పెషావర్‌లో భూకంపం
పాకిస్థాన్: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదయింది. పాకిస్థాన్ - తజికిస్థాన్ సరిహద్దుల్లో పెషావర్‌కు 144 కిలోమీటర్లు దూరంలో హిందూకుష్ పర్వతశ్రేణుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే భూకంపం వల్ల ఎటువంటి ఆస్తినష్టం కాని ప్రాణ నష్టం కాని జరిగినట్లు సమాచారం లేదని అధికారులు వెల్లడించారు.