breaking news
OP departments
-
ఓపీ సేవలు అదనం?
మెదక్‌జోన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. వైద్య సిబ్బందిని నియమించడంతోపాటు రోగులసంఖ్యకు అనుగుణంగా ఆయా ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. ఆస్పత్రి అప్‌గ్రేడ్ చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఒకప్పుడు సర్కార్ దవాఖానా అంటేనే భయపడే వారు ప్రస్తుతం బారులు తీరి చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. బయటనుంచి వచ్చే రోగులకు (ఓపీ) చికిత్స అందించే సమయం ప్రస్తుతం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగుతోంది. ఈ లెక్కన రోజుకు 3గంటలు మాత్రమే సేవలు అందుతున్నాయి. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్న క్రమంలో జిల్లా నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారికి చికిత్స అందకుండానే సమయం దాటిపోతుండడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బయటనుంచి వచ్చే రోగులకు చికిత్సలు అందజేసేలా సమయాన్ని పొడిగించినట్లు తెలిసింది. ఇకపై నిత్యం 5గంటలపాటు వైద్య సేవలు అందనున్నాయి. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సైతం ఈ సమయం మారనుంది. డయాగ్నస్టిక్ (ల్యాబ్) సేవల సమయాన్ని సైతం అదనంగా రెండు గంటలు పెంచనున్నారు. ఆదేశాలు రాగానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే ఓపీ సమయం అదనంగా రెండు గంటలు పెంపు విషయం ఇంకా అధికారికంగా అందలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఆదేశాలు రాలేదని భావిస్తున్నాం. ఆదేశాలు రాగానే ఉదయం సమయాన్ని అమలు చేస్తాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి -
ఓపిక పట్టాల్సిందే
* ఓపీ విభాగాలలో వైద్య సేవలకు తిప్పలు * శస్త్ర చికిత్సలపై పాక్షిక ప్రభావం * జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రారంభం విశాఖ మెడికల్: ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధవారం జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద సమావేశమై ప్లకార్డులు ప్రదర్శించి మౌన నిరసన చేపట్టారు. పోస్టుగ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్ వైద్యులు, హౌస్ సర్జన్లు పెద్ద సంఖ్యలో తొలిరోజు ఓపీ, వార్డు వైద్య సేవలు బహిష్కరించారు. అత్యవసర వైద్య సేవలకు హాజరయ్యారు. కేజీహెచ్‌తో పాటు ప్రభుత్వ విక్టోరియా ప్రసూతి ఆసుపత్రి, ప్రాంతీయ కంటి, ఈఎన్టీ, ఛాతి, అంటువ్యాధులు, ఆర్సీడీ, ప్రభుత్వ మానసిక ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్, వార్డు వైద్య సేవలకు అంతరాయం కలిగింది. ఉదయం 8 గంటలకే కేజి హెచ్ ఓపికి చేరుకున్నా 10 గంటల వరకు తాళాలు తెరవకపోవడంతో రోగులు బారులు తీరారు. మెడిసిన్ ఓపీ విభాగానికి 11 గంటల వరకు వైద్యులు రాక రోగుల తాకిడి కనిపించింది. 11 గంటల తర్వాత వైద్యులు ఒంటి గంటలోపే రోగులను నిమిషాల్లో చూసి పరీక్షలు రాసి పంపారు. రోగులు మూకుమ్మడిగా ఎక్స్‌రే, క్లినికల్ ల్యాబ్‌కు పోటెత్తారు. వార్డుల్లో రోగులు సకాలంలో చికిత్స అందక అవస్థలు పడ్డారు. ఉదయం ఓపీలో రోగులను చూసిన సర్వీస్ పీజీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మధ్యాహ్నం వార్డులకు వచ్చారు. కార్డియాలజీ, కి డ్నీ, ప్రసూతి, కాలిన గాయాలు, పిల్లల శస్త్ర చికిత్స, న్యూరోసర్జరీ, ఉదరకోస వైద్య విభాగాలు వంటి కీలక వార్డుల్లో రోగులు సకాలంలో చికిత్సలందక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ విక్టోరియా(ఘోషా)ఆసుపత్రిలో గర్భిణులు యాంటీనేటర్ల తనిఖీలు ఆలస్యంగా జరిగాయి. నవజాత శిశు చికిత్స విభాగం(ఎస్ఎన్సీయూ)లో శిశువుల చికిత్సకు అంతరాయం ఏర్పడింది. ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో 28 మంది పీజీలు, ముగ్గురు సీనియర్ రెసిడెంట్లు, ఎనిమిది మంది హౌస్ సర్జన్లు సమ్మెలో పాల్గొనడంతో ఓపీ రోగులు అవస్థలు పడ్డారు. ఇక్కడ ఐదుగురు సర్వీస్ పీజీలు మాత్రమే విధులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేసిన రోగులను సమ్మె కారణంగా నిలిపేశారు. ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి ఓపీ రోగుల తాకిడి ఎక్కువైంది. ఈఎన్టీ, ఆర్సీడీ, మానసిక ఆసుపత్రుల్లో కూడా రోగులు ఇబ్బందులు పడ్డారు. సమ్మె ప్రభావం అనుబంధ ఆసుపత్రుల్లోని తొలి రోజు శస్త్రచికిత్సలపై పాక్షిక ప్రభావం చూపింది. జూనియర్ డాక్టర్ల సంఘం అద్యక్ష కార్యదర్శులు డాక్టర్ షాన్వాజ్, డాక్టర్ నాగచైతన్యలు మాట్లాడుతూ ప్రభుత్వం జూనియర్ వైద్యులచే వెట్టిచాకిరీ చేయించుకుంటుందని ఆరోపించారు. మెయిన్ గేటు వద్ద మౌన నిరసనలో ఆంధ్ర వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రసాద్, సమన్వయకర్త డాక్టర్ శోభన్, రాజేష్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.