breaking news
nuvosport
-
మహీంద్రా నుంచి ‘నువోస్పోర్ట్’
ముంబై: దిగ్గజ వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా కాంపాక్ట్ ఎస్యూవీ ‘నువోస్పోర్ట్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.7.35 లక్షలు-రూ.9.76 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ థానే) ఉంది. ఇది ఎన్4, ఎన్6, ఎన్8 అనే వేరియంట్లలోనూ, ఎన్4 ప్లస్, ఎన్6 ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్), ఎన్8 ఏఎంటీ అనే సబ్ వేరియంట్లలోనూ అందుబాటులో ఉండనున్నది. ఎరుపు, తెలుపు, నలుపు, ఆరంజ్, బ్లూ, సిల్వర్ అనే ఆరు రంగుల్లో లభ్యంకానున్న ‘నువోస్పోర్ట్’లో 1.5 లీటర్ డీజిల్ 3 సిలిండర్ ఎంహక్80 ఇంజిన్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, ఆకట్టుకునే డిజైన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఏవీఎన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 సీటర్, అలాయ్ వీల్స్, ఏబీఎస్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది లీటరుకు 17.45 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని తెలిపింది. -
మహీంద్రా కొత్త ఎస్యూవీ పేరు నువొస్పోర్ట్
వచ్చే నెల 4న మార్కెట్లోకి .. ఫొటోల విడుదల ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఎస్యూవీను వచ్చే నెల 4న మార్కెట్లోకి తేనున్నది. నువోస్పోర్ట్ పేరుతో తామందిస్తున్న ఈ కొత్త ఎస్‌యూవీని స్కార్పియో ప్లాట్ఫార్మ్పైననే రూపొందిస్తున్నామని తెలిపింది. ఈ ఎస్యూవీ ఇంజిన్ వివరాలు, ధర, ఇతర ప్రత్యేకతలను వెల్లడించలేదు. మంగళవారం ఈ కారు ఫొటోలను మాత్రంవిడుదల చేసింది. ఫోర్డ్ ఇకోస్పోర్ట్, మారుతీ విటారా బ్రెజ్జాలకు నువొస్పోర్ట్ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.