కవ్వింత
పాతదే కదా
మ్యూజియం మేనేజర్: నువ్వు పగలకొట్టింది 500 సంవత్సరాల నాటి వస్తువు తెలుసా నీకు?!!
పర్యాటకుడు: హమ్మయ్య, నేనింకా అది కొత్తదేమో అని భయపడి చచ్చాను సార్, థ్యాంక్స్.
మేనేజర్: హా.... !!!
తెలివైన ప్రొడ్యూసరు
సీరియల్ నటి: ఎందుకండీ స్క్రీనింగ్‌కు ముందు హెల్త్ టెస్టులు చేయిస్తున్నారు?
ప్రొడ్యూసరు: సీరియల్ అంటే ఐదారేళ్లు తీస్తాం కదమ్మా... మరి నీకు మధ్యలో ఏమైనా సమస్యలు వస్తే ఎలా?
భార్య ప్రేమ!
రమ్య: అక్కా, శుక్రవారం తప్ప ప్రతిరోజు బియ్యంలో రాళ్లేరుతావు, మరి ఆ రోజెందుకు?
జ్యోతి: ఆరోజు నేను ఉపవాసం. మీ బావగారు ఒక్కరికేగా!
ఎటైనా చిక్కే
లాయర్: ఆ హత్య జరిగిన చోట నువ్వు లేవని నిరూపిస్తే నిర్దోషిగా విడుదలవుతావు
నిందితుడు: సార్, నిజమే ఆరోజు నా గర్ల్ ఫ్రెండుతో బీచ్‌కు వెళ్లాను. ఈ విషయం చెబితే కోర్టు వదిలేస్తుంది కానీ నా భార్య శిక్షిస్తుందే!
డాక్టరుగారి హోటల్
రంగయ్య: ఆ డాక్టరు గతంలో హోటల్ నడిపినట్టున్నాడురా.
వెంకయ్య: ఎందుకలా అనుకుంటున్నావు?
రంగయ్య: ఇంజెక్షన్ వేశాక జేబులో చూసుకుంటే డబ్బుల్లేవు. అందుకని క్లినిక్‌లో టవల్స్ అవీ ఉతికించాడు!