అప్పుడే ఆ హీరోయిన్‌తో సీక్రెట్ డేటింగా..!
న్యూయార్క్: ప్రముఖ డీజే సూపర్ స్టార్ కాల్విన్ హ్యారిస్ మరో కొత్త గర్ల్‌ఫ్రెండ్ చేయందుకున్నాడు. ఆమెతో కలిసి చాలా రహస్యంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. వారిద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు ఏ ఒక్కరికీ తెలియకూడదన్న ఉద్దేశంతోనే రహస్య సంబంధాన్ని కొనసాగిస్తున్నారట. అంతకుముందు ప్రముఖ గాయని టినాషే తో డేటింగ్ చేసిన ఈ 32 ఏళ్ల డీజే స్టార్ ఇటీవలె ఆమెతో విడిపోయాడు. అలా దూరమయ్యాడో లేదో వెంటనే మరో ప్రముఖ నటి, 26 ఏళ్ల మోడల్ ఐజా గాంజ్లెజ్కు దగ్గరయ్యాడు.
ఈమె మెక్సికన్ భామ. అయితే, ఐజా కూడా గతంలో నటుడు లియామ్ హెమ్స్‌వర్త్ తోపాటు ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డోతో కూడా డేటింగ్ చేసింది. అయితే, వారిద్దరితో ఆమె రిలేషన్ కొద్ది రోజులు మాత్రమే నిలబడింది. కాగా, తాజాగా డీజే స్టార్ కాల్విన్, ఐజాల రిలేషన్ పై కాల్విన్ స్నేహితుడు జాన్ న్యూమాన్ స్పందిస్తూ తన స్నేహితుడు ఏం చేసినా సరైనవే చేస్తాడని చెప్పాడు. అతడి భావోద్వేగాలు చాలా శక్తిమంతమైనవని, అతడు బలమైన మనసుగలవాడని పేర్కొన్నాడు. అతడు ప్రయాణించే రైలులాంటి వాడని, అతడు ఏం చేశాడన్నదానిపై కాకుండా అతడు ఏం చేయగలడు అనే దానిపైనే ఆలోచిస్తే అందరికీ మంచిదని అభివర్ణించాడు.