breaking news
NOOR BASHA COMMUNITY
-
కూకటి వేళ్ళతో సహా పెకలిస్తాం.. బాబుకు నూర్ బాషా సంఘం మాస్ వార్నింగ్
-
వెనకబడిన వర్గాల్లోని మహిళాభ్యున్నతికి సీఎం జగన్ కృషి: సజ్జల
సాక్షి, అమరావతి: ఏలూరులో దూదేకుల మహిళకు మేయర్ పదవి ఇవ్వబోతున్నామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నూర్ బాషా కార్పొరేషన్ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యత: మంత్రి వేణుగోపాలకృష్ణ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలను అందించి పేదల అభ్యున్నతికి సీఎం జగన్ కృషిచేస్తున్నారన్నారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వెనుకబడిన వర్గాలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు. పేదల కోసం అందించే విద్య,వైద్య విధానంలో కార్పొరేట్ స్థాయి కన్న గొప్పగా ఉండేలా వినూత్న పథకాలు సీఎం జగన్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. బీసీలు, మైనార్టీల అభివృద్ధే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యం: లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, బీసీలు, మైనార్టీల అభివృద్ధే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవిష్యత్తులో వెనుకబడిన వర్గాలలోని ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదగాలన్నారు. వెనుకబడిన వర్గాల ఎదుగుదల కోసమే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన వర్గాల భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. -
నూర్బాషాల సంక్షేమానికి కృషి చేస్తా
ఒంగోలు సెంట్రల్: నూర్బాషాల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక ఉగ్గుల కుంట బీసీ ఆరామ క్షేత్రం వద్ద ఆదివారం నిర్వహించిన నూర్బాషా ప్రతిభా ప్రోత్సాహక అభినందన సభలో మాట్లాడారు. నూర్బాషాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నూర్బాషాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతపురం జెడ్పీ చైర్మన్ డి. చమన్ మాట్లాడుతూ రాజకీయంగా నూర్బాషాలకు రిజర్వేషన్లను కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను నూర్బాషాలకు కేటాయించాలని కోరారు. డీఆర్ఓ నూర్బాషా ఖాశీం మట్లాడుతూ.. నూర్బాషాలు విద్యలో రాణించాలన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే నాగూర్ మీరా మాట్లాడుతూ రాష్ట్రంలో 25 లక్షల నూర్బాషాలున్నా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఎస్కే ఖాశీం, మీరా మొహిద్దీన్, ఎస్కే మీరావలి, ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.