breaking news
MYTA
-
మైట ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పూల పరిమళాలతో మలేషియా పరవశించింది. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను ప్రవాసులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. మలేషియా కౌలాలంపూర్‌లోని ఎస్డబ్ల్యూ బాంక్వెట్ హాల్, టీఎల్‌కే కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ వాసులు భారీగా తరలి వచ్చారు. సంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమైన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మలేషియాలోని సెలంగోర్ స్టేట్ మినిస్టర్ గణపతి రావు, మలేషియా తెలుగు సంఘం ప్రెసిడెంట్ డా. దాతో అచ్చయ్య కుమార్ రావు, మలేషియా తెలుగు పునాది ప్రెసిడెంట్ దాతో కాంతారావు, ఇండియన్ హైకమిషన్ లేబర్ వింగ్ సెక్రటరీ లక్ష్మీకాంత్, పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, మలేషియా తెలంగాణ రాష్ట్ర సమితి వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, సాండ్స్టోన్ మనికంట పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో మహిళలు, చిన్నారులు బతుకమ్మలను అక్కడ దొరికే రంగు రంగుల పువ్వులతో అందంగా పేర్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మా, ఒక్కొక్క పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయే చందమామ, వంటి పాటలతో మలేషియా మారుమోగింది. తెలంగాణ కళాకారుల పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వచ్చిన సాండ్ స్టోన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్పాన్సర్స్ హెచ్‌యూ డెక్కన్, కేవీటీ గోల్డ్, జాస్ డెకొరేటర్స్, మినీ మార్ట్ అప్, టీఆర్ఎస్ మలేషియా, మలబార్ గోల్డ్, మై బిర్యానీ రెస్టారెంట్ , మై81 రెస్టారెంట్, ఏపీ భవన్ రెస్టారెంట్, ప్రబలీ రెస్టారెంట్, ఎమ్ఎస్ స్పైసెస్, ఎన్ఎస్ క్యాష్ పాయింట్, గాజా ఎట్ 8 రెస్టారెంట్, మోడరన్ స్టోర్స్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం కావడానికి సహకరించిన మైట కోర్ కమిటీని వాలంటీర్లుగా ముందుకి వచ్చిన సభ్యులను, మైట సభ్యులను అయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య , వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేజరర్ మారుతీ జాయింట్ ట్రేజరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ, కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, వైస్ ప్రెసిడెంట్-అశ్విత , యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్ - కార్తీక్, యూత్ వైస్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ - రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, ఓం ప్రకాష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మలేషియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
కౌలాలంపూర్ : మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆరవ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కౌలాలంపూర్‌లో బ్రిక్ ఫీల్డ్స్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమం ప్రారంభించి అనంతరం తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆట పాటలు ప్రేక్షకులను అలరించాయి. భారీ సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైటా సుభ్యులందరికి ఫ్యామిలీ స్పోర్ట్స్ డే నిర్వహించారు. దీనిలో భాగంగా మైటా బ్యాడ్మింటన్ స్మాష్ టోర్నమెంట్లను, పిల్లలకు పెద్దలకు పలు ఆటలను ఆడించి ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు, టీఆర్ఎస్ మలేషియా ప్రెసిడెంట్ చిట్టి బాబు, ముఖ్య కార్య వర్గ సభ్యుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మైటా ప్రెసిడెంట్ సైదం తిరుపతి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, యూత్ ప్రెసిడెంట్ కార్తీక్, ముఖ్య కార్యవర్గ సభ్యులు సందీప్, మారుతీ, చందు, సందీప్, కిరణ్, ప్రతీక్, రవితేజ, సందీప్ నరేందర్, సంతోష్, స్వప్న, అశ్విత, సాహితి సాయిచరని, అనూష తదితరులు పాల్గొన్నారు.