breaking news
municipal high schools
-
బెడిసికొట్టిన టీచర్ల సర్దుబాటు
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో సర్దుబాటు పేరిట ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ బెడిసికొట్టింది. పాఠశాలలు తెరిచిన తర్వాత దాదాపు 2 నెలల పాటు కసరత్తు చేసి, ఒక యూనిట్ పరీక్షలు పూర్తయ్యాక ప్రారంభించిన బదిలీలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన నిబంధనలను మునిసిపల్, ఎయిడెడ్ స్కూళ్లలోనూ అమలు చేయడంతో అక్కడ ఒకటి, రెండు తరగతులకు బోధిస్తున్న జూనియర్ ఉపాధ్యాయులను పదో తరగతి సిలబస్ బోధించేందుకు బదిలీ చేయడం గమనార్హం.సర్దుబాటుకు ముందు ప్రాథమిక పాఠశాలల్లో సీనియర్లు, అర్హత గల ఉపాధ్యాయులను సబ్జెక్టు టీచర్లుగా నియమించడంతో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, ఈ సర్దుబాటు ప్రక్రియతో ప్రస్తుతం హైస్కూళ్లలో బోధిస్తున్న సీనియర్ ఎస్జీటీలను తిరిగి ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లలోని జూనియర్లను హైస్కూళ్లకు పంపించారు. సబ్జెక్టుపై అవగాహన లేనివారిని హైస్కూళ్లకు పంపడంతో పాటు కొన్ని సబ్జెక్టులకు అసలు టీచర్లనే నియమించలేదు. దీంతో ఉత్తమ ఫలితాల సాధన అటుంచి, విద్యార్థులను పాస్ కూడా చేయలేమని మునిసిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా సబ్జెక్టు నిపుణుల కొరత ఉన్నప్పుడు గత ప్రభుత్వం అర్హతలున్న దాదాపు 8 వేల మంది ఎస్జీటీలను సీనియారిటీ ఆధారంగా సబ్జెక్టు టీచర్లు (స్కూల్ అసిస్టెంట్)గా పదోన్నతి కలి్పంచింది. విద్యా సంవత్సరం మధ్యలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్లు రిటైరైతే వారిస్థానంలో అర్హత గల సీనియర్ ఎస్జీటీని డిప్యుటేషన్‌పై నియమించింది. తద్వారా పదో తరగతిలో 91 శాతం ఉత్తీర్ణత సాధ్యమైంది. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లకు ఇదే విధానం అనుసరించింది.మునిసిపల్ హైస్కూళ్లలో 8 ఏళ్లుగా పోస్టులను భర్తీ చేయకపోవడంతో దాదాపు 2,800 సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. మునిసిపల్ ఉపాధ్యాయ సరీ్వస్ రూల్స్‌పై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో సబ్జెక్టు టీచర్ల కొరతను తొలగించేందుకు ప్రాథమిక పాఠశాలల్లోని సీనియర్లు, సబ్జెక్టు నిపుణులను డిప్యుటేషన్‌పై నియమించి పదో తరగతి సిలబస్ బోధించేవారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన “సర్దుబాటు’ ప్రక్రియలో నిబంధనల ప్రకారం విద్యారి్థ, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా చూపి బదిలీ చేశారు. ఇదే నిబంధనను మునిసిపల్ స్కూళ్లకు వర్తింపజేయడంతో ప్రాథమిక పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల్లో అత్యంత జూనియర్‌ను హైస్కూళ్లలో సర్దుబాటు చేసి, ప్రస్తుతం ఇక్కడ డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సీనియర్లను ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించారు. మరోపక్క హిందీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ఈ ప్రభావం ఈ ఏడాది పదో తరగతి ఫలితాలపై తీవ్రంగా చూపనుంది. -
నిర్లక్ష్యం నీడన మున్సిపల్ స్కూళ్లు
– పర్యవేక్షణ లేక గాడి తప్పిన విద్యాబోధన – టీచర్ల గైర్హాజరీపై ప్రశ్నించే నాథుడే కరువు – సైన్స్ ల్యాబ్‌లు లేక నిలిచిపోయిన ప్రయోగాలు – ప్రాథమిక పాఠశాలల్లో నెలల తరబడి హెచ్ఎంలు కరువు సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలోని మున్సిపల్ స్కూళ్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. విద్యాబోధన గాడి తప్పుతోంది. సైన్స్ ల్యాబ్‌లు, అందులో పరికరాలు లేక సగానికి పైగా స్కూళ్లల్లో ప్రాక్టికల్ తరగతులు నిలిచిపోయాయి. ఇదే అదునుగా సబ్జెక్టు టీచర్లు తరగతులకు గైర్హాజరవుతున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. రాష్ట్రంలోని 58 మున్సిపాల్టీల్లో 2,115 మున్సిపల్ స్కూళ్లున్నాయి. వీటిలో ఆరు నుంచి పదో తరగతి వరకూ 3.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2007 వరకూ ఇవన్నీ స్కూల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో ఉండేవి. ఆ తరువాత జరిగిన పాలనా పరమైన మార్పుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం మున్సిపల్ స్కూళ్లపై అజమాయిషీ మున్సిపాల్టీలదే అయినప్పటికీ, స్కూళ్ల పర్యవేక్షణ కోసమంటూ అధికారులెవ్వరూ లేకుండా పోయారు. రోజువారీగా ఏ స్కూలు ఎలా పనిచేస్తుంది, ఎంత మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు,..తరగతులు ఎలా జరుగుతున్నాయన్న విషయాలను పరిశీలించి అటు మున్సిపల్ అధికారులు, ఇటు ప్రభుత్వానికి నివేదించే అధికారులే లేకుండా పోయారు. ఎడ్యుకేషన్ అధికారులంటూ లేని కారణంగా చాలా చోట్ల మున్సిపల్ స్కూళ్ల నిర్వహణ గందరగోళంగా మారుతోంది. మున్సిపల్ స్కూళ్లకు సర్వీస్ రూల్స్ లేకపోవడంతో పలు చోట్ల ఉపాధ్యాయుల పనితీరు సంతృప్తికరంగా లేకుండా పోయింది. నెల్లూరు మున్సిపల్ స్కూల్లో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు ఆరు నెలలు సెలవు ఉన్నా అధికారులు గుర్తించ లేదంటే పర్యవేక్షణ ఎలా ఉందో అవగతమవుతుంది. ఇప్పటికీ చాలా చోట్ల ప్రాథమిక స్కూళ్లల్లో హెచ్ఎం పోస్టులు లేవు. 200 కంటే ఎక్కువ స్కూళ్లల్లో టేబుళ్లు, కుర్చీల వంటి ఫర్నీచర్ లేదు. విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపాల్టీల్లోని దాదాపు 30 స్కూళ్లల్లో తరగతి గదుల సమస్య నెలకొంది. దీంతో విద్యార్థులు ఆవరణలోని చెట్ల కింద, ప్రహరీ నీడన చదువులు సాగించాల్సి వస్తోంది. ఎక్కడా సైన్స్ ల్యాబ్‌లు లేవాయె... పదో తరగతి విద్యార్థులకు రోజూ ఒక పిరియడ్ ప్రాక్టికల్స్ తరగతులు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, నేచురల్ సైన్స్ విద్యార్థులకు ప్రయోగశాలలు ఉంటేనే ఈ తరహా తరగతులు జరుగుతాయి. అయితే 80 శాతం మున్సిపల్ స్కూళ్లల్లో సైన్స్ ల్యాబ్‌లు లేవు. కనీసం ప్రయోగాలకు సంబంధించిన మైక్రోస్కోప్, «ధర్మామీటర్, సింపుల్ బ్యాలెన్స్ వంటి పరికరాలు కూడా లేవు. ఇకపోతే ద్రావకాల్లో నిల్వ ఉంచి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు కోసం ఉంచాల్సిన వివిధ రకాల జంతువుల బొమ్మలు, చార్టులు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ప్రయోగాత్మక తరగతులు నిర్వహించడం ఉపాధ్యాయులకు కష్టంగా మారింది. సదుపాయాలేమీ లేకుండా కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడి ఫలితాలు సాధించాలంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఆరు నెలల్లో అన్నీ.... వచ్చే ఆరు నెలల్లో మున్సిపల్ స్కూళ్లును మెరుగైన సదుపాయాలు కల్పించడమే కాకుండా సమస్యలన్నింటినీ తీరుస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పీ. నారాయణ సమాధానమిచ్చారు. ఇందుకోసం సీఎం చంద్రబాబునాయుడు రూ.50 కోట్ల సీఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. అంతేకాకుండా తిరుపతిలో టీటీడీ, నెల్లూరులో పోర్టు అధికారులు, గుంటూరు, విజయవాడల్లో ఎల్ అండ్ టీ కంపెనీలు మున్సిపల్ స్కూళ్ల అభివృద్ధికి నిధులు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులతో సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ల ఏర్పాటు చేస్తామన్నారు.