breaking news
pdf files
-
గుడ్ న్యూస్: ఉచితంగా మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్
మీరు పీడీఎఫ్ ఫైల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ.2,724 విలువైన మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అందిస్తున్న ఆఫర్ ఇది. ఈ మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ జూలై 3 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కొనాలంటే మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ కోసం రూ.2,724(36.56 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల మైక్రోసాఫ్ట్ యూజర్లు జూలై 3 వరకు పీడీఎఫ్ మేనేజర్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆఫర్ మరో రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు భాగ ఉపయోగపడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో పీడీఎఫ్ ఫైల్స్‌ని మెర్జ్, రీఆర్డర్, స్ప్లిట్, ఎడిటింగ్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ టూల్ ఉపయోగించి ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. రొటేట్, డిలిట్ కూడా చేయొచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎలా డౌన్లోడ్ ఇప్పుడు తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఎలా? మీ మైక్రోసాఫ్ట్ ఖాతా ద్వారా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి పీడీఎఫ్ మేనేజర్ అని టైపు చేయండి. ఇప్పడు మీకు కనిపించే పీడీఎఫ్ మేనేజర్ బ్లూ గెట్ బటన్ మీద క్లిక్ చేయండి మీ వివరాలు ఎంటర్ చేసి సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలి. మీరు ఏ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆ డివైజ్ నుంచే లాగిన్ కావాలి. చదవండి: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్ -
వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్!
న్యూ ఢిల్లీ: ఇటీవలే ఫేస్బుక్ యాజమాన్యంలోకి మారిన మెసేజింగ్ యాప్ వాట్సప్.. మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వారం వ్యవధిలోనే రెండు సరికొత్త అప్డేట్లను వాట్సప్ అందించింది. ఇటీవలే షేర్డ్ లింక్ హిస్టరీ ట్యాబ్‌ను వాట్సప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పీడీఎఫ్ ఫైళ్లను షేర్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. అంతేకాదు ఇతర ఫార్మాట్ల లోని ఫైళ్లను సైతం షేర్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు అందించడానికి సంస్థ కృషి చేస్తోంది. పీడీఎఫ్ ఫార్మాట్లోని ఫైళ్లను షేర్ చేసుకునే సదుపాయం పొందడానికి వాట్సప్ లేటెస్ట్ వెర్షన్‌ను వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీ చాట్ లాంటి పలు చాట్ యాప్‌లతో నెలకొన్న పోటీ దృష్ట్యా.. పలు కొత్త ఫీచర్లను వాట్సప్ ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఎమోజీలలో వివాదాస్పదమైన మిడిల్ ఫింగర్ ఎమోజీని కూడా ప్రవేశపెట్టి వాట్సప్ దూకుడును ప్రదర్శించింది. తమ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరిందని వాట్సప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.