breaking news
National Highway Expansion
-
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహ దారి విస్తరణలో భాగంగా కీలక బైపాస్ రోడ్ల నిర్మాణం మొ దలైంది. నగర శివారులోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నిడివిని ఎన్హెచ్ఏఐ నాలుగు వరుసలుగా విస్తరించనున్న విషయం తెలిసిందే. ప్రధాన రోడ్డుపై ఉన్న 915 మర్రి వృక్షాలను సంరక్షించే విషయంలో ఎన్హెచ్ఏఐ సరైన ప్రణాళిక ఇవ్వకపోవటంతో..జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు కావటంతో రోడ్డు నిర్మాణంపై స్టే ఇచి్చ న విషయం తెలిసిందే. దీంతో ప్రధాన రోడ్డు విస్తరణ పనులు మొదలుకాలేదు. కానీ విస్తరణలో కీలకంగా ఉండే 11 కి.మీ. నిడివితో ఉండే బైపాస్ రోడ్ల నిర్మాణం మొదలై వేగంగా జరుగుతోంది. మొయినాబాద్, చేవెళ్ల వద్ద..: ఈ రోడ్డును 60 మీటర్ల వెడల్పుతో విస్తరించాల్సి ఉంది. మొయినాబాద్, చేవెళ్ల పట్టణాల వద్ద అంతమేర రోడ్డు విస్తరణ జరగాలంటే భారీగా ప్రైవేట్ భవనాలను తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఆ రెండు చోట్ల బైపాస్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. » తొలుత మొయినాబాద్ పట్టణం ముందు జేబీఐటీ వద్ద తొలి బైపాస్ రోడ్డు మొదలవుతుంది. ఇది పట్టణం దాటిన తర్వాత తాజ్ హోటల్ కూడలి వద్ద ముగుస్తుంది. దాదాపు 4.8 కి.మీ. నిడివితో సాగుతుంది. » చేవెళ్ల శివారులోని కేసారం గ్రామం వద్ద మొదలయ్యే బైపాస్ రోడ్డు దాదాపు 6 కి.మీ. మేర కొనసాగి చేవెళ్ల దాటిన తర్వాత ఇబ్రహీంపల్లి గ్రామ సమీపంలో ప్రధాన రోడ్డును కలుస్తుంది. » రెండు బైపాస్‌ల నిర్మాణానికి 135 హెక్టార్ల భూమిని సేకరించిన అధికారులు రూ.200 కోట్ల మొత్తాన్ని పరిహారంగా చెల్లించారు. చేవెళ్ల బైపాస్‌లో కొంత భాగంలో పరిహారం వివాదం కొన సాగుతుండటంతో ఆ భాగం మినహా మిగతా భా గం పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమిని 60 మీటర్ల వెడల్పుతో చదును చేసి గ్రావెల్ పరిచి కంప్రెస్ చేసే పని పూర్తయ్యింది. మొయినాబాద్ నుంచి సురంగల్, శ్రీరామ్‌నగర్ గ్రామాల మీదుగా షాబాద్ రోడ్డుకు కలిసే రోడ్డు క్రాస్ చేసే చోట విశాలమైన అండర్‌పాస్ నిర్మాణం జరుగుతోంది. మరో నాలుగు చోట్ల కల్వర్టులు నిర్మిస్తున్నారు. ఈ బైపాస్ సిద్ధమైతే సురంగల్, శ్రీరామ్‌నగర్ ప్రాంతాల వైపు వెళ్లే వాహనాలు మొయినాబాద్ కూడలి నుంచి రావాల్సిన అసవరం లేకుండా దీనిమీదుగా వచ్చే వీలుంటుంది. బైపాస్ నుంచి దిగువ రోడ్డుకు అనుసంధానించే లింక్ రోడ్లు కూడా నిర్మిస్తున్నారు. దీంతో తక్కువ సమయంలోనే అప్పా కూడలి నుంచి అక్కడకు చేరుకోవచ్చు. ఇక చేవెళ్ల బైపాస్‌లో చేవెళ్ల–షాద్‌నగర్ రోడ్డు, దామరగిద్ద గ్రామానికి వెళ్లే దారిలో అండర్‌పాస్‌ల నిర్మాణం మొదలైంది. మరో ఆరు కల్వర్టుల పనులు కూడా ప్రారంభించారు. మార్చి నాటికి ఈ రెండు బైపాస్ పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలను అనుమతిస్తామని ఎన్హెచ్ఏఐ పేర్కొంటోంది. పర్యావరణ ప్రభావ అంచనా సర్వే మొదలు.. ప్రధాన రహదారిపై మర్రి వృక్షాల రక్షణకు ఎన్హెచ్ఏఐ నడుంబిగించింది. ఆ వృక్షాల రక్షణకు పక్కా ప్రణాళికను అందజేయాలని ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. దీనికి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ) సర్వే చేయాలని చెప్పింది. గతంలో ఈ సర్వే జరిగినా, అది పక్కాగా లేదని ఇటీవల ఆక్షేపించింది. దీంతో తాజాగా ఎన్హెచ్ఐఏ జడ్ఎస్ఐ–బీఎస్ఐల నిపుణుల ఆధ్వర్యంలో ఆ సర్వే కూడా ప్రారంభమైంది. త్వరలో నివేదిక అందించనున్నారు. దాన్ని హరిత ట్రిబ్యునల్‌కు అందించి, రోడ్డు నిర్మాణంపై ఉన్న స్టే తొలగించేలా ఎన్హెచ్ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. -
ఆరు లైన్ల హైవే
♦ హైదరాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణకు కసరత్తు ♦ పునరావాసం, తరలింపునకే రూ.140 కోట్లకు పైగా వ్యయం ♦ రివైజ్డ్ ప్రతిపాదనల్లో అధికార యంత్రాంగం ♦ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించిన హైవే చీఫ్ ఇంజినీర్ సాక్షి, విజయవాడ : నగర పరిధిలోని హైదరాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణకు కసరత్తు మొదలైంది. విజయవాడ రాజధానిగా మారిన క్రమంలో ట్రాఫిక్ రద్దీ రెట్టింపయింది. నగరంలోని రహదారులను ఇప్పటికే కొంత మేరకు విస్తరించినా, నగర ప్రవేశ ప్రాంతాల్లో మాత్రం రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. దీంతో కనకదుర్గ ఫ్లైఓవర్‌కు అనుసంధానంగా జాతీయ రహదారిని కూడా విస్తరించాలని నిర్ణయించారు. కోట్లాది రూపాయల విలువైన విద్యుత్ లైన్ మార్చడం మొదలు రెండు సబ్ స్టేషన్లు కూడా తొలగించాల్సి రావటం ఇబ్బందికరంగా మారింది. విజయవాడ నగరానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీ బాగా పెరగడంతో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఈ క్రమంలో కనకదుర్గ దేవస్థానం సమీపంలో బ్రిడ్జినిర్మిస్తే ట్రాఫిక్ తీవ్రత కొంత తగ్గుతుందని భావిం చారు. దీనికి అనుగుణంగా ఆర్అండ్బీ జాతీయ రహదారుల విభాగం అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలను సిద్ధం చేసి జాతీయ రహదారుల శాఖకు పంపడంతో ఆమోదముద్ర వేసింది. రూ.427 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, రహదారుల విస్తరణ పనులు నిర్వహించనుంది. ఈ క్రమంలో జాతీయ రహదారుల శాఖ మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయనుంది. 1850 మీటర్ల పొడవున 50 పిల్లర్లతో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. కుమ్మరిపాలెం సెంటర్ దాటిన తర్వాత లారీ స్టాండ్ నుంచి రాజీవ్ గాంధీ పార్క్ వరకు బ్రిడ్జి నిర్మించనున్నారు. వచ్చే ఏడాది కల్లా దీనిని పూర్తి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో బిడ్జ్రితో పాటు హైదరాబాద్ వెళ్లే వైపు 220 మీటర్లు, విజయవాడ వైపు 220 మీటర్ల అప్రోచ్ రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించడం తదితర పనులు నిర్వహించనున్నారు. ఫ్లైవోవర్ నిర్మాణం నేపథ్యంలో 28 వేల చదరపు మీటర్ల మేర స్థల సేకరణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆక్రమణల తొలగింపు బాధ్యతను నగరపాలక సంస్థ, ఆర్ అండ్ బీ అధికారులు పర్యవేక్షించనున్నారు. విద్యుత్ శాఖ అధికారులు రోడ్లపై ఉన్న లైన్లను తొలగించడంతోపాటు, ఈ మార్గంలోని రెండు సబ్స్టేషన్ల మార్పు తదితర పనులు నిర్వహించనున్నారు. జలవనరుల శాఖ ఇరిగేషన్ కాలవలకు ఇబ్బంది లేకుండా అవసరమైన సహకారం అందించనుంది. ఈ క్రమంలో వచ్చే నెలలో పనులు ప్రారంభమగానే ఆయా శాఖలు పనులతో పాటు ఆక్రమణల తొలగింపు చేపట్టాల్సి ఉంది. రూ.140 కోట్లకు పైనే ఖర్చు జాతీయ రహదారి పక్కనున్న ఆక్రమణల తొలగింపు, విద్యుత్ లైన్ల మార్పు తదితర పనులు నిర్వహణకు సుమారు రూ.140 కోట్లకు పైగా ఖర్చు అవుతందని అంచనా వేశారు. ముఖ్యంగా వెయ్యికిపైగా చిరువ్యాపారుల దుకాణాలు, రోడ్డు మార్జిన్‌లోని వందలాది ఇళ్లను తొలగించాల్సి ఉంది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. విద్యుత్ లైన్ల మార్పునకు రూ.6.1 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. రెండు సబ్స్టేషన్లను తరలించేందుకు రూ.35 కోట్ల ఖర్చవుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసిప్రతి పాదనలు పంపింది. అయితే అంచనాలు ఎక్కువగా ఉన్నాయని 30 నుంచి 40 శాతం తగ్గించి పంపించాలని ఆదేశాలు అందాయి. పునరావాసానికి కూడా తక్కువ ఖర్చు చేస్తేనే ప్రాజెక్ట్‌కు కేటాయించిన నిధులు సరిపోతాయన్న అభిప్రాయం జాతీయ రహదారుల విభాగం అధికారులు వ్యక్తంచేస్తున్నారు.