breaking news
paid Anand
-
మేం రెడీ..
నగర పంచాయతీ, స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు బందోబస్తు సిద్ధం 11,500 మంది సిబ్బంది రంగంలోకి.. నక్సల్స్ ప్రభావితమున్న పోలింగ్ స్టేషన్లు 32 అత్యంత సమస్యాత్మకం 56 సమస్యాత్మకం 294 వెల్లడించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సాక్షి,సిటీబ్యూరో: వరుసగా నగర పంచాయతీ, స్థానిక సంస్థ లు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో బం దోబస్తు పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 4372 పోలింగ్ స్టేషన్లున్నాయని, ఇందులో నక్సల్స్ ప్రభావితమున్నవి 32, అత్యంత సమస్యాత్మకం 56, సమస్యాత్మకం 294, మిగతావి సాధారణ పోలింగ్‌స్టేషన్లుగా గుర్తిం చినట్లు పేర్కొన్నారు. గురువారం కమిషనరేట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను జాయింట్ కమిషనర్ గంగాధర్, డీసీపీ రంగారెడ్డితో కలిసి ఆనంద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు : కమిషనరేట్ పరిధిలో పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట నగర పం చాయతీల్లో ఈనెల 30న జరిగే పో లిం గ్‌కు బందోబస్తు సిద్ధం చేశామన్నారు. వచ్చేనెల 6,11 తేదీల్లో జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకూ..: నగరశివారు పరిధిలో వచ్చేనెల 13న జరిగే 21 గ్రామ పంచాయతీలకు సిబ్బందిని సిద్ధం చేశామని, ఇప్పటికే సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలను గుర్తించి ప్రత్యేక పికెటింగ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు : ఏప్రిల్ 30న జరిగే సార్వత్రిక ఎన్నికలకు కూడా బందోబస్తు ప్లాన్ సిద్ధమైందన్నారు. కమిషనరేట్ పరిధిలోకి మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలు, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం,రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా, మరో నాలుగు అసెంబ్లీస్థానాలు చేవెళ్ల, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, యాకుత్పురాలు పాక్షికంగా ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయన్నారు. బందోబస్తు ఇలా : సివిల్ పోలీసులు 8478 మందితో పాటు 274 కేంద్ర సాయుద రిజర్వ్ బలగాలు బందోబస్తుకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. స్టాటిక్ సర్వెలెన్స్ బృందాలు 31, ఫ్లైయింగ్‌స్క్వాడ్స్ 31, మద్యంరవాణా, డబ్బు రవాణా కేసులను అక్కడికక్కడే క్లియర్ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ బృందం ఒకటి ఏర్పాటు చేశామని, దీంతోపాటు పొరుగు జిల్లాల సరిహద్దుల వద్ద 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నమోదైన కేసులు : కమిషనరేట్ పరిధిలో ఉన్న 1463 లెసైన్స్ రివాల్వర్లులో 1407 రివాల్వర్లు డిపాజిట్ అయ్యాయి. పరారీలో ఉన్న 199 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. 93 మద్యం కేసులు నమోదుచేసి 5.60 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోడ్ ఉల్లంఘించిన టీడీపీపై 5, టీఆర్ఎస్పై 5, వైఎస్సార్సీపీపై 3, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, జనసేనలపై ఒక్కొక్క కేసు నమోదయ్యాయని కమిషనర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తని ఖీల్లో రూ.5.40 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. దేశంలోనే అత్యంత పెద్దది మల్కాజిగిరి లోక్‌సభ స్థానమని, ఈ నియోజకవర్గంలో మొత్తం 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఫిర్యాదు చేయాలంటే.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయాలన్నా, సమాచారమందించాలన్నా ఎన్నికల సెల్‌కు ఇన్‌చార్జీగా ఉన్న జాయింట్ పోలీసు కమిషనర్ గంగాధర్, డీసీపీ రంగారెడ్డిలకు 9490617100తోపాటు 040-27853412, 040-27853413, 040-27853418లకు సమాచారమివ్వాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
మరో ఐటీ కారిడార్‌లో ‘పెట్రోలింగ్’
పోచారంలో ప్రారంభించిన కమిషనర్ సీవీ ఆనంద్ 10 బైక్‌లు, 3 కార్లను విరాళంగా ఇచ్చిన ఇన్ఫోసిస్ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మరో ఐటీ కారిడార్ పెట్రోలింగ్‌కు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం శ్రీకారం చుట్టారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అభయ ఘటన నేపథ్యంలో హైటెక్‌సిటీలో మహిళా ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని అధిగమించేందుకు సాఫ్ట్వేర్ కంపెనీల సహకారంతో రూపొందించిన ఐటీ కారిడార్ పెట్రోలింగ్ వ్యవస్థను గత డిసెంబర్ 18న డీజీపీ బి.ప్రసాదరావు ప్రారంభించిన విషయం తెలిసిందే. మాదాపూర్, మియాపూర్, చందానగర్ ప్రాంతాలలో ఐటీ కారిడార్ పెట్రోలింగ్ వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలు రావడంతో పోచారం ఐటీ కారిడార్‌లో కూడా ఇదే పద్ధతిలో పోలిసింగ్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే కమిషనర్ నిర్ణయించారు. ఈ మేరకు గతనెల ఐటీ కంపెనీ యజమానులు, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులతో మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఐటీ కంపెనీలు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు పోచారంలోని ఇన్ఫోసిస్ కంపెనీ సైబరాబాద్ పోలీసులకు అందజేసిన 10 ద్విచక్ర వాహనాలు, మూడు బొలెరో పెట్రోలింగ్ వాహనాలను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఐటీ ఉద్యోగినులకు మరింత భద్రత: సీవీ ఆనంద్ ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్ ఉద్యోగినులకు మరింత రక్షణ అందించడానికి ఐటీ కంపెనీలు సహకరించాలని కోరారు. పెట్రోలింగ్ వాహనాల వల్ల భద్రత మెరుగుపడుతుందన్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ సొసైటీని ఏర్పాటు చేసి అందులో 80 ఐటీ కంపెనీలను సభ్యులుగా చేశామన్నారు. సైబరాబాద్ పరిధిలో గచ్చిబౌలి, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ ఐటీ కారిడార్లుగా ఏర్పడ్డాయన్నారు. ఐటీ కారిడార్ పరిధిలో 45 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చిన ఇన్ఫోసిస్ సంస్థను ఆయన ప్రశంసించారు. ఈ వాహనాలను ఘట్కేసర్, మేడిపల్లి, ఉప్పల్ పోలీస్స్టేషన్ల పరిధిలోని ఐటీ కారిడార్లలో వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్ఫోసిస్ కేంద్ర అధికారి నరసింహన్, ప్రాంతీయాధికారి గుణాల్, అడిషనల్ డీసీపీ క్రైమ్ జి.జానకీ షర్మిల, డీసీపీ నవదీప్‌సింగ్, ఏసీపీ చెన్నయ్య, ఇన్స్పెక్టర్లు వెంకట్‌రెడ్డి, రవికిరణ్‌రెడ్డి, వీవీ చలపతి తదితరులు పాల్గొన్నారు.