breaking news
the nature
-
కోయిల! వేప!మల్లి! మామిడి! ఎవరు గొప్ప?
కొత్తరాగమున కుహూకుహూమని మత్తిలి కోయిల కూయగా... కొమ్మలో కోయిలా కూయంటదే...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది...గున్నమామిడి కొమ్మమీద గూళ్లురెండున్నాయి... ఒక గూటిలోన రామచిలకుంది... ఒక గూటిలోని కోయిలుంది... కోయిల పాట బాగుందా... కొమ్మల సిరి బాగుందా... ఏవమ్మోయ్ కోయిలమ్మా! నీ మీద వచ్చిన పాటలు వింటూ కూర్చున్నావు. యేమంత మిడిసిపాటుతో నెల రోజుల ముందు నుంచే పాడటం ప్రారంభించావు. అంత గొప్పలు ఎందుకు నీకు? నువ్వు పాడటానికి ఓ సమయం సందర్భం లేదా...అంటూ మావి చిగురు కోకిలను ఎకసెక్కాలాడటం ప్రారంభించింది.బాగానే ఉంది నువ్వు చెప్పేది. నీ చిగుళ్లు ముందుగా రాబట్టే కదా నేను ముందుగా వాటిని తిని, గొంతు సవరించి, కుహూకుహూ అని కూయటం ప్రారంభించాను... అని గడుసుగా సమాధానం చెప్పింది కోకిల.నా చిగుళ్లు తింటేనేగా నీకు గొంతు అంత తియ్యగా స్వరం పలికేది. నేను చిగురించకపోతే నీ పాటకు తావెక్కడ. నా గొంతు తియ్యగా ఉందా. నీ చిగుళ్లు తియ్యగా ఉంటాయని ఎవరో చెప్పడంతో తిన్నాను. ఆ వగరుకి నాకు గొంతులో దురద వచ్చి, ఆ దురద పోగొట్టుకోవడానికి ఇలా అరుస్తున్నాను. అదే మీరంతా తీయని పాట అంటున్నారు. అంతేఅయితే ఆ ఘనత అంతా నాదే. నా వగరు చిగుళ్ల వల్లే నీకు తీయని కంఠస్వరం వచ్చింది. నీకు దురద పెడితే మాకెందుకు, దురద పెట్టకపోతే మాకెందుకు. ఇంతకీ మా సంగతి పక్కన పెట్టు, నువ్వు అంత ముందుగానే ఎందుకు పూత పూశావు. నీ అవసరం ఉన్న రోజు వచ్చేసరికి పూత కాస్తా పిందెలు అయిపోతావు. మమ్మల్ని అనే ముందు నిన్ను నువ్వు ఓ సారి చూసుకుని మమ్మల్ని వేపుకు తినకమ్మా వేప తల్లీ!నా సంగతి సరే. ఆ గున్నమామిడి సంగతి చూడండి... మిమ్మల్ని అనే హక్కు నాకు లేదు. అందుకే మౌనంగా ఉంటున్నాను. పిందెగా ఉండవలసిన నేను అప్పుడే కాయలు, పండ్ల రూపంలోకి మారిపోతున్నాను. ఇలా ఎందుకు జరుగుతోందంటావు చెరుకు తల్లీ!కాలమహిమ! ఋతువులకు అనుగుణంగా పంటలు పండే రోజులు మారిపోయాయి. పోనీలే... ముందు నుంచే మనల్ని రుచి చూస్తారు కదా. వాళ్లకి ఆనందం కలిగిస్తున్నాం కదా. కానీ ఈసారి నేను ఎందుకో అంత తియ్యగా ఉండేలా కనిపించట్లేదు. మన మల్లి తల్లి మాత్రం అప్పుడే పరిమళాలను ఘుమాయించేస్తోంది. గుభాళించి ఏం లాభం. ఒకప్పుడు నా పూలతో జడలు కుట్టించుకుని, అద్దం ముందు నిలబడి, ఫొటోలు తీయించుకోవడం చిన్నపిల్లలందరికీ ఒక సరదా. మరి ఇప్పుడో! అందరూ జుట్లు విరబోసుకునేవాళ్లు, పూలు పెట్టుకోవడానికి మొహమాట పడేవాళ్లూనూ. నాకు మాత్రం తాచుపాము జడలలో చుట్టలా చుట్టుకుని నల్లటి కురులలో తెల్లగా మెరవడం చాలా ఇష్టం. కనీసం కొందరైనా నన్ను అక్కున చేర్చుకుంటున్నారులే. అంతటితో తృప్తి చెందుతున్నాను.సరే మనలో మనం మాట్లాడుకుంటూ అసలు విషయం మర్చిపోయాను. ఈ రోజు మనందరం కలిసి ఒక విషయం గురించి చర్చించుకోవాలి. మన తెలుగువారి కొత్త సంవత్సరాదికి ఉగాది అని ఎందుకు పేరు పెట్టాలి. మనతోటే కదా ఉగాది వచ్చేది. కోయిల కూస్తేనే కదా వసంతం వచ్చేది. మామిడి, చెరకు, వేపపూత, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం కలిస్తేనే కదా పచ్చడి. మరి మనలో ఎవరో ఒకరి పేరు మీద ఈ పండుగను పిలుచుకోవచ్చుగా. ఆమని అంటారేకాని, కోమని అనచ్చుగా. కనీసం అందులో మన కోయిల పేరులోని మొదటి అక్షరమైనా ఉంటుంది. లేకపోతే ఆమిడి అనొచ్చు, వేపని అనొచ్చు, మల్లిమ అనొచ్చు. ఏదో ఒక పేరు పెట్టి మనల్ని గౌరవించుకోవచ్చు కదా. ఏదీ కాకుండా ఉగాది అని పేరు పెట్టారు. సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో. అందరి కంటె పెద్దదయిన మామిడి...మిత్రులారా! మీకొక విషయం చెబుతాను వినండి. ఈ పండుగకు కోయిల పేరు పెట్టామనుకోండి. మిగతా వారికి కోపం వస్తుంది. మనమందరం ప్రకృతి మాత సంతానం. మనలో ఏ ఒక్కరు అలిగినా ఆ తల్లికి బాధే కదా మరి. అందుకే ఆలోచించి, మనమెవ్వరం బాధపడకుండా ఈ పేరు పెట్టి ఉంటారు. అయినా ఉగాది అనే పేరు ఎంత బాగుందో కదా! ఇంకో విషయం కూడా ఆలోచించు. ఈ పండుగ ఆరు రుచులతో పాటు కోయిల, మల్లెల సమ్మేళనం. ఏ ఒక్కరికో సంబంధించినది కాదు కదా. అందుకే ఉగాది అయ్యింది. – డా. వైజయంతి పురాణపండ -
గడ్డుకాలం
ఎమ్మిగనూరు: రైతన్నపై ప్రకృతి పగబట్టింది. అతివృష్టి, అనావృష్టితో ఈ ఏడాది పంటలు పండని పరిస్థితిని నెలకొంది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 5.65 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. అత్యధికంగాపత్తి 2.85లక్షల హెక్టార్లలో, వేరుశనగ 85వేల హెక్టార్లలో, ఉల్లి 21500 హెక్టార్లలో సాగైంది. ఖరీఫ్ అంకురంలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు, ఆ తర్వాత అధిక వర్షాలు, మళ్లీ వర్షాభావ పరిస్థితులు.. రైతును తీవ్రంగా నష్టపరిచాయి. పండిన పంటను అమ్ముకుందామన్న గిట్టుబాటు ధర లభించడం లేదు. అన్నదాత ఆవేదన పట్టించుకునే వారు కరువయ్యారు. పత్తి రైతులు ఎకరాకు రూ. 25వేల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు పక్వానికి వచ్చిన పత్తి కాయలు నేల రాలుతున్నాయి. ఎకరానికి సగటున 3, 4 క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ధర క్వింటాల్‌కు రూ. 3500 నుంచి రూ. 4800 వరకు పలుకుతోంది. గత ఏడాదితో పోలిస్తే క్వింటాళ్లకు రూ. 1500 దాకా ధరల తగ్గింది. ఈ ఏడాది ఉల్లి రైతుకు కన్నీళ్లే మిగిలాయి. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పంట నీటి పాలైంది. పొలాల్లోనే తడిసి కుళ్లిపోయింది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఉల్లి దిగుబడులు ఈ ఏడాది ఆశాజనకంగా ఉండడంతో వ్యాపారులు ధరను అమాంతం తగ్గిస్తున్నారు. క్వింటాల్ * 400ల నుంచి * 700ల దాకా అమ్ముడుపోయాయి. ఎకరాకు రూ. 40వేల నుంచి రూ. 50వేల వరకు పెట్టి ఉల్లి పండిస్తే పండించిన రైతుకు రవాణ ఛార్జీలు (లారీ బాడుగ) కూడా రావడం లేదు. వేరుశనగ రైతులదీ అదే పరిస్థితి .. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట వేరుశన.గ. రెండేళ్ల క్రితం వరకు ఖరీఫ్‌లో 2.45 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగయ్యేది. ప్రస్తుతం 85వేల ఎకరాలకు పడిపోయింది. ఎకరాకు రూ. 20వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఎకరాకు 2 క్వింటాళ్లు కూడా దిగుబడి రావడం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలే పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల భూమి గట్టిపడి వేరుశనగను కోత (పీకడం) కోయలేని పరిస్థితి. పండిన అరకొర పంటలను కూడా మార్కెట్‌కు.. కనిష్టంగా క్వింటాల్ రూ. 1800, గనిష్టంగా రూ. 3800ల వరకు ధర పలుకుతోంది.