breaking news
Mustang
-
ఫోర్డ్.. మస్టాంగ్ జీటీ వచ్చేసింది
♦ ధర రూ.65 లక్షలు ♦ గరిష్ట వేగం 250 కి.మీ./గంటకు గ్రేటర్ నోయిడా : ఫోర్డ్ కంపెనీ తన ఐకానిక్ స్పోర్ట్స్ కారు మస్టాంగ్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఫోర్డ్ మస్టాంగ్ జీటీ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.65 లక్షలు(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)అని ఫోర్డ్ ఇండియా కంపెనీ తెలిపింది. మస్టాంగ్ బ్రాండ్ 52 సంవత్సరాల చరిత్రలో భారత్‌లో మస్టాంగ్ బ్రాండ్ కారును ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని ఫోర్డ్ ఇండియా ఈడీ(మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) అనురాగ్ మెహరోత్రా పేర్కొన్నారు. ఈ కారును 5లీటర్ల వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో రూపాందించామని, గరిష్టవేగం గంటకు 250 కి.మీ. అని పేర్కొన్నారు. అమెరికాలోని ఫ్లాట్ రాక్ అసెంబ్లీ ప్లాంట్‌లో తయారైన ఈ కారును పూర్తిగా తయారైన కారు రూపంలో దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామని అనురాగ్ పేర్కొన్నారు. గత ఏడాది నుంచే ఈ కారును ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం ప్రారంభించామని, మొదటి ఏడాదిలోనే 1.1 లక్షల మస్టాంగ్ కార్లను విక్రయించామని తెలిపారు. 1964 నుంచి ఇప్పటిదాకా 90 లక్షలకు పైగా మస్టాంగ్ కార్లను ఫోర్డ్ విక్రయించింది. కారు ప్రత్యేకతలు.. మస్టాంగ్లో ఆరవ జనరేషన్ కారు ఇది. ఆరు స్పీడ్ సెలెక్ట్ షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, స్టీరింగ్‌పై పెడల్ షిఫ్టర్స్, నాలుగు డ్రైవింగ్ మోడ్స్(నార్మన్, స్పోర్ట్ప్లస్, ట్రాక్, స్నో/వెట్ మోడ్స్), ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్‌ల్యాంప్స్, పోనీ ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్స్, 19 అంగుళాల మాగ్నటిక్ గ్లోస్ పెయింట్ మెషిన్డ్ అల్యూమినియం వీల్స్, ట్రై బార్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రివర్సింగ్ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, మోకాలి దగ్గర కూడా ఎయిర్బాగ్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. -
రూ.65లక్షల ఫోర్డ్ కారు వచ్చేసింది
భారతీయులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆరవ తరం మస్టాంగ్ కారు మార్కెట్లోకి ప్రవేశించింది. అమెరికా వాహనరంగం సంస్థ ఫోర్డ్, ఐకానిక్ స్పోర్ట్స్ కారు 'మస్టాంగ్'ను రూ. 65 లక్షలకు(ఎక్స్ షోరూం ఢిల్లీలో) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 1964లో మొదలైన మస్టాంగ్ ప్రస్థానంలో, రైట్ హ్యాండెడ్ మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. 5 లీటరు, వీ8 పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో, ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. టాప్ స్పీడ్ 250 కి.మీ/అవర్ గా ఉంది. మస్టాంగ్ ను ఆరు కలర్స్ లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. రేస్ రెడ్, బ్లాక్, ట్రిపుల్ ఎల్లో ట్రై కోట్, మాగ్నటిక్, ఆక్స్ ఫోర్డ్ వైట్, ఇంగోట్ సిల్వర్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. సిక్స్ వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, రైన్ సెన్సింగ్ వైపర్స్, లంబర్ సపోర్టుతో ప్యాసెంజర్ సీట్లు, అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, 401పీఎస్ పవర్, 515ఎన్ఎమ్ టార్క్ ఈ కారు ప్రత్యేకతలు, ప్రతిఒక్కరూ డ్రైవ్ చేసేలా కారును రూపొందించడమే తమ కమిట్ మెంట్ అని, మస్టాంగ్, కారు కంటే ఎక్కువని ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్, సర్వీసు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా చెప్పారు. ఈ ఐకానిక్ కారును ప్రవేశపెట్టడానికి ఇంతకంటే సరియైన సమయం మరొకటి లేదన్నారు. అమెరికాలోని ఫోర్డ్ ఫ్లాట్ రాక్ అసెంబ్లీ ప్లాంటు నుంచి దిగుమతి చేసుకుని, మస్టాంగ్ ను భారత మార్కెట్లో అమ్మకాలు నిర్వహించనున్నారు. జనవరిలోనే ఈ మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్లాన్ ను ఫోర్డ్ ప్రకటించింది. 1964 నుంచి ఫోర్డ్ 90లక్షల యూనిట్ల మస్టాంగ్ కారు మోడల్ లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి.ప్రపంచవ్యాప్తంగా 2015లో 1.1లక్షల మస్టాంగ్ యూనిట్లను ఫోర్డ్ విక్రయించింది. . తెలుగురాష్ట్రాల ఐటీఐ విద్యార్థుల కోసం మోటార్ మెకానిక్ వెహికిల్ శిక్షణలో భాగంగా ముషీరాబాద్ ఐటీఐ ప్రాంగణంలో ఆటోమేటివ్ స్టూడెంట్ సర్వీసు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్(అస్సెంట్) కేంద్రాన్ని ఏప్రిల్ లో ఫోర్డ్ ఇండియా ప్రారంభించిన సంగతి తెలిసిందే.