breaking news
Opposition Altitudes
-
Britain general elections: సునాక్ ఎదురీత!
బ్రిటన్‌లో పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడనుందా? భారత మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుందా? అవుననే అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిదాకా ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తారస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో రిషి అనూహ్యంగా జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని సర్వేలంటున్నాయి. విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. స్వయానా రిషీ కూడా ఎదురీదుతున్నారని, సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా కోల్పోవచ్చని సావంత పోల్ పేర్కొంది! అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి నిలిచిపోతారు...ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర. ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో వచి్చన 131 సీట్లే అత్యల్పం. ఈసారి ఆ రికార్డును అధిగమించవచ్చని సర్వేలంటున్నాయి. ‘‘సునాక్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని కన్జర్వేటివ్‌ల కంచుకోటైన తన సొంత పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోవచ్చు. ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌తో సహా పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదు’’ అని సావంత పోల్ పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పక పోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత సంతతికి చెందిన వారు ఈసారి కన్జర్వేటివ్ పారీ్టకి ఓటేయకపోవచ్చనేది పోల్స్టర్ల అంచనా. లేబర్ పారీ్టకి 425కు పైగా సీట్లు...! హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 425కు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 108 స్థానాలకు పరిమితమవుతుందని యూగవ్, కేవలం 53 స్థానాలకే పరిమితమవుతారని సావంత పోల్ పేర్కొన్నాయి. సావంత అయితే లేబర్ పార్టీకి దాని చరిత్రలోనే అత్యధికంగా 516 సీట్లు రావచ్చని అంచనా వేయడం విశేషం! కన్జర్వేటివ్‌లకు 72కు మించబోవని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6 శాతం ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీకి 32.1 శాతం ఓట్లతో 202 స్థానాలు దక్కాయి. ఆకట్టుకుంటున్న కైర్ స్టార్మర్ ‘లెఫ్టీ లండన్ లాయర్’గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పారీ్టలో ఆయన జోష్ నింపుతున్నారు. ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామనే మామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన దాత అయిన బిలియనీర్ జాన్ కాడ్వెల్ కూడా ఈసారి లేబర్ పారీ్టకి మద్దతిస్తున్నారు. తాను లేబర్ పారీ్టకే ఓటేస్తానని బాహాటంగా చెబుతున్నారు. అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు.ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలెన్నో... బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా అనంతరం చీటికీమాటికీ ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి చేటు చేసింది. థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి రూపంలో ఏకంగా నలుగురు ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులే కొనసాగిన ట్రస్ పారీ్టకి గట్టి నష్టాన్ని కలిగించారని, దాన్ని సునాక్ పూడ్చలేకపోయారని అంటున్నారు.→ 2022 అక్టోబర్‌లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణ భారాన్ని, నేషనల్ హెల్త్ సరీ్వస్ వెయిటింగ్ జాబితాను తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయలేకపోగా సంప్రదాయ ఓటర్లనూ మెప్పించలేకపోయారని విమర్శ ఉంది.→ ఐదేళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలు పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలొచ్చాయి. → వీటికి తోడు 14 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.→ రిఫార్మ్ యూకే పార్టీ పుంజుకోవడం కూడా కన్జర్వేటివ్‌లను దెబ్బ తీయనుంది. ఈ పారీ్టకి 15 శాతం ఓట్ల వాటా ఉంది. ఈసారి చాలా స్థానాల్లో కన్జర్వేటివ్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
వ్యూహాత్మకంగా చెక్!
- విపక్షాల ప్లాన్‌ను ముందే గ్రహించిన అధికారపక్షం - వాయిదాలు, సస్పెన్షన్లతో వారికి ప్రచారం వస్తుందనే సభ వాయిదా సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల ఎత్తులను ముందే గ్రహించిన అధికార పక్షం.. వాటికి వ్యూహాత్మకంగా చెక్ పెట్టిం ది. రుణమాఫీని (మిగిలిన యాభై శాతం) ఒకే విడతలో బ్యాంకులకు చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచే అసెంబ్లీలో అనుసరించాల్సిన ప్రణాళికను సిద్ధం చేసుకున్న విపక్షాలు.. వ్యవసాయ మంత్రి ప్రకటన తరువాత దాన్ని ఆచరణలో పెట్టాలని భావించాయి. కానీ వివరణలు ముగియగానే స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో గురువారం ఉదయం సభ ప్రారంభం కావడంతోనే విపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తి.. గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిం చాయి. దీనిని పసిగట్టిన అధికారపక్షం వారికి అవకాశం ఇవ్వకుండా కొద్దిసేపట్లోనే సభను సోమవారానికి వాయిదా వేసింది. మధ్యలో మూడురోజుల పాటు సమావేశాలు లేనందున ఈ సమస్య సమసిపోతుందని భావించింది. అనూహ్యంగా సభ వాయిదాతో బిత్తరపోయిన విపక్ష సభ్యులు.. అసెంబ్లీ బయట కొద్దిసేపు ధర్నా చేయడం తప్పితే మొత్తం అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో విఫలమయ్యారు. ఏదో ఒక సంచలనం సృష్టించడానికి ప్రతిపక్షాలన్నీ ప్రయత్నిస్తాయని టీఆర్ఎస్ అంచనా వేసిందని.. అందుకే వారికి ఏమాత్రం అవకాశమివ్వకుండా కొద్దిసేపు గొడవ జరగ్గానే సోమవారానికి సభ వాయిదా పడేలా పావులు కదిపిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు రైతుల ఆత్మహత్యలపై రెండు రోజుల పాటు జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలన్నీ సంయమనంతో వ్యవహరించాయి. ప్రభుత్వం చెప్పేదంతా విన్నాయి. కానీ,చివరికి ప్రభుత్వం వలలో విపక్షాలు చిక్కాయనే అభిప్రాయం వస్తోంది. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర విపక్షాల సభ్యులు కూడా ప్రతిపక్షాలు ఫెయిలయ్యాన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నారు. వారికి ప్రచారం ఎందుకని..? విపక్షాలను నియంత్రించడానికి కొద్దిసేపు సభను వాయిదా వేసినా ప్రయోజనం ఉండదని అధికారపక్షం భావించింది. తిరిగి సభ మొదలుకాగానే అదే గందరగోళం సృష్టించే అవకాశం ఉందని.. ఇది వారికి మీడియాలో ప్రచారం క ల్పించడం మినహా మరొకటి కాదనే భావన వ్యక్తమైంది. రైతుల సమస్యలపై రెండు రోజుల్లో ఏకంగా 12గంటల పాటు చర్చ జరిగాక కూడా ఆ అంశాన్ని పట్టుకుని ప్రతిపక్షాలు భీష్మించి, సభను రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తున్నందునే వాయిదా నిర్ణయం తీసుకుని ఉంటారని చెబుతున్నారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్న సమయంలో.. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఒకే దగ్గర కూర్చుని ముచ్చటించారు. తర్వాత కొద్దిసేపటికే సభను స్పీకర్ వాయిదా వేశారు.