NTTPS
-
విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నిరంతరం నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ను సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్(ఏపీ జెన్కో) మరో ముందడుగు వేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్‌ను ఆదివారం విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. ఈ యూనిట్ బాయిలర్ సూపర్ క్రిటికల్ సాంకేతికత, శక్తి సామర్థ్య టర్బైన్, జనరేటర్‌తో 80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. నీటిని ఆదా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. యూనిట్‌ను పూర్తి లోడ్‌తో నడపడానికి రోజుకు దాదాపు 9,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమవుతుంది. విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బూడిద వృథా అవ్వకుండా వంద శాతం వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవలే నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో కూడా 800 మెగావాట్ల యూనిట్–3 వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. ఎన్టీటీపీఎస్లో కొత్త యూనిట్ ట్రయల్ ఆపరేషన్‌తో ఏపీ జెన్కో థర్మల్ ఇన్స్టాల్డ్ సామర్థ్యం 8,789 మెగావాట్లకు చేరుకుంది. ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో రెండు 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్లు ఏపీలోనే ప్రారంభమవ్వడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్‌కు ఏపీ జెన్కో రోజూ 102 నుంచి 105 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఇది మొత్తం వినియోగంలో దాదాపు 40 నుంచి 45 శాతంగా ఉంది. జూలై నెలాఖరుకల్లా వాణిజ్య ఉత్పత్తి.. కొత్త యూనిట్ వాణిజ్య ఉత్పత్తిని వచ్చే నెల చివరికల్లా మొదలయ్యేలా చూడాలని ఏపీ జెన్కో, బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. గ్రిడ్ అనుసంధానం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన విద్యుత్ ఉత్పత్తిని సాధించాలన్నారు. విద్యుత్ రంగానికి సీఎం వైఎస్ జగన్, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. అత్యుత్తమ విధానాలు అవలంభించడానికి, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో, అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏపీ జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖరరాజు, బి.వెంకటేశులురెడ్డి, సయ్యద్ రఫీ, సత్యనారాయణ, ఆంటోనీ రాజా పాల్గొన్నారు. -
లిఫ్ట్ వైరు తెగి ఇద్దరు కార్మికుల మృతి
ఇబ్రహీంపట్నం: లిఫ్ట్ వైరు తెగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన శనివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ప్లాంట్ (ఎన్టీటీపీఎస్) ప్రాంగణంలో జరిగింది. ఎన్టీటీపీఎస్లో నిర్మిస్తున్న 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో పని చేసేందుకు ఉదయం 9గంటలకు కార్మికులు వచ్చారు. ప్లాంట్‌లోని 16వ చానల్ (అంతస్తు)లో పని చేసే కార్మికులు 20మంది కిందకు వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ కిందకు వచ్చిన తర్వాత 18 మంది దిగారు. జార్ఖండ్‌కు చెందిన కార్మికులు చోటూ కుమార్‌సింగ్ (23), జితేంద్రసింగ్ (24) లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా, ఒక్కసారిగా డోరు మూసుకుపోయి మళ్లీ పైకి వెళ్లిపోయింది. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న 16వ చానల్‌కు వెళ్లిన తర్వాత లిఫ్ట్ వైరు తెగి కిందపడిపోయింది. లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన చోటూ కుమార్‌సింగ్, జితేంద్రసింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని సహచర కార్మికులు బయటకు తీసి ఎన్టీటీపీఎస్ బోర్డు వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పది మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో ఒకేసారి 20మంది రాకపోకలు సాగిస్తున్నారని, మెటీరియల్ కూడా దానిలోనే తరలిస్తున్నారని, అధిక బరువు వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. భద్రత వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎన్టీటీపీఎస్ ప్లాంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని వివిధ పార్టీల నాయకులు ప్లాంట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సీఐ పి.శ్రీను నేతృత్వంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
ఎన్టీటీపీఎస్‌పై ప్రైవేటీకరణ కత్తి
– ఉత్పత్తిని అందుకే తగ్గించారు – వేలాది కార్మికుల శ్రమను బూడిదలో పోయొద్దు – ఏఐటీయూసీ నేత కోటేశ్వరరావు విజయవాడ (ఇబ్రహీంపట్నం): ఎన్టీటీపీఎస్ సంస్థను ప్రైవేటీకరించబోతున్నారనే సందేహంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అన్నారు. ఇబ్రహీంపట్న ఏఐటీయూసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్టీటీపీఎస్ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేసే సంస్థ ప్రస్తుతం కేవలం 700 మెగావాట్లనే ఉత్పత్తి చేస్తోందని అన్నారు. సుమారు 5వేలమంది కార్మికులు అహర్నిశలు పనిచేసి అనేక అవార్డు సాధించిన పరిశ్రమను దెబ్బతీసే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అమ్మేది చవక... కొనేది ఖరీదు సుమారు 1,000 మెగావాట్ల ఉత్పత్తిని నిలిపివేసి ప్రైవేట్ సంస్థల నుంచి యూనిట్ రూ.4.80తో కొనుగోలు చేయటం వలన ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసినట్లు ఉద్యోగుల్లో అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. ప్లాంటులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రూ.1.45 ఆపైన విక్రయిస్తూ, ప్రైవేట్ సంస్థలకు అధికధర చెల్లించి కొనుగోలు చేయటం ఏమిటని గట్టిగా ప్రశ్నించారు. సమావేశంలో మైలవరం నియోజకవర్గం కార్యదర్శి బుడ్డి రమేష్, జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు మల్నీడు యల్లమందా రావు పాల్గొన్నారు. -
సాంకేతిక పద్ధతులతోనే గుర్తింపు
ఎన్టీటీపీఎస్ సీఈ ప్రభాకరరావు ఇబ్రహీంపట్నం: నూతన సాంకేతిక పద్ధతులు అవలంభించటం వల్లే జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ రావి ప్రభాకరరావు అన్నారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌కు జాతీయస్థాయిలో ఉత్తమ సేఫ్టీ మేనేజ్మెంట్ గ్రీన్‌టెక్ (గోల్డ్) అవార్డు లభించింది. జీరోస్థాయి ప్రమాద రేటును సాధించినందుకు ఢిల్లీకి చెందిన గ్రీన్‌టెక్ ఫౌండేషన్ వారు ఆగస్టు 29న గోవాలో నిర్వహించిన సమావేశంలో ఈ అవార్డును సీఈ అందజేశారు. గురువారం ఎన్టీటీపీఎస్లో అభినందనసభ నిర్వహించారు. సీఈ మాట్లాడుతూ ఉద్యోగుల నిరంతర కృషి వలనే ఈ అవార్డు దక్కిందని పేర్కొన్నారు. మూడేళ్లుగా సంస్థలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా విధులు నిర్వహించటం సంస్థకు గర్వకారణమన్నారు. కార్మిక సంఘాలు కూడా భద్రత విషయంలో శ్రద్ధ చూపాయని కొనియాడారు. సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, యూనియన్, అసోసియేషన్ నాయకులు, కార్మికులను సత్కరించారు. సీఈ ప్రభాకరరావును సన్మానించారు. కార్యక్రమంలో ఏపీజెన్కో శిక్షణా కేంద్రం సీఈ పద్మసుజాత, పర్యవేక్షక ఇంజినీర్లు మురళీకృష్ణ, నవీన్గౌతం, రమేష్‌బాబు, జవహర్, శ్రీరాములు, శేఖర్, గౌరీపతి, సాంబశివరావు, కర్మాగారాల మేనేజర్ కాండ్రు మైసూర్‌బాబు, డిప్యూటీ కార్యదర్శి భాస్కరరావు, ఏడీఈ శ్రీనివాసరావు, భద్రతాధికారి నాగబాబు, అప్పారావు, కార్మికులు పాల్గొన్నారు. -
పలు ప్లాంట్లలో 2,160 మెగావాట్లకు గండి
-
సమ్మె చీకట్లు
* ఉద్యోగుల సమ్మెతో నిలిచిన కరెంటు ఉత్పత్తి * పలు ప్లాంట్లలో 2,160 మెగావాట్లకు గండి * రాష్ట్రవ్యాప్తంగా అనేక ఫీడర్లకు సరఫరా కట్ * ఆర్టీపీపీ, ఎన్టీటీపీఎస్, కేటీపీఎస్‌లో యూనిట్ల మూత * ఫిట్మెంట్ బదులుగా ఐఆర్ ఇస్తామన్న యాజమాన్యం * దానిపై వివరంగా చర్చించలేదన్న జేఏసీ * ఆదివారం రాత్రి జరిగిన చర్చలూ విఫలం * అంధకారంలో విజయవాడ, ఇతర పట్టణాలు, వందలాది గ్రామాలు * నేడు మళ్లీ చర్చలు * సమ్మె కొనసాగితే సగం రాష్ట్రానికి విద్యుత్ సరఫరా బంద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తింది. వేతన సవరణ (పీఆర్సీ) అమలుపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఉధృతరూపం దాల్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక విద్యుత్ ప్లాంట్లలో 2160 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. డిమాండ్‌కు సరిపడినంత విద్యుత్ అందుబాటులో లేక అధికారులు అనేక ఫీడర్లకు సరఫరాను నిలిపివేశారు. విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో ఇప్పటికే 210 మెగావాట్ల ఒక యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోరుుంది. ఇప్పటికే విజయవాడ నగరాన్ని చీకట్లు కమ్ముకున్నారుు. రాష్ట్రంలోని పలు పట్టణాలు, వందలాది గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నారుు. ఎన్టీటీపీఎస్లో యూనిట్లు ట్రిప్ అరుుతే రాష్ట్రంలోని మిగిలిన థర్మల్ స్టేషన్లలో కూడా యూనిట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే దక్షిణాది గ్రిడ్‌పై ప్రభావం పడి కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళలకు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, యూజమాన్యం మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యూరుు. సోమవారం ఉదయం 11 గంటలకు మరో ధఫా సమావేశమై చర్చించాలని నిర్ణరుుంచారు. ఇదే పరిస్థితి సోమవారం కూడా కొనసాగితే సగం రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలిచిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం రాత్రి షిఫ్ట్‌కు వెళ్లిన ఉద్యోగులతో బలవంతంగా పని చేరుుంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా .. వారు అంగీకరించడం లేదని సమాచారం. ఎన్టీటీపీఎస్ నుంచి ఆదివారం రాత్రికి చాలావరకు ఉద్యోగులు బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. చర్చలు విఫలం.. ఆదివారం ఉదయం ఆరు గంటలకు పలు విద్యుత్ కేంద్రాలలో ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. రాత్రికి ఏకంగా 2,160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె విరమణకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఫలించలేదు. వేతన సవరణను అమలు చేయలేమని, కొత్త ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్‌తో జెన్కో ఎండీ విజయానంద్, ట్రాన్స్‌కో సీఎండీ సురేష్చందాలు ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. అనంతరం వారు విద్యుత్ సౌధలో ఉద్యోగులతో చర్చలు జరిపారు. వేతన సవరణ కమిటీ ప్రతిపాదించిన మేరకు 27.5 శాతం ఫిట్మెంట్ బదులుగా ఐఆర్ (మధ్యంతర భృతి) ఇస్తామని చెప్పారు. రెగ్యులర్ పీఆర్సీని కొత్త ప్రభుత్వాలు చూసుకుంటాయని ప్రతిపాదించారు. ఇదే సమయంలో సమ్మె విరమించాలని సీఎస్ మహంతి కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఐఆర్‌పై వివరంగా చర్చించేందుకు యాజమాన్యం ససేమిరా అంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారాంరెడ్డి, కో-చైర్మన్ మోహన్‌రెడ్డి, జేఏసీ నేతలు ఎం.గోపాల్, వెంకన్నగౌడ్, ప్రసాద్, కిరణ్, చంద్రుడు, భానుప్రకాశ్‌లు మండిపడ్డారు. సమ్మెను కొనసాగించేందుకే నిర్ణయించామని ప్రకటించారు. అనంతరం రాత్రి తొమ్మిదిన్నర సమయంలో మరోమారు జరిగిన చర్చలు కూడా విఫలమయ్యూరుు. సోమవారం ఉదయం 11 గంటలకు మరోమారు సమావేశం కావాలని ఉద్యోగుల జేఏసీ, యూజమాన్యం నిర్ణరుుంచారుు. యూనిట్లకు యూనిట్లు ట్రిప్! సమ్మె నేపథ్యంలో జెన్కోకు చెందిన అనేక థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు జలాశయాల్లో నీళ్లు లేకపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదు. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో గ్యాసు ఉత్పత్తి తగ్గిపోవడంతో గ్యాసు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా అనేక ఫీడర్లకు (విద్యుత్ సరఫరా లైన్లు) సరఫరాను నిలిపివేశారు. ఖమ్మ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోరుుంది. ఎన్టీటీపీఎస్లోని 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక యూనిట్ మూతపడింది. వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ)లోని ఒక్కొక్కటి 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం ఐదు యూనిట్లలో (మొత్తం 1050 మెగావాట్లు) ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా కేటీపీఎస్‌లో ఒక్కొక్కటి 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో రెండు యూనిట్లు ఆదివారం రాత్రి సమయానికి ఒక్కొక్కటి కేవలం 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికే (400 మెగావాట్ల నష్టం) పరిమితమయ్యాయి. ఇవన్నీ కలిపి మొత్తం 2,160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఇదే పరిస్థితి కొనసాగితే సోమవారం నాటికి ఈ యూనిట్లలో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోనుందని జెన్కో అధికారులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల బొగ్గు నిల్వలు నిండుకున్నారుు. రెల్వే వేగన్ల ద్వారా ప్లాంటుకు వచ్చిన బొగ్గును అన్లోడ్ చేసే సిబ్బంది లేరు. ఉన్న బొగ్గును బాయిలర్లలోకి ఫీడ్ చేసే సిబ్బందీ కరువయ్యారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా విద్యుత్ సరఫరా తగ్గిపోయింది. హైదరాబాద్‌లోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నుంచే భారీ విద్యుత్ లైన్లకు కరెంటును కట్ చేశారు. దీంతో అనేక గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల బొగ్గు స్థానంలో ఫర్నేస్ ఆరుుల్ మండించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. యాజమాన్యానిదే నిర్లక్ష్యం మొదటి నుంచీ మేము బాధ్యతాయుతంగానే వ్యవహరించాం. యాజమాన్యమే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇప్పుడు కూడా మేం ఐఆర్‌పై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు ఐఆర్‌పై సరైన చర్చే జరగలేదు. చర్చలకు ముందుకు వస్తే మేం సిద్ధం. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఐఆర్ ఇవ్వాల్సిందే. పురపాలకశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలి. - జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు సమ్మె విరమించండి: కేసీఆర్ విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పిల్లలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మెను వెంటనే విరమించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే వేతన సవరణ అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుత వేసవి పరిస్థితుల్లో సమ్మె చేయవద్దని, కొన్ని రోజులు ఓపిక పట్టాలని సీఎస్ మహంతి విజ్ఞప్తి చేశారు. జూన్ 2న కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే పీఆర్సీ ఫైలును ప్రభుత్వాల ముందు పెడతామని, ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఈ పీఆర్సీ ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తుందని, ఎలాంటి ఆందోళన వద్దన్నారు. -
హామీలతో ఆమోద ముద్ర
సాక్షి, విజయవాడ, ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : స్థానికుల తీవ్ర నిరసనను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్టీటీపీఎస్ తన పంతం నెగ్గించుకొంది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో నూతనంగా నిర్మించబోయే 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రంపై శుక్రవారం భారీ పోలీసు బలగాల మధ్య కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయసేకరణ జరిపి ఆమోదముద్ర వేయించుకోగలిగారు. ఇబ్రహీంపట్నంలోని థర్మల్ కేంద్రం గ్రౌండ్లో ఉదయం 11.30కి ప్రజాభిప్రాయ సదస్సు ప్రారంభమైంది. ఎన్టీటీపీఎస్ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల బాధపడుతున్న 10 గ్రామాల ప్రజలు ‘రాజకీయ పార్టీల ఐక్యకార్యాచరణ వేదిక’గా ఏర్పడి ప్రజాభిప్రాయసేకరణలో తీవ్ర నిరసన తెలిపారు. వేదిక ముందే బైఠాయించి ఎన్టీటీపీఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీటీపీఎస్ డౌన్‌డౌన్, మాకొద్దు ఈ ప్రాజెక్టు.. అంటూ నినాదాలు చేశారు. ఎన్టీటీపీఎస్లో మరో కొత్త ప్లాంట్ ఏర్పాటుచేసి తమ జీవితాలను బుగ్గి చేయొద్దని మహిళలు డిమాండ్ చేశారు. ఒక దశలో స్థానికులతో అధికారులు మినిట్స్ పుస్తకాల్లో సంతకాలు పెట్టించి సమావేశాన్ని మొక్కుబడిగా ముగించేందుకు చేసిన యత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే సభ రసాభాసగా మారింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. సభాస్థలి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని స్థానికుల్ని శాంతింపజేశారు. ఒకదశలో పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన ఏపీ జెన్కో అధికారులు ప్రజల డిమాండ్లను అంగీకరిస్తూ లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో సభ ప్రశాంతంగా ముగిసింది. సమావేశంలో ఏపీ జెన్కో మేనేజింగ్ డెరైక్టర్ విజయానంద్, జెన్కో డెరైక్టర్ సి.రాధాకష్ణ, వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీఎల్ శాస్త్రి, కలెక్టర్ రఘునందన్‌రావు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, సబ్ కలెక్టర్ హరిచందన, ఎన్టీటీపీఎస్ సీఈ సమ్మయ్య, ఎంపీడీవో లక్ష్మీకుమారి, తహశీల్దారు ఎం.మాధురి, వ్యవసాయ అధికారి లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు : జోగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన తర్వాతే ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలంటూ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ సదస్సులో పట్టుబట్టారు. లక్షా 50వేల మంది ప్రజలున్న ఇబ్రహీంపట్నం మండలంలో కేవలం 120 మంచినీటి కుళాయిలు వేశామని చెప్పడానికి అధికారులు సిగ్గుపడాలంటూ ఆయన ధ్వజమెత్తారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, తమతోను, తమ పిల్లల భవిష్యత్తుతోనూ ఆటలాడుకోవద్దని ఆయన సూచించారు. 20 అంశాలపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మేడపాటి నాగిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ అంక మోహనరావు, కాంగ్రెస్ నాయకులు అక్కల గాంధీ, ఆవుల సీతారామయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్, బీజేపీ నేత రేగళ్ల రఘునాథ్‌రెడ్డి, సీపీఐ నాయకుడు పి.తాతయ్య, ఇబ్రహీంపట్నం ప్రముఖులు మల్లెల పద్మనాభరావు, సర్పంచి అజ్మీర స్వర్ణ, కొండపల్లి సర్పంచి అమ్మాజీ, ఈలప్రోలు సర్పంచి మిరియాల చినరామయ్య, జూపూడి సర్పంచి నల్లమోతు దుర్గారావు, జి.ప్రసాద్, ఎ.విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
చీకట్లో ఎన్టీటీపీఎస్
సాక్షి, విజయవాడ: విజయవాడలోని నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) చరిత్రలో ఆదివారం బ్లాక్ డేగా నిలిచిపోతుంది. ప్లాంటు చరిత్రలో తొలిసారిగా ఆదివారం రాత్రి మొత్తం ఏడు యూనిట్లలోనూ విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దాంతో మొత్తం 1,760 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కారణంగా తొలుత ఒక్కోటీ 210 మెగావాట్లతో కూడిన ఆరు యూనిట్లలో ఉత్పత్తి నిలిచి 1,260 మెగావాట్లకు గండిపడింది. 500 మెగావాట్లు ఉత్పత్తి చేసే ఏడో యూని ట్లోనూ అంతరాయం ఏర్పడ్డా వెంటనే పునరుద్ధరించారు. కానీ బొగ్గు అందక, బూడిదతీత సాధ్యపడక ఆదివారం అర్ధరాత్రికల్లా మరోసారి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీటీపీఎస్లో ఒక్క రోజు విద్యుదుత్పత్తికి 25 వేల టన్నుల బొగ్గు అవసరం. అది ఒడిశాతో పాటు తెలంగాణలోని సింగరేణి నుంచి దిగుమతి అవుతుంది. కానీ విద్యుత్ సరఫరా అంతరాయంతో గూడ్స రైళ్లను కూడా నిలిపేసిన కారణంగా ఎన్టీటీపీఎస్కు బొగ్గు సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. దీనికి తోడు ఏడో యూనిట్‌కు బొగ్గు అందించే సిబ్బందితో పాటు దాని నుంచి బయటికొచ్చే బూడిదను తరలించే లారీల యజమానులు సమ్మెలో ఉన్నారు. దాంతో రెండు రోజులుగా బూడిదతీత సాధ్యపడటం లేదు. ఇన్ని సమస్యలు ఒకేసారి చుట్టముట్టడంతో శనివారం ఉద యం నుంచి ఏడో యూనిట్లో 300 మెగావాట్ల ఉత్పత్తే సాధ్యపడింది. ఆదివారం అర్ధరాత్రికల్లా పూర్తిగా మూతపడింది. 115 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి గండి! ఎన్టీటీపీఎస్లో తొలి ఆరు యూనిట్లు మూడు రోజులుగా పనిచేయడం లేదు. ఒక్క యూనిట్ ఆగితే సుమారు 5 మిలి యన్ యూనిట్ల (ఎంయూ) ఉత్పత్తి ఆగిపోతుంది. ఆ లెక్కన 3 రోజులుగా 5 యూనిట్లలో 75 ఎంయూ ఉత్పత్తి ఆగిపోయింది. ఇక ఏడో యూనిట్ ఆగిపోతే రోజుకు 12 ఎంయూ నష్టం వస్తుంది. ఇలా సోమవారం సాయంత్రానికి మొత్తం మీద ఎన్టీటీపీఎస్లో 115 ఎంయూ ఉత్పత్తి ఆగినట్టు అవుతుందని అధికారులు తెలిపారు.రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌లో 40 శాతం సరఫరా అయ్యే ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూగబోవడంతో ఆంధ్రప్రదేశ్ గ్రిడ్ విఫలమయ్యేలా ఉందని, అదే జరిగితే రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పునరుద్ధరణకు రోజున్నర: ఎన్టీటీపీఎస్లో ఏడు యూనిట్లూ ఒకేసారి మూతబడ్డందున వాటి పునరుద్ధరణ కాస్త కష్టసాధ్యమేనంటున్నారు. కేంద్రం దిగొచ్చేదాకా విధులకు హాజరయ్యేది లేదని జేఏసీ నేతలు తేల్చిచెబుతుండటం తెలిసిందే. వారు హాజరయ్యాక కూడా ఎన్టీటీపీఎస్ పూర్తిస్థాయి సామర్థ్యంలోకి రావడానికి కనీసం రోజున్నర పడుతుందని జన్కో డెరైక్టర్ ఆంజనేయరావు ‘సాక్షి’కి తెలిపారు. -
చీకటి సమ్మెట
-
చీకటి సమ్మెట
* పలు ప్లాంట్లలో భారీగా తగ్గనున్న విద్యుదుత్పత్తి * పులి మీద పుట్రలా సాంకేతిక సమస్యలు * ఇప్పటికే అంధకారంలోకి చాలా గ్రామాలు * నేటి నుంచి సమస్య మరింత తీవ్రతరం * కనీసం 3,000 మెగావాట్ల ఉత్పత్తికి కోత! * గృహావసరాలకు, పరిశ్రమలకు కరెంటు కట్! * అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు * రేపు అర్ధరాత్రి దాకా కొనసాగనున్న సమ్మె సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో నేటి నుంచి రాష్ట్రంలో చీకట్లు కమ్ముకోనున్నాయి. 11వ తేదీ అర్ధరాత్రి నుంచి వారు ప్రారంభించిన 72 గంటల సమ్మె కారణంగా ఇటు విద్యుదుత్పత్తి, అటు సరఫరా రెండూ ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కరెంటు సరఫరాపై గురువారం పెద్దగా ప్రభావం పడకపోయినా శుక్రవారం నుంచి మాత్రం అది దారుణంగా ఉండనుంది. సమ్మెతో సీమాంధ్ర ప్రాంతంలోని పలు విద్యుత్ ప్లాంట్లల్లో గురువారం రాత్రి నుంచే విద్యుదుత్పత్తి దాదాపుగా నిలిచిపోయింది. సమ్మెకు తోడు ప్లాంట్లలో సాంకేతిక, ఇతరత్రా సమస్యలు పులి మీద పుట్రలా పరిణమించాయి. ఎన్టీటీపీఎస్లో బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడగా శ్రీశైలం కుడిగట్టు ప్రాజెక్టులో మరమ్మతులు చేసేందుకు కార్మికులు కూడా ససేమిరా అంటున్నారు. భారీ వర్షాల వల్ల నీట మునిగిన ఆర్టీపీపీలో అసలు పనులే నడవడం లేదు. దాంతో శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య అంతరం భారీగా పెరిగే పరిస్థితి కన్పిస్తోంది. కనీసం 3,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి కోత పడవచ్చని అంచనా. సమ్మె 14వ తేదీ అర్ధరాత్రి దాకా కొనసాగనున్నందున సమస్య వెంటనే పరిష్కారమయ్యే పరిస్థితి కూడా లేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా కోతలు తప్పని పరిస్థితి ఏర్పడింది. రైల్వేలు, ఆస్పత్రులు, తాగునీరు, సాగునీటికి విద్యుత్ సరఫరాలో ప్రాధాన్యతనిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున గృహావసరాలకు, పరిశ్రమలకు కొద్ది రోజుల పాటు భారీ కోతలు తప్పేలా లేవు. పలు జిల్లాలు ఇప్పటికే కరెంటు కోతల బారిన పడి అల్లాడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాల్లో 25 ఫీడర్ల పరిధిలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 14 ఫీడర్లలో లోపాలను సవరించినా మరో 11 ఫీడర్ల పరిధిలో సమస్య ఇంకా కొనసాగుతుండటంతో ఏకంగా 85 గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి. పైగా శ్రీకాకుళం రిమ్స్‌తో పాటు పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి కూడా గురువారం మధ్యాహ్నం దాకా కరెంటు సరఫరా నిలిచిపోయింది. విశాఖలోనూ గురువారం జిల్లావ్యాప్తంగా కోతలు కొనసాగాయి. ప్రకాశం జిల్లాలో కనిగిరి తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి! పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా సిబ్బంది సమ్మె కారణంగా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ఉద్యోగులు తమ అధికారిక మొబైల్ నంబర్లను వెనక్కివ్వడంతో వినియోగదారులు తమ సమస్యలను ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బాయిలర్, టర్బైన్, ఈఎస్పీ వంటి ప్లాంట్ల ప్రధాన విభాగాల షిఫ్టులకు మాత్రమే హాజరవుతామని సమైక్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (సేవ్ జేఏసీ) ప్రకటించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినా మరమ్మతులకు కార్మికులు రావడం లేదు. దీనికి తోడు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఉద్యోగులు కూడా సమ్మెకు దిగడంతో విద్యుత్ పంపిణీలోనూ తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యుత్ సౌధలోని సీమాంధ్ర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సమ్మెకు దిగడంతో రోజువారీ కార్యక్రమాలు కూడా జరగని పరిస్థితి ఏర్పడింది. రిజర్వాయర్లలో నీరుండటం వల్ల జల విద్యుదుత్పత్తి సాయంతో గురువారం ఇబ్బంది లేకుండా సరఫరా సాధ్యపడిందని అధికారులంటున్నారు. మరోవైపు విద్యుత్ బిల్లులు చెల్లించొద్దన్న పిలుపుతో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవీ ప్లాంట్ల తిప్పలు! శ్రీశైలం కుడిగట్టు ఉత్పత్తి కేంద్రం కర్నూలు జిల్లాలోని 770 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఈ ప్లాంటులో ఆయిల్ సరఫరా సమస్యతో ఇప్పటికే రెండు యూనిట్లలో ఉత్పత్తి ఆగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కార్మికులెవరూ ముందుకు రావడం లేదు. దాంతో 5 యూనిట్లలో మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. పోలీసుల సాయంతో ఎడమ గట్టు నుంచి ఉద్యోగులను తీసుకెళ్లేందుకు యాజమాన్యం చర్యలు ప్రారంభించిందన్న వార్తలపై సీమాంధ్ర ఉద్యోగులు మండిపడుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు ఉత్పత్తి కేంద్రం 900 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ ప్లాంటు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్నా ఇందులో సీమాంధ్ర ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు భారీగా ఉండటంతో పోలీసుల సాయంతో విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఆర్టీపీపీ పని అంతే! భారీ వర్షాలతో నీట మునిగిన వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ)లో కోల్ హ్యాండ్లింగ్ మొత్తం నీట మునిగింది. పంప్‌హౌస్‌లో కూడా నీరు చేరింది. నీటిని తోడేందుకు కూడా కార్మికులెవరూ ముందుకు రావడం లేదు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కాంట్రాక్టు కంపెనీ కార్మికులు ప్లాంటుకు చేరుకున్నప్పటికీ లోనికి వెళ్లి పనులు చేసేందుకు ఉద్యోగులు అంగీకరించడం లేదు. దాంతో 1,050 మెగావాట్ల సామర్థ్యమున్న ఆర్టీపీపీకి మరమ్మతులు చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు మరో 10 రోజులైనా పడుతుందని జెన్కో వర్గాలు తెలిపాయి. ఎన్టీటీపీఎస్లో ఫలించిన చర్చలు! విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లతో పాటు 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక యూనిట్ ఉన్నాయి. వీటిలో 1, 2, 3, 4 యూనిట్లకు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డా, యాజమాన్యంతో ఉద్యోగుల చర్చలు ఫలించి, కోల్ హ్యాండ్లింగ్‌కు వారు అంగీకరించారు. కాబట్టి అక్కడ పరిస్థితి కాస్త మెరుగు పడవచ్చని సమాచారం. అయితే బాయిలర్ ట్యూబులకు రంధ్రాల కారణంగా ఐదో యూనిట్లో మొత్తం 210 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఇప్పటికే నిలిచిపోయింది. మరమ్మతులు చేసేందుకు సిబ్బంది ససేమిరా అంటున్నారు.