breaking news
Nomadic species
-
సీఎం జగన్ ప్రభుత్వం పేదవాడిని గెలిపిస్తోంది
సాక్షి, తాడేపల్లి: సంచార జాతుల 68వ స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు వైఎస్సార్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సంచార జాతుల వారిని గత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ సంచార జాతుల వారిని పట్టించుకోలేదని విమర్శించారు. సంచార జాతుల వారి కోసం ప్రత్యేక అధ్యయన కమిటీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. సంచార జాతుల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. బీసీ పక్షపాతి సీఎం జగన్ బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి వారికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశారని వ్యాఖ్యానించారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని కొనియాడారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించారని తెలిపారు. (భూ సర్వే పైలట్ ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష) అదే విధంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సంచార జాతుల వారు తమ సమస్యలను పాదయాత్రలో సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. పాదయాత్రలో వారికి ఇచ్చిన హామీలన్నింటిని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. సంచార జాతుల వారి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. బాబు పాలనతో బీసీలు విసిగిపోయారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. పేదరికంపై గెలుపు కోసం ‘నవ రత్నాల పథకాలు’ ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదవాడిని గెలిపిస్తోందని పేర్కొన్నారు. (సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన) -
వాళ్లే అసలైన ఉత్పత్తి శక్తులు
సందర్భం సంచారజాతుల వాళ్లు సాంప్రదాయ వృత్తులనుంచి ముందుకు సాగాలంటే వారి చిన్నచిన్న వ్యాపారాలకు ఆర్థికసాయం ఎంతో ముఖ్యమైంది. అప్పుడు మాత్రమే స్థిరత్వ జీవన విధానంవైపుకు ఈ కులాలు మళ్లుతాయి. తెలంగాణలో వెనుకబడిన వర్గాలను నిలబెట్టేందుకు, ప్రధానంగా సంచారజాతులకు అండదండగా నిలిచేందుకు కేసీఆర్ సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. సంచారజాతులు తమకాళ్లపై తాము నిలబడేందుకు ఏ సాయం ఏ మేరకు అందినా అది ఎంతో ప్రశంసనీయమైనదే అవుతుంది. తెలంగాణలోని బాగా వెనుకబడ్డ బీసీల జీవన ముఖచిత్రం మార్చటంపై కేసీఆర్ గురిపెట్టారు. దీంతో సంచారజాతులు కూడా స్థిరనివాసం వైపుకు వెళ్లటం జరుగుతుంది. వీరి జీవన విధానంలోనే మార్పు తెచ్చే దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తుంది. ఇప్పటికే బీసీలలో బాగా వెనుకబడ్డ కులాలు, సంచారజాతుల వాళ్లు చేస్తున్న పనులకు కొంత ప్రోత్సాహం, ఆర్థిక సాయం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఒక్క హైదరాబాద్‌లోనే సంచారజాతుల వాళ్లు చేసే ఆధునికవృత్తి పనుల ద్వారా కొందరు వ్యక్తులుగా లాభపడుతున్నారు కానీ పని చేసే వారి స్థితిగతుల్లో మార్పులేదు. చెత్త ఏరుకునేవారు, పాత ప్లాస్టిక్ సామానులు సేకరించేవారు, రోజూ నగరంలో సేకరించి హోల్‌సేల్ వాళ్లకు అమ్ముతారు. చిన్నవ్యాపారులు ఈ సామాన్లు కొంటారు. పాత ఇనుము సామాన్లనంతా ఐరన్ ఫ్యాక్టరీలకు, పాతపేపర్లను కాగిత పరిశ్రమకు అందిస్తారు. సంచార జాతుల వాళ్లు అమ్మేవస్తువులు ఇతరులెవరూ అమ్మలేరు. వీళ్లలో గొప్ప మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి. పార్థీ(పిట్లలోళ్లు) వాళ్లు పూసలు, దువ్వెనలు, పక్కపిన్నీసులు అమ్ముతుంటారు. కొన్ని సంచార జాతులు, బుడిగ జంగాలు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతుంటారు. మొండిబండ కులస్తులు నెత్తి వెంట్రుకలను ఇంటింటికి తిరిగి సేకరిస్తారు. ఈ సేకరించిన వెంట్రుకల్ని కరెన్నీ కట్టల్లా కట్టలు కడతారు. వెంట్రుకలు ఇంత నల్లగా మనదేశంలోనే ఉంటాయి. ఈరకమైన వెంట్రుకలకు విదేశాల్లో డిమాండ్ బాగా ఉంటుంది. ఈ వెంట్రుకలను శుభ్రపరిచి యుకె, యుఎస్ఎ, నెదర్లాండ్స్‌కు ఎగుమతి చేస్తారు. దీని ద్వారా విగ్గులు తయారుచేస్తారు. డక్కలివాళ్లు మరికొందరు మ్యూజిక్ వస్తువులకు ఫ్రేమ్‌లు తయారుచేస్తారు. కొన్ని సంచారజాతుల వాళ్లు ఇంటింటికి తిరిగి కరివేపాకులు, డప్పులు, కొన్ని రకాల పప్పులు, ముగ్గులు, ముగ్గురాళ్లు, ఇసుకరాళ్లు, రోకళ్లు అమ్ముతారు. పెద్దపెద్ద షాపుల్లో సైతం అమ్మలేని వస్తువులను వీళ్లు తమనైపుణ్యంతో అమ్ముతారు. ఇది గొప్ప వ్యాపారకళ. పాత ఇనుము, పాతపేపర్లు, పాతప్లాస్టిక్ సామాన్లు దగ్గర నుంచి తలవెంట్రుకల వరకు వాటిని సేకరించేది, అమ్మేది, కొనేది అంతా పేదవాళ్లే. కాని ఇందుకు సంబంధించి ఒక్కహైదరాబాద్ నగరంలోనే రోజుకు లక్షల్లో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. దీనిపై వచ్చే ఆదాయం అంతా కొంతమంది ధనవంతుల చేతుల్లోకి పోతుంది. ఈ వృత్తులవారికి కో ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసి షేర్హోల్టర్లుగా చేస్తే సంచారజాతులు నిలబడగలుగుతాయి ఇనుము, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలన్నీ ప్రత్యామ్నాయ వృత్తులు. బాగా వెనుకబడ్డ కులస్తులైన ఈ సంచార, అర్థసంచార, ఆశ్రితకులాల వారికి రివాల్వింగ్ ఫండ్ కావాలి. ఈ ప్రత్నామ్నాయ వృత్తులకోసం కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటుచేసి వారుచేసే పనిని బట్టి ఆ కులాలకు ప్రత్యేకంగా కొంత మూలధనం సమకూర్చితే వారు మధ్యదళారుల చేతుల్లోంచి బైటపడతారు. సంచార జాతుల వాళ్లు వడ్డీలకు డబ్బుతెచ్చి వ్యాపారం చేస్తుంటారు. ఇది వీరి జీవితాలను గుల్లచేస్తోంది. వారి చిన్నచిన్న వ్యాపారాలకు ఆర్థికసాయం ఎంతో ముఖ్యమైంది. వీరికి ఆర్థికసాయం అందిస్తే, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా సమూహాలను ఏర్పాటు చేసి కొన్ని వస్తువులను ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటారు. అప్పుడే సంచారజాతులు ఉత్పత్తి కులాలుగా ఉత్పత్తి శక్తులుగా మారుతారు. హైదరాబాద్ నగరంలో సిగ్నల్స్ దగ్గర రోడ్లపైన, రైల్వే స్టేషన్ల దగ్గర వస్తువులను అమ్మేవాళ్తంతా సంచారజాతులవాళ్లే. వీళ్లు సిగ్నల్స్ దగ్గర వాహ నాలు ఆగినప్పుడు ఆ రెండు మూడు నిమిషాల్లోనే వస్తువులను వినియోగదారులకు అమ్మే నైపుణ్యాలున్నవారు. పిల్లల ఆట వస్తువులు, గొడుగులు, ఆట బొమ్మలు, వాహనాల సీట్ల వెనుక ఆధారంగా ఉండే మెత్తలు, కార్లు తుడిచే బట్టలు వీటన్నింటిని కొన్ని నిమిషాల్లో, సెకండ్లలో అమ్మగలుగుతారు. అయితే వీరు అమ్మే అనేక వస్తువులను వీళ్లు తయారు చేయగలుగుతారు. కాకపోతే ఈ వస్తువుల తయారీకి యాంత్రికపరమైన యంత్రాలు, సాంకేతిక పరి జ్ఞానం జోడించవలసి ఉంది. ఇందుకు వీరికి ఆర్థిక సాయం అందించవలసి ఉంటుంది. చిన్న చిన్న పెట్టుబడులతో పెట్టే చిన్న పరిశ్రమలను, అత్యంత వెనుకబడిన కులాలకు సంచారజాతుల వారికి అందించవలసి ఉంది. ఈ ఆధునికవృత్తులకు సంబంధించిన ఉత్పత్తి, శిక్షణ, నైపుణ్యం అందించేందుకు వీరి కోసం ప్రత్యేక సంస్థలను నెలకొల్పవలసి ఉంది. ఇందుకోసం కేసీఆర్ చేస్తున్న ఆలోచనలు ఫలిస్తే దేశానికి తెలంగాణ ఆదర్శమౌతుంది. జూలూరు గౌరీ శంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
గాడిదలే గంగిగోవులు
► గాడిదపాల విక్రయంతో జీవనోపాధి ► మంచిర్యాలవాసుల వలస జీవితాలు సాక్షి, భీమవరం: గంగిగోవు పాలు గరిటడైనా చాలు.. ఖరముపాలు కడివిడైనా నేమి అన్న సూక్తి ఆ కుటుంబాలకు వర్తించదు. ఖరము పాలు ఆ కుటుంబాలకు జీవనాధారం. తెలంగాణ, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొన్ని పేద కుటుంబాలు ఏటా ఆంధ్రాకు వలసవచ్చి 8 నెలల పాటు ఇక్కడే ఉంటారు. తమతోపాటు గాడిదలను తీసుకువస్తారు. జిల్లాలవారీగా పట్టణాలను ఎంపిక చేసుకుని ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుంటారు. అక్కడి నుంచి వాహనాల్లో గాడిదలను సమీప గ్రామాలకు ఉదయమే తీసుకువెళతారు. ఒకచోట వాహనాలను ఆపి ఆ గాడిదలను వీధుల్లో తిప్పుతూ వాటిపాలను విక్రయిస్తున్నారు. 50 గ్రాములు.. రూ.100 ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ తదితర జిల్లాల్లో కూడా గాడిద పాలు ఇష్టంగా తాగుతున్నారట. చిన్నటి గ్లాసు (50 గ్రాములు) గాడిద పాల ధర రూ.100. గాడిదలను రోడ్లపై తోలుకువచ్చి అప్పటికప్పుడు పాలు పితికి విక్రయిస్తున్నారు. గాడిదపాలు సర్వరోగ నివారిణి అని వీరు చెబుతుండటంతో నమ్మకం ఉన్నవారు కొనుగోలు చేస్తున్నారు. నమ్మనివారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ సంచార వాసులు భీమవరం–తాడేపల్లిగూడెం రోడ్డులోని బైపాస్ రోడ్డులో ఉన్న ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. గాడిదలను ఆటోల్లో పట్టణాలకు, గ్రామాలకు తీసుకువెళ్లి ఇంటింటికి తిప్పుతూ పాలు విక్రయిస్తున్నారు. ఏడాదిలో 8 నెలలపాటు గాడిద పాలను విక్రయిస్తూ సంచార జీవనం సాగిస్తున్నాయి ఈ కుటుంబాలు. తరువాత తమ సొంత ప్రాంతమైన మంచిర్యాలకు వెళ్లిపోతారు. అక్కడ రోళ్లు తయారు చేసి నాలుగు నెలల పాటు ఉంటారు. తరువాత మళ్లీ సంచార జీవితమే. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో.. గాడిదపాలు సర్వరోగ నివారణి గ్యాస్, బీపీ, షుగర్ వ్యాధులు నడుం, కీళ్ల నొప్పులు, ఆయాసం తగ్గుతుంది. పచ్చిపాలు తాగాలి. మా పెద్దలు చెప్పారు. మేం నమ్ముతున్నాం, ఆచరిస్తున్నాం. మేం కూడా ఇవే తాగుతున్నాం. నమ్మిన వాళ్లు కొంటారు. కొందరు నవ్వుతూ చూస్తారు. ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పాలు విక్రయిస్తాం. -లాలూ, మంచిర్యాల వాసి