breaking news
Old building collapse
-
కూలిన శ్లాబ్
-
కూలిన శ్లాబ్ : చిన్నారి మృతి
కాకినాడ నగరంలోని జగన్నాథపురం పరదేశీ పేటలోని శ్లాబ్ మంగళవారం కుప్పకూలింది. ఆ ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మృతి చెందగా, ఆ చిన్నారి తల్లికి తీవ్రగాయాలయ్యాయి. తల్లిని నగరంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఉదయం పరదేశీ పేటలో శ్లాబ్ కుప్పకూలింది. శ్లాబ్ కూలిన ఘటనపై ఘటనపై సమాచారం అందుకున్న కార్పొరేషన్ ఉన్నతాధికారులు,పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కార్పొరేషన్ సిబ్బంది, స్థానికులు సహాయంతో శిథిలాలను తొలగించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.