breaking news
mohammad khaif
-
కొడుకు కోసం తల్లి బౌలర్ అవతారం
-
ఆంధ్ర కెప్టెన్‌గా కైఫ్
కాన్పూర్: రాబోయే 2014-15 దేశవాళీ సీజన్లో ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్‌గా భారత మాజీ ఆటగాడు మొహమ్మద్ కైఫ్ వ్యవహరిస్తాడు. 16 ఏళ్ల పాటు ఉత్తరప్రదేశ్ తరఫున ఆడిన కైఫ్, ఇకపై ఆంధ్రలోని యువ ఆటగాళ్లను తీర్చి దిద్దుతానని చెప్పాడు. ‘యూపీతో నా అనుబంధం ముగిసింది. రైనా, చావ్లా, ప్రవీణ్‌లాంటి యువ ఆటగాళ్లు జట్టుతో చేరినప్పుడు సీనియర్‌గా వారికి నా సూచనలిచ్చాను. ఇప్పుడు ఆంధ్ర ఆటగాళ్ల బాధ్యత తీసుకుంటున్నాను. వారిలో ప్రతిభను గుర్తించి మార్గదర్శిగా ఉంటాను. జట్టు కెప్టెన్‌గా కీలకపాత్ర పోషించాల్సి ఉంది’ అని కైఫ్ అన్నాడు.