breaking news
MK Alagiri suspended
-
డీఎంకె నుంచి అళగిరి బహిష్కరణ
-
డీఎంకె నుంచి అళగిరి బహిష్కరణ
చెన్నై: డీఎంకేలో వారసత్వ పోరుకు ఆ పార్టీ అధినేత ఎంకె కరుణానిధి చెక్ పెట్టారు. పెద్ద కుమారుడు ఎంకె అళగిరిపై వేటు వేశారు. పార్టీ నుంచి అళగిరిని తాత్కాలికంగా బహిష్కరించారు. పార్టీ దక్షిణ విభాగ వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న అళగిరిని తాత్కాలికంగా సస్పెండ్ చే డీఎంకే ప్రధాన కార్యదర్శి కె అంబళగన్ తెలిపారు. పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. సోదరుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా, డీఎండీకే అధినేత విజయకాంత్ శైలిని తప్పుబడుతూ అళగిరి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. దీనిపై కరుణానిధి తీవ్రంగా స్పందించారు. పార్టీకి, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతటివారైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడానికీ వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆళగిరిపై డీఎంకె క్రమశిక్షణ చర్య తీసుకుంది.