మృతదేహాల ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో స్పందించిన ఆడెర్ సరిహద్దు వివాదాలపై వ్యంగ్యంగా వలసదారుల మృతదేహాలపై ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్నట్లుగా కార్టూన్ వేశారు. ఇది న్యూ బ్రూన్స్‌విక్‌లోని ఒక ప్రచురణ సంస్థలో ప్రచురితమైంది. ఇది కెనడా, అమెరికా వ్యాప్తంగా పలువురి మనసులను గెల్చుకుంది. కానీ అతని ఉద్యోగం మాత్రం ప్రమాదంలో పడిపోయింది. తనను ఉద్యోగంనుంచి తొలగించారని ఆడెన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో పలువురు కార్టూనిస్టులు ఇతర ప్రముఖులు ఆడెర్కు మద్దతుగా నిలిచారు. The highs and lows of cartooning. Today I was just let go from all newspapers in New Brunswick. #editorialcartooning #nbpoli #editorialcartooning — Michael de Adder (@deAdder) June 28, 2019 Michael de Adder is one of the best in his art form. New Brunswick’s loss here. Keep up the great work @deAdder https://t.co/9VXV8CMG0m — Mark Critch (@markcritch) June 28, 2019 అయితే ట్రంప్‌పై కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అయిన 24 గంటల తరువాత ఆడెర్ను తొలగించారని కెనడియన్ కార్టూనిస్టుల సంఘం అధ్యక్షుడు వెస్ టైరెల్ ఆరోపించారు. 17 సంవత్సరాల పాటు అతను సంస్థకు సేవలందించిన అతని తొలగింపునకు ఎటువంటి కారణం లేదని పేర్కొన్నప్పటికీ ఇది యాదృచ్చికంగా జరిగింది కాదని ఫేస్బుక్ పోస్ట్‌లో కమెంట్ చేశారు. అటు తన కాంట్రాక్ట్ ఇంకా పూర్తి కాలేదనీ, సాంకేతికంగా తనను తొలగించే అధికారం బ్రూన్స్విక్ పత్రికకు లేదని ఆడెర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ట్రంప్ కార్టూన్ విషయంలో ఆడెర్తో ఫ్రీలాన్స్ ఒప్పందాన్ని రద్దు చేసిందన్న వాదన పూర్తిగా తప్పు అని.. అనవసరంగా సోషల్ మీడియాలో ఇది వైరలైంది అని బ్రూన్స్విక్ న్యూస్ ఇంక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అసలు ఆడెర్ ట్రంప్ కార్టూన్ తమకు ఇవ్వలేదంది. తాము ఇప్పటికే మరో కార్టూనిస్ట్‌ను నియమించుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. గత కొన్ని వారాలుగా దీనిపై సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పింది. Cartoon for June 26, 2019 on #trump #BorderCrisis #BORDER #TrumpCamps #TrumpConcentrationCamps pic.twitter.com/Gui8DHsebl — Michael de Adder (@deAdder) June 26, 2019 -
సమ్మోహనుడు
కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్, పెయింటర్, యానిమేటర్, పత్రికా రచయిత... మోహన్ పక్కన ఇవన్నీ పెట్టకపోయినా పర్వాలేదు. మోహన్ అంటే చాలు. ఆ పేరే ఒక ఉనికి. అస్తిత్వం. కర్మాగారం. పొలిటికల్ కార్టూనిస్ట్‌గా మోహన్ తెలుగు పత్రికా రంగంలో చూపిన ప్రభావం, ఆ ప్రభావంతో తయారైన కొత్త తరం అందరికీ తెలుసు. తెలుగుగడ్డ ఉద్యమాల పురిటిగడ్డగా ఎదగడానికి మోహన్ గీత గోడగోడపై ఎలా మండిందో, నిప్పులు ఎలా ఎగచిమ్మిందో అందరికీ తెలుసు. మోహన్ రేఖ జాతీయస్థాయి కార్టూనిస్టుల పక్కన కాలరెత్తుకొని నిలబడి తెలుగువాడి దమ్మును ఎలా నిరూపించిందో కూడా తెలుసు. కాని నిజంగా మోహన్ గురించి ఎందరికి తెలుసు? పాలపిట్ట పత్రిక తెలియచేసే ప్రయత్నం చేసింది. మోహన్‌పై విశేష సంచిక వెలువరించింది. మోహన్‌తో కాకుమాను శ్రీనివాసరావు చేసిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ, శివాజీ, మృత్యుంజయ్, పాండు, అన్వర్, తైదల అంజయ్య, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, చందు సుబ్బారావు, జావేద్ తదితరులు రాసిన వ్యాసాలు, మోహన్ బొమ్మలు... అన్నింటితో పేజీ పేజీన ఉత్సవ సౌరభం. తెలుగు నేలపై ఉద్యమరేఖా వికాసం, కార్టూన్ వికాసం, అందుకై మోహన్ తొలచిన దారి తెలియాలంటే ఈ సంచిక తప్పనిసరిగా చూడాలి. వెల: రూ.30; ప్రతులకు: 040 - 27678430 విశేష సంచిక