breaking news
Munish bali
-
కివీస్ టూర్లో టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ కోచ్!
టి20 ప్రపంచకప్‌లో సెమీస్ ఓటమి తర్వాత టీమిండియా వెంటనే మరో సిరీస్‌కు రెడీ కానుంది. న్యూజిలాండ్ పర్యటించనున్న టీమిండియా అక్కడ కివీస్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. కాగా టి20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించనుండగా.. వన్డే సిరీస్‌కు టీమిండియాను ధావన్ నడిపించనున్నాడు. ఇక కివీస్ పర్యటనకు సీనియర్లు సహా ప్రధాన కోచ్ ద్రవిడ్‌లకు రెస్ట్ ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ బాధ్యతలు తీసుకోగా.. అతనికి సపోర్ట్ స్టాఫ్‌గా హృషికేష్ కనిత్కర్, సాయిరాజ్ బహుతులేలు బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా ఎంపికయ్యారు. తాజాగా కివీస్ పర్యటనకు బీసీసీఐ.. మునిష్ బాలీని కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించినట్లు సమాచారం. కాగా కివీస్ పర్యటనలో సపోర్ట్ స్టాప్‌లో ఉన్న ముగ్గురు ఎన్సీఏతో అనుబంధం ఉన్నవారే. వీరి ఎంపికలో ఎన్సీఏ హెడ్.. కివీస్ పర్యటనకు కోచ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ పాత్ర ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా మునిష్ బాలి ఇంతకముందు టీమిండియా ఐర్లాండ్ పర్యటనలోనూ సపోర్ట్ స్టాప్‌గా ఉన్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లోనూ తన విధులు నిర్వర్తించాడు. తాజాగా పూర్తి స్థాయిలో ఫీల్డింగ్ కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది. కాగా ఇదే సమయంలో సీనియర్స్ టీమ్ మాత్రం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక కివీస్ పర్యటనలో నవంబర్ 18న తొలి టీ20 ఆడనున్న టీమిండియా.. 20, 22 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం 25న తొలి వన్డే, 27, 30 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ పర్యటనకు భారత టి20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ -
మారుతీ ఆషాఢం ధమాకా
హైదరాబాద్: మారుతీ సుజుకీ కంపెనీ ఆషాఢం సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లనందిస్తోంది. వావ్! ఆషాఢం దమాకా పేరుతో ఈ ఆఫర్లనందిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 31లోపు ఏదైనా మారుతీ కారు(ఎంపిక చేసిన మోడళ్ల)ను కొనుగోలు చేసిన వారికి ఒక స్క్రాచ్‌కార్డ్‌ను ఇస్తామని కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ మునీష్ బాలి పేర్కొన్నారు. కొనుగోలుదారులు రూ. 34,000 విలువైన మూడు ఖచ్చితమైన బహుమతులు గెల్చుకునే అవకాశముందని తెలిపారు. అంతేకాకుండా బంపర్ డ్రాలో కొత్త స్విఫ్ట్ డీజిల్ కారు గెల్చుకునే అవకాశముందని వివరించారు.