breaking news
Mukesh Kumar Singh
-
తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Vishnu Manchu)కు హిట్టు పడి చాలా ఏళ్లే అయింది. ఆయన చివరగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి రొటీన్ సినిమాలు కాదని తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పట్టాలెక్కించాడు. దీనికోసం ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే కన్నప్ప షూటింగ్ మొదలుపెట్టాడు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి బడా తారలు కీలక పాత్రలు పోషించారు. కన్నప్పపై ట్రోలింగ్మహాభారత్, రామాయణ్ సీరియల్స్ తెరకెక్కించిన హిందీ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. దీంతో సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు.. కన్నప్పపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమా టీజర్ రిలీజైనప్పుడు ఉత్తి పుణ్యానికే నెగెటివిటీ ప్రచారం చేశారు. యూట్యూబ్‌లో నాన్నగారి గురించి, నా గురించి ఏమీ లేకపోయినా నెగెటివ్ థంబ్‌నైల్స్ పెడితే వారికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఆదాయం వస్తోంది. వీఎఫ్ఎక్స్ గుర్తించలేకపోయారుఅది ఎంత పెద్ద తప్పని వారు రియలైజ్ అవట్లేదు. లొకేషన్స్ బాలేవు, గ్రాఫిక్స్ బాగోలేవు అని నానామాటలు అన్నారు. చాలామందికి తెలియని విషయమేంటంటే నేను రిలీజ్ చేసిన మొదటి టీజర్లో చాలా తక్కువ వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. రెండో టీజర్లో మాత్రం 70% వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. అదెవరూ గుర్తించలేకపోయారు. మోహన్‌లాల్‌గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప అన్నీ ఒరిజినలే! రియల్ లొకేషన్లో షూట్ చేశాం అన్నాడు. నాతో ఎవరూ చేయరుతెలుగులో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా, హిందీలో ముకేశ్ కుమార్‌నే ఎందుకు నమ్మారు? ఆయనకే ఎందుకు డైరెక్షన్ బాధ్యతలు ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు విష్ణు స్పందిస్తూ.. నాతో తెలుగులో ఏ డైరెక్టర్ పని చేయరని నాకు తెలుసు. కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరూ నాతో చేయరని అందరికీ తెలుసు. పైగా దీనికంటే ముందు నేను చేసిన రెండు,మూడు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇక్కడ ఎవరూ చేయరు. మహాభారతాన్ని (సీరియల్) అంత గొప్పగా తీసిన ముకేశ్ కన్నప్పను అంతే అద్భుతంగా తెరపై చూపించగలరని నమ్మాను అని చెప్పాడు. ముకేశ్ కుమార్ సింగ్‌కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం!చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
ప్రభాస్ది పవర్ఫుల్ పాత్ర.. చివరి గంట అద్భుతం: దర్శకుడు ముకేష్
కన్నప్ప అనేది మైథలాజీ కాదు.. ఇది మన హిస్టరీ. ఓ ఘటన జరిగితే.. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. కన్నప్ప అనే వాడు ఉండేవాడు. కానీ ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర. దాన్నే మా చిత్రంలో చూపించాం’ అన్నాడు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్. ఆయన దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ముఖేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..👉 నేను ఇంత వరకు బుల్లితెరపై చేసినవన్నీ హై బడ్జెట్ ప్రాజెక్టులే. ‘మహా భారతం’ సీరియల్‌ను రూ. 200 కోట్లతో తీశాం. నాకు సినిమాలేమీ కొత్త కాదు. ఇది వరకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇంగ్లీష్ చిత్రాల్ని నిర్మించాను. నేను బుల్లితెరకు పని చేసినా, వెండితెరకు పని చేసినా ఒకే మైండ్ సెట్‌తో పని చేస్తాను.👉 ‘మహాభారతం’ సీరియల్ అన్ని ఎపిసోడ్స్‌కి నేను దర్శకత్వం వహించలేదు. మరి కొంత మంది దర్శకులు కూడా ఉన్నారు. విష్ణు టీం నుంచి నాకు ఓ సారి కాల్ వచ్చింది. నాతో పాటు ఇంకా కొంత మంది కూడా ఆ సీరియల్‌కు డైరెక్ట్ చేశారు అని చెప్పాను. ఆ తరువాత చాలా రోజుల వరకు కాల్స్ ఏమీ రాలేదు. అనూప్ సింగ్ ఠాకూర్ ఆచారి అమెరికా యాత్ర సినిమాను చేశారు. ఆ టైంలో నా గురించి అనూప్,విష్ణుకి చర్చ జరిగింది. అలా నన్ను మళ్లీ అప్రోచ్ అయ్యారు.👉 విష్ణు నన్ను హైదరాబాద్‌కు రమ్మన్నారు. ఇక్కడకు వచ్చినప్పుడు ఓ మూడు, నాలుగు గంటలు చర్చించుకున్నాం. అప్పటి వరకు నాకు కన్నప్ప గురించి అంత పెద్దగా తెలీదు. విష్ణు ఈ కథ గురించి చెప్పిన తరువాత చాలా రీసెర్చ్ చేశాను. మళ్లీ మోహన్ బాబు గారు మరోసారి పిలిచారు. మహాభారతం సీరియల్ గురించి నాతో గంట మాట్లాడారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చర్చించుకున్నాం. అలా నన్ను ఈ చిత్రానికి ఫైనల్ చేశారు.👉 ‘కన్నప్ప’ కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అందరూ ఎంతో అంకిత భావంతో సెట్స్ మీద వర్క్ చేశారు. వారి వల్లే నా పని చాలా ఈజీగా మారిపోయింది. అక్షయ్ , మోహన్‌లాల్, ప్రభాస్ , మోహన్ బాబు , విష్ణు , బ్రహ్మానందం ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. మోహన్ బాబు ఈ వయసులోనూ ఎంతో ప్యాషనేట్‌గా పని చేశారు. నిర్మాతగా ఒకలా ఉండేవారు.. నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవారు.👉 ‘కన్నప్ప’ మీద ఇంత వరకు వచ్చిన చిత్రాలన్నీ చూశాను. కన్నడ, తెలుగు, హిందీలో వచ్చిన చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకున్నాను. విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. చివరి గంట అద్భుతంగా ఉంటుంది.👉 మా ఆర్ట్ డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నో మ్యూజియంలను సందర్శించారు. వెపన్స్, క్యాస్టూమ్స్ మీద చాలా పరిశోధనలు చేశాం. రెండో శతాబ్దం వాతావరణం తెరపైకి తీసుకు రావడానికి చాలా ప్రయత్నించాం. అందుకే న్యూజిలాండ్‌కు వెళ్లి మూవీని షూటింగ్ చేశాం.👉 ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవ్వరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశచెందరు. ఇప్పటి వరకు చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.👉 కన్నప్పపై ఇది వరకు వచ్చిన చిత్రాల్లో కూడా లిబర్టీ తీసుకున్నారు. ఇందులో కూడా కొంత వరకు ఫిక్షనల్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇంటర్ లింకింగ్‌గా చూపించాం. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ మూవీని చూపించాం. ఈ చిత్రం పూర్తయిన తరువాత అద్భుతంగా ఉందని అర్చకులు మెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని అడిగారు.👉 మహాభారతం సీరియల్ తీశాను. ఇప్పుడు సినిమాగా తీయాలని అనుకుంటున్నాను. మహాభారతం అనేది పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరైనా తీసుకోవచ్చు. రాజమౌళి గారు తీసుకోవచ్చు. ఆమిర్ ఖాన్ గారు తీసుకోవచ్చు. అది పబ్లిక్ డొమైన్లో ఉన్న సబ్జెక్ట్.