breaking news
Negative groups
-
నవజాత శిశువులను కాపాడే అరుదైనా బ్లడ్ గ్రూప్!
రక్తమార్పిడ్లు గురించి విన్నాం. చాలామందికి ప్రమాద కారణంగానో లేదా మరే ఇతర కారణాల వల్ల రక్తం ఎక్కించాల్సి ఉంటంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ నవజాత శిశువులకు కూడా ఒక్కోసారి జననంలో ఎదురయ్యే సమస్యల కారణంగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అయితే వారికి ఎక్కించే రక్తం విషయంలో మాత్రం వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా ఎక్కించాక ఏవైనా సమస్యల రాకుండా పలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ నవజాత శిశువులకు ఎలాంటి రక్తాన్ని ఎక్కిస్తారు? ఆ రక్తానికి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారంటే.. అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ బీ-ని నవజాత శిశువులకు ఎక్కిస్తారు. ఆ రక్తాన్ని నియో అనే బ్లడ్‌ని బ్లూ ట్యాగ్ బ్యాగ్లె కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే? ఈ బ్లడ్ అప్పుడే పుట్టిన శిశువులకు ఇచ్చేది కాబట్టి దానిపై నియో అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఇక్కడ ‘నియో’ అంటే నియోనాటల్. 28 రోజుల వయసున్న చిన్నారుల గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడుతుంటారు. ఇక ఈ రక్తం నవజాత శిశువులతో పాటు కొందరు రోగులకు సాయం చేస్తుంది. ఎలాంటి పరీక్షలు చేస్తారంటే.. సాధారణంగా దానం చేసిన రక్తంనతంటికీ హెచ్ఐవీ, హెపటీటిస్ బీ, సీ, ఈ, అలాగే సిఫిలిస్ వంటి పరీక్షలు చేపడతామని హెమటాలసీ డాక్టర్ ఆండీ చార్టన్ వివరించారు. ఆ పరీక్షలు అన్ని పూర్తి అయిన తర్వాత రోగులకు సరిపోతుందా? లేదా? అని అనేది తెలుసుకోవడం కోసం కొన్ని శాంపిల్స్ తీసుకుని మరిన్ని పరీక్షలను, ప్రక్రియలను చేపడతామని చెప్పారు. అంటే..కొందరి వ్యక్తులకు అంతకుముందు రక్తమార్పిడి సమయంలో వచ్చిన అలర్జిక్ రియాక్షన్ల ప్రొటీన్లు తొలగించిన తర్వాత రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుందని తెలిపారు శిశువులకు ఎక్కించాలంటే తప్పనసరిగా ఆ పరీక్ష.. నవజాత శిశువులకు, ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్లకు(రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న రోగులకు), గర్భిణులకు, గర్భాశయంలో ఎదిగే పిండానికి ఎక్కించే రక్తానికి తప్పనిసరిగా సైటోమెగాలో(CMV) అనే వైరస్‌కు సంబంధించి పరీక్షించాల్సి ఉంటుంది. ఇది హెర్పస్ వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ చాలా సాధారణం. ఇది హానికరమైనది కాదు. స్వల్పంగా ఫ్లూ వంటి లక్షణాలను లేకపోతే ఎలాంటి లక్షణాలను ఇది కలిగి ఉండదు. కానీ, కొందరికి మాత్రం ఇది ప్రమాదకరం. ఈ వైరస్ వల్ల పిల్లలకి మూర్ఛ రావొచ్చు, కళ్లు మసకబారడం, వినికిడి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కిడ్నీ, ప్లీహాన్ని దెబ్బతీయొచ్చు. చాలా అరుదైన కేసుల్లో ఇది ప్రాణాంతకం కావొచ్చు. ఒకవేళ రక్తంలో ఈ వైరస్ ఉంటే అది ఇలాంటి శిశువులకు, రోగులకు ఇవ్వడానికి పనికిరాదు. అయితే ఈ రక్తం దొరకడం అనేది అత్యంత అరుదు. అందువల్ల ఈ రక్తం గల దాతలు ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎందరో ప్రాణాలను రక్షించిన వారవ్వుతారు. దయచేసి బీ నెగిటివ్ గ్రూప్ కల వారు తమ రక్తం ఎంతో అమూల్యమైనదని గర్వించడమే గాకుండా ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎన్నో ప్రాణాలను రక్షించిన వారవ్వుతారు. (చదవండి: దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
బ్లడ్ ప్లీజ్..
సాక్షి, హైదరాబాద్: తలసీమియా సికిల్ సొసైటీ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2వేలమంది తలసీమియాతో బాధపడుతున్నారు.వీరికి నెలకు సగటున రెండువేల యూనిట్ల బ్లడ్ అవసరం కాగా, ప్రస్తుతం వెయ్యి యూనిట్లు కూడా సమకూరడం లేదు. ముదిరిన ఎండలు, కాలేజీలకు సెలవులే ఇందుకు కారణం. రక్తసేకరణ భారంగా మారడంతో నిర్వహకులు ఆ బాధ్యతను బాధితుల తల్లిదండ్రులకే అప్పగించడంతో వారు నానాతంటాలు పడుతున్నారు. అయితే ప్రస్తుతం రక్తదానం చేసేందుకు దాతలు ఆశించినస్థాయిలో ముందుకు రావడంలేదు. సకాలంలో రక్తం దొరకక క్షతగాత్రులు పరలోకాలు వెళ్తున్నారు. తలసీమియా బాధితులకు రెండువారాలకోమారు రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. శరీరబరువు, వయసును బట్టి ఒకటి నుంచి రెండుయూనిట్ల రక్తాన్ని తప్పక ఎక్కించాలి. ముదిరిన ఎండలకు తోడు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసినా దాతలు పెద్దగా ముందుకురావడం లేదని తలసీమియా సికిల్ సొసైటీ నిర్వాహకురాలు కొత్తపల్లి రత్నావళి ఆవేదన వ్యక్తం చేశారు. ఒ,ఎ,బి, నెగిటివ్ గ్రూపులకు చెందిన రక్తం దొరకక వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. రక్తనిధి కేంద్రాలపై కొరవడిన నిఘా : ఔషధనియంత్రణశాఖ రికార్డుల ప్రకారం నగరంలో 61 రక్తనిధి (బ్లడ్‌బ్యాంకులు) కేంద్రాలున్నాయి. ఇందులో 21 ప్రభుత్వాస్పత్రుల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేటు ఆస్పత్రులు, స్వచ్ఛందసంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీటిని నెలకోసారి తనిఖీ చేయాల్సి ఉండగా, అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తలసీమియా బాధితులకు రక్తాన్ని ఉచితంగా సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా..పట్టించుకోవడం లేదు. రక్తానికి రక్తం అంటూ బాధితుని బంధువుల్లో ఎవరైనా రక్తమిస్తే కానీ రోగికి అవసరమైన బ్లడ్‌గ్రూప్‌ను ఇవ్వడంలేదు. అది కూడా ఒక్కో యూనిట్‌కు రూ.1200 చొప్పున వసూలు చేస్తున్నారు. రక్తాన్ని ఎన్నిసార్లు దానం చేయొచ్చు... మనిషి శరీరంలో 5 లీటర్ల రక్తముంటుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో 168 సార్లు రక్తాన్ని దానం చేయొచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం10 కంటే ఎక్కువున్న వారు రక్తాన్ని ఇవ్వొచ్చు. 18 నుంచి 60 ఏళ్లలోపు వారు ప్రతి మూడునెలలకోసారి ఇవ్వొచ్చు. ఇలా సేకరించిన రక్తాన్ని 120రోజుల్లో వాడాలి. లేదంటే పాడైపోతుంది. 35కిలోల కంటే తక్కువ బరువు, హెచ్ఐవీ, మలేరియా, కామెర్ల బాధితుల నుంచి రక్తాన్ని సేకరించరాదు.