breaking news
overhead tanks
-
‘గ్రేటర్’ గ్రామాలకు తీరనున్న దాహార్తి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 187 గ్రామ పంచా యతీలు, మూడు నగర పంచాయతీలకు త్వరలో నీటి కష్టాలు తొలగనున్నాయి. సుమారు రూ.628 కోట్ల అంచనా వ్యయంతో ఆయా గ్రామాల్లో 1,990 కి.మీ. పైపులైన్లు, 400 ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్మించనున్నారు. బుధవారం వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో పలు కంపెనీలు పోటీ పడగా 2.65 శాతం అధికంగా కోట్ చేసిన ఎంఈఐఎల్ (మెగా) ఇంజనీరింగ్ సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. కాగా, ఈ పనులను యాన్యుటీ విధానంలో చేపట్టనున్నారు. ఇందుకు అయిన వ్యయాన్ని సంబంధిత సంస్థకు జల మండలి ఏడేళ్లపాటు చెల్లించనుంది. ఈ పనుల పూర్తయితే ఆయా గ్రామాల్లో సుమారు 25 లక్షల మంది దాహార్తి తీరనుంది. -
మృత్యు ఘంటికలు
రక్షిత మంచినీటి సరఫరా పథకం ఓవర్‌హెడ్ ట్యాంకులు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న ట్యాంకులను నేలమట్టం చేసి జనం ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కూల్చివేతకు నిధులు లేవని గ్రామ పంచాయతీ పాలక మండళ్లు తెగేసి చెప్తున్నాయి. కూల్చి వేయాల్సిన బాధ్యత మీదంటే మీదంటూ గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ అధికారులు ఎవరికి వారుగా తప్పుకుంటున్నారు. -సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో వేల లీటర్ల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకులు 2700కు పైగా ఉన్నాయి. వీటిలో దశాబ్ధాల క్రితం నిర్మిం చిన చాలా ట్యాంకులు శిథిలావస్తకు చేరుకున్నాయి. 78 ఓవర్ హెడ్ ట్యాంకులు కూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం గుర్తించింది. ఇలాంటి ట్యాంకులను నీటిని నిల్వ చేసేందుకు ఉపయోగించవద్దంటూ సంబంధిత గ్రామ పంచాయతీలకు ఆర్డబ్ల్యూఎస్ విభాగం నోటీసులు కూడా జారీచేసింది. ఆర్డబ్ల్యూఎస్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ చాలాచోట్ల శిథిలావస్తకు చేరిన ట్యాంకుల ద్వారానే రక్షిత నీరు సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్యాంకు కూల్చివేతకు రూ.40వేలకు పైగా ఖర్చవుతుందని అధికారులు లెక్కలు వేశారు. అయితే కూల్చివేతకు అవసరమైన నిధులు తమ వద్ద లేవంటూ గ్రామ పంచాయతీలు చేతులెత్తేస్తున్నాయి. ప్రత్యేకంగా నిధులు ఇస్తే తప్ప కూల్చివేతలు చేపట్టలేమంటూ పంచాయతీ పాలకమండళ్లు తెగేసి చెప్తున్నాయి. ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలోనూ ఇదే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రమాదకరంగా మారిన ఓవర్‌హెడ్ ట్యాంకుల కూల్చివేతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని జిల్లాకు చెందిన మంత్రులు కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే నిధులు ఎక్కడ నుంచి సమీకరించాలో స్పష్టత లేకపోవడంతో అధికారులు మౌనం పాటిస్తున్నారు. మరోవైపు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఇవ్వడమే తమ బాధ్యత అని, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఆస్తులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్తున్నారు. ‘టెక్నికల్ జేఈలు గుర్తించిన ట్యాంకులను వినియోగించ వద్దంటూ నోటీసులు జారీ చేశామని’ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృపాకర్ రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. కొరవడిన సమన్వయం ఏళ్ల తరబడి ట్యాంకుల మరమ్మతు, నిర్వహణ పట్టించుకోకపోవడం వల్లే జీవిత కా లం తగ్గి శిథిలావస్తకు చేరుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ట్యాంకుల శుద్ధి పేరిట బ్లీచింగ్ కోసం నిధులు ఖర్చు చేసిన ట్లు లెక్కలు చూపుతున్న గ్రామ పంచాయతీలు మరమ్మతులపై మాత్రం దృష్టి సా రించడం లేదు. ట్యాంకుల కూల్చివేతపై జిల్లా పంచాయతీ కార్యాల యం స్పందన ఆర్డబ్ల్యూఎస్ వివరణకు పూర్తి భిన్నంగా కని పిస్తోంది. శిథిలావస్తలో ఉన్న ట్యాంకుల కూల్చివేతకు సాంకేతిక అంశాలు ముడిపడి ఉ న్నందున ఆర్డబ్ల్యూఎస్ సహకారంతోనే సాధ్యమవుతుం దని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి వెల్లడి ంచారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ట్యాంకుల కూల్చివేతల గురించి త్వరలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చిస్తామని డీపీఓ వెల్లడించారు. -
సమస్యలు సవాలక్ష
పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. వేసవిలో అయితే మరీ కష్టంగా ఉంటోంది. పైపు లైను లీకేజీలతో నీరు కలుషితమవుతోంది. దీంతో మంచినీరు కొని తాగాల్సి వస్తోంది. పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నం. కాలువల్లో నీరు సక్రమంగా ముందుకు పారడం లేదు. దీంతో దోమలతో అల్లాడిపోతున్నాం. వేకాదు.. మరెన్నో సమస్యలను సత్తెనపల్లి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. జనాభాకు సరిపడా మంచినీరు సమృద్ధిగా ఉన్నా తరచూ పైపుల లీకేజీల కారణంగా మంచినీరు అందడం లేదు. రూ.14.50 కోట్లతో లక్కరాజుగార్లపాడు రోడ్డులో 120 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసి చెరువు తవ్వించారు. రూ.20.06 కోట్ల యూఐడీఎస్ఎస్ఎంటీ నిధులు, హడ్కో కింద రూ.14 కోట్లు ఖర్చు చేసి రిజర్వాయర్లు, సమ్మర్ స్టోరేజీ, ఫిల్టరేషన్ ప్లాంట్లు, ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. 60 కిలోమీటర్ల వరకు పైపులైను ఏర్పాటు చేశారు. తరచూ పైపులైనుల లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతుండటంతో పట్టణ ప్రజలు డబ్బా నీటిని కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి నెలకొంది. శివారు కాలనీలకు ట్యాంకర్ల నీరే గత్యంతరం. పట్టణంలోని అన్ని వార్డుల్లో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రహదారులపైకి కూడా వచ్చి వాహనచోదకులను ఇబ్బందులు పెడుతున్నాయి. వాటి దాడిలో స్థానికులు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. పురపాలక సంఘ పరిధిలో కొన్ని చోట్ల డ్రెయినేజీలు ఆక్రమణలకు గురయ్యాయి. పట్టణం మొత్తం మీద మురుగునీరు పారేందుకు సక్రమమైన వ్యవస్థ లేదు. పారిశుద్ధ్యానికి ఏడాదికి రూ.1.80 కోట్లు పురపాలక సంఘం ఖర్చు చేస్తుంది. రోజుకు 48 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ చేస్తున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు చేర్చాలి. అలాకాకుండా రైల్వేస్టేషన్ రోడ్డులో ఎక్కడపడితే అక్కడ నిల్వ చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 12వ ఆర్థిక సంఘం నిధులు 1.50 కోట్లు ఖర్చు చేసినా పూర్తిస్థాయిలో డంపింగ్ నిర్మాణం మాత్రం జరుగలేదు.పట్టణంలోని రహదారులను సిమెంటు రోడ్లుగా మార్చారు. కొన్ని చోట్ల సిమెంటు రోడ్లు బీటలు వేసి ఇందులోని రాళ్లు పైకిలేచి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వర్షం వస్తే సత్తెనపల్లి లోతట్టు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండదు. ప్రధానంగా నాగన్నకుం ట, సుందరయ్య కాలనీ, వెంకటపతి కాలనీ, దోభీ ఘాట్ ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షం కురిసినా వర్షపు నీరు గృహాల్లోకి చేరుతుంది. ఈ సమస్య పరిష్కారానికి స్ట్రామ్‌వాటర్ డ్రెయిన్ నిర్మాణమే మార్గమని భావి ంచినప్పటికీ ప్రతిపాదనలు పంపారే తప్ప ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. పట్టణంలో ఏ వార్డులో చూసినా విద్యుద్దీపాలు సరిగా వెలగక అలంకార ప్రాయంగా ఉంటున్నాయి. ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ పరిస్థితి దాదాపు ఇంతే. మున్సిపాలిటీ నెలకు విద్యుత్‌బిల్లుల కింద రూ.2.10 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. దీని నిర్వహణకు రూ.50 నుంచి రూ.లక్ష వరకు అవుతున్నాయి. ఇదిలా ఉంటే పట్టణంలో లక్కరాజుగార్లపాడు బస్టాండ్‌సెంటర్, ఎఫ్‌సీఐ ప్రాంతాల్లో కొన్ని వీధి దీపాలు నిత్యం వెలుగుతూ విద్యుత్ వృధా అవుతుంది. దీంతో నెలకు రూ.30 వేల విద్యుత్ వృధాగా పోతోంది.సత్తెనపల్లిలో పార్కు ఏరియా అని పేరుంది తప్ప, అక్కడ సేద తీరడానికి పార్కు మాత్రం లేదు. రైల్వేస్టేషన్ రోడ్డులోని చెరువు స్థలం పార్కుగా నిర్మించేందుకు రూ.2.2 కోట్లు ఖర్చు చేశారు. పూర్తిస్థాయిలో పనులు జరుగకపోవడంతో ఇంకా వాడుకలోకి రాలేదు. పట్టణంలో పూర్తిస్థాయిలో బైపాస్ రహదారులు లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 50వేల పైనే వాహనాలు పట్టణంలోకి వచ్చి పోతుండటంతో ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది. కోతుల బెడద ఎక్కువగా ఉంది. పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పార్కు ఏరియాలో కోతులు ఇళ్లపైకి గుంపులుగా చేరి దుస్తులు, వస్తువులను తీసుకెళ్లడం, పిల్లలపైకి వచ్చి గాయపర్చడం వంటివి చేస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు. చెత్తను నిర్వహణ సరిగా లేదు.. పట్టణంలో సేకరించిన చెత్తచెదారాన్ని సక్రమంగా డంపింగ్ యార్డుకు పారిశుద్ధ్య కార్మికులు చేర్చడం లేదు. రైల్వేస్టేషన్ రోడ్డులో రహదారి పక్కన పోస్తున్నారు. దీంతో రాకపోకల సమయంలో దుర్గంధం భరించలేకపోతున్నాము.