breaking news
mobile chating
-
వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఓ అనుమానితుడిని తనిఖీ చేస్తున్న పోలీసులు అతడి ఫోన్లోని వాట్సాప్‌ను పరిశీలిస్తున్న వీడియో రెండు రోజులుగా వైరల్‌గా మారింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భగ్నమంటూ వాట్సాప్‌లో కామెంట్లు వచ్చాయి. దీనిపై నగర కొత్వాల్ అంజనీకుమార్ గురువారం స్పందించారు. అనుమానితులను పట్టుకున్నప్పుడు ఆద్యంతం సోదా చేయడం తమ విధుల్లో భాగమని పేర్కొన్నారు. అలా చేయని కారణంగానే ఇటీవల నార్త్‌జోన్ పరిధికి చెందిన ఓ కానిస్టేబుల్‌పై నిందితుడు జేబులోని కత్తితో దాడి చేశాడని వివరించారు. చదవండి: వాట్సాప్ గ్రూప్‌లో గంజాయి ఆర్డర్ మరోపక్క అనుమానితులు, నిందితుల మధ్య సంబంధాలు కనిపెట్టడానికి వాట్సాప్ తదితరాల తనిఖీ తప్పనిసరని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఉన్నప్పటికీ.. మనమంతా వాట్సాప్ యూనివర్సిటీలో విద్యార్థులుగా మారిపోయామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మవద్దని, వాట్సాప్‌లో వచ్చే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. Sir @TelanganaDGP @CPHydCity is this permissible under any law? to stop and check people, their Mobile Phone, chatting, pockets and etc?. Can you do this at Banjara Hills or Hi tech City areas?. This is clear harassment to common and illiterate people. pic.twitter.com/vej4Csxqdm — S.Q.Masood | مسعود (@SQMasood) October 28, 2021 32 కేసులు.. 60 మంది అరెస్టు ఈ నెల 19 నుంచి గురువారం వరకు గంజాయి దందాకు సంబంధించి సిటీలో మొత్తం 26 కేసులు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. దీంతో పాటు ఇతర మాదకద్రవ్యాలతో కలిపి 32 కేసుల్లో 60 మందిని అరెస్టు చేశామన్నారు. గంజాయి కేసుల్లో 389 కేజీలు స్వా«దీనం చేసుకున్నామని, చిక్కిన వారిలో ముగ్గురు మహారాష్ట్ర, ముగ్గురు ఏపీకి చెందిన వారూ ఉన్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఈ ఏడాది మొత్తం 114 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని, వీరిలో 31 మంది గంజాయి, డ్రగ్స్ కేసులకు సంబంధించిన వారన్నారు. మరో 21 మందిపై త్వరలో పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. -
చాటింగ్‌తో పరిచయం... ఆపై అత్యాచారం
ఆస్ట్రేలియాలో ముగ్గురు భారతీయులపై అభియోగాలు మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ముగ్గురు భారతీయ యువకులు మొబైల్ చాటింగ్ ద్వారా ఒక మహిళను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ చాటిం గ్‌తో ఆమెను పరిచయం చేసుకుని, బెదిరించి, అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డారు.ఈమేరకు అజిత్‌పాల్ సింగ్(31), రణధీర్ సింగ్(20)పై పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో మరో భారతీయ వ్యక్తి ఉన్నప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. శనివారం ఏసీటీ మేజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు ఈ కేసు వివరాలను తెలిపారు. గతనెల 25న మొబైల్ అప్లికేషన్ టాంగో చాట్ ద్వారా బాధితురాలికి ఒక వ్యక్తి నుంచి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ (స్నేహం కోసం అభ్యర్థన) వచ్చింది. దానిని ఆమోదించిన తర్వాత ఆమె, అతడు సెప్టెంబర్ 26న కిప్పక్స్ ఫెయిర్ షాపింగ్ సెంటర్ వద్ద కలుసుకోవాలనుకున్నారు. తీరా ఆ మహిళ వచ్చి చూసేసరికి కారులో ముగ్గురు భారతీయులు ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. తమతో రావాలని రణధీర్ కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో అతడు బెదిరింపులకు దిగాడు. ‘నీకు పెళ్లయిందని తెలుసు. మన చాటింగ్ మెస్సేజ్‌లను నీ భర్తకు చూపిస్తా. అంతేకాదు స్కూలుకెళ్లే నీ పిల్లలకు హాని తలపెడతాం’ అని బెదిరించి ఆమెను ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు.