breaking news
Methane gas explosion
-
వదిలేసిన ఆహారం విషమవుతోంది!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుంది. కొన్ని దేశాలలో ఉత్పత్తి చేసిన ఆహారంలో చాలా భాగం వృథా అవుతోంది. ఇక్కడ ఫుడ్ వేస్ట్ అవడమే కాదు అది మళ్లీ మనకే ప్రాణాంతకమవుతోంది. ఈ వృథా ఆహార పదార్థాలు చెత్త డంపుల్లో పడి మీథేన్ వంటి ప్రమాదకర గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరం. ప్రపంచ గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో ఆహారం వృథా కారణంగా 8 నుంచి 10% వరకు ఉంటున్నాయి. అలాగే 30% వ్యవసాయ భూమిని ఆహార పదార్థాలకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. మీకు తెలుసా? ఒక ఇంట్లో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 132 కిలోగ్రాముల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. అలాగే, ప్రపంచదేశాలు ఏటా 1 లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆహారాన్ని వదిలేస్తున్నాయి. మరో విషాదమేమంటే.. ఇంత ఆహారం వృతా అవుతున్నా ప్రపంచంలో 78.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుండటం..!చైనా.. భారత్.. పాకిస్తాన్..ఆహార వృథా సమస్య తీవ్రతపై 2024లో ఓ నివేదిక విడుదలైంది. ఇందులోని డేటాలో ప్రపంచంలోని ఏఏ దేశాల వాళ్లు ఎక్కువ ఆహారాన్ని వృధా చేస్తున్నారో తెలిపారు. ఆహారం వృథా చేసే దేశాల్లో మొదటి స్థానాన్ని చైనా ఆక్రమించింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశాలలో చైనా ఒకటి. చైనాలో సంవత్సరానికి 108 మిలియన్ టన్నులకు పైగా ఆహారాన్ని వృథా అవుతోంది. అంటే చైనాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 76 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నాడన్నమాట. ఇక రెండో స్థానంలో ఉన్నది మనమే. మనదేశంలో సంవత్సరానికి 78 మిలియన్ టన్నులకు పైగా ఆహారం వృథా అవుతోంది. దేశ జనాభా ఎక్కువ కాబట్టి ప్రతి భారతీయుడు సంవత్సరానికి 54 కేజీలు వృథా చేస్తాడు. అసమర్థ స్టోరేజ్, రవాణా లోపాలు, వ్యవసాయ క్షేత్రం నుంచి మార్కెట్‌కు తరలించేటప్పుడు ఆహారం చెడిపోవడం..వంటివి ఫుడ్ వేస్ట్ అవడానికి ప్రధాన కారణాలు. మూడో స్థానం పాకిస్తాన్. ఇక్కడ ఏడాదికి 31 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. అయితే సగటున ప్రతి వ్యక్తి 122 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. ప్రపంచంలో ఆహారం వృథా అయ్యేది ఇక్కడే. నిల్వ వసతులు లేమిఆహార వృథాలో నాలుగో స్థానం నైజీరియాది. ఇక్కడ 24.8 మిలియన్ టన్నుల వృథాతో సగటున ఒక్కో వ్యక్తి 106 కేజీల ఆహారం వృథా చేస్తున్నాడు. ఇక్కడ వృథా ఎక్కువగా వినియోగదారుల నుంచి కాకుండా కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, రవాణా సమస్యలు, మార్కెట్ యాక్సెస్ లోపాలతో వృథా అవుతోంది. ఐదో స్థానంలో అమెరికా ఉంది. అమెరికాలో ప్రతి ఏటా దేశం మొత్తంలో 24 మిలియన్ టన్నులు ఆహారం వృథా అవుతండగా లగటు ప్రతి వ్యక్తి 71 కేజీలు వృథా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లలో ఆహారం వృథా అవుతుంది. ఆరో స్థానంలో బ్రెజిల్. సంవత్సరానికి 20 మిలియన్ టన్నులు పైగా, ప్రతి వ్యక్తికి 95 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఏడో స్థానంలో ఈజిప్ట్ ఉంది. 18 మిలియన్ టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి వ్యక్తి 155 కేజీలు వృథా చేస్తున్నారు. ఎనిమిదో స్థానంలో ఇండోనేసియా ఉంటుంది. 15 మిలియన్ టన్నులతో ప్రతి వ్యక్తి 52 కేజీలు వృథా చేస్తున్నాడు. తొమ్మిదో స్థానంలో బంగ్లాదేశ్. 4 మిలియన్ టన్నులు పైగా, కానీ వ్యక్తికి 82 కేజీల చొప్పున వృధా అవుతోంది. బంగ్లాదేశ్ లాంటి దేశానికి ఇది చాలా ఎక్కువ. చివరి స్థానంలో మెక్సికో నిలిచింది. ఏడాదికి 13.4 మిలియన్ టన్నుల మేర వృథా అవుతుంది. సగటున ప్రతి వ్యక్తి 102 కేజీలు ఆహారం వృథా అవుతోంది.మనం ఏమి చేయగలం? అవసరమైన మేరకే కొనుగోలు చేయడం, వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం, ఫుడ్ బ్యాంకులకు డొనేట్ చేయడం వంటి చిన్న మార్పులతో పెద్ద తేడా తీసుకురావచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. మార్పు మన నుంచే మొదలుకావాలన్నది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఆ తర్వాతే సమాజం, దేశంతో పాటు ప్రపంచం కూడా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అదే ఆహారం మనకే విషమైతే..? మనుగడ ప్రశ్నార్థకమవుతుంది..! -
ఇరాన్ గనిలో పేలుడు.. 51 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్ తూర్పు ప్రాంతంలోని దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్‌లోని టబాస్ గనిలో భారీ ప్రమాదం సంభవించింది. మిథేన్ గ్యాస్ వెలువడటంతో జరిగిన పేలుడులో 51 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 20 మంది గాయపడ్డారు. మరికొందరి జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో 70 మందికి పైగా 700 మీటర్ల లోతులో పనిచేస్తున్నారని చెప్పారు. రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారులను ఆదేశించారు. -
Turkey: బొగ్గు గనిలో భారీ పేలుడు.. కార్మికుల దుర్మరణం
అంకారా: టర్కీ ఉత్తర భాగంలో ఘోర ప్రమాదం సంభవించింది. అమస్రా వద్ద ఓ బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి పాతిక మందికి పైగా మరణించారు. డజన్ల మంది ఇంకా గనిలోనే చిక్కుకుని పోయారు. వాళ్లంతా సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు ఆ దేశ ప్రజలు. శుక్రవారం సూర్యాస్తమయం కంటే కాస్త ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. వందల మీటర్ల భూగర్భంలో డజన్ల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో 110 మందికిపైగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పేలుడు సంభవించిన వెంటనే కొందరు కార్మికులు వాళ్లంతట వాళ్లుగా బయటకు వచ్చిన దృశ్యాలు నెట్లో వైరల్ అవుతున్నాయి. దాదాపు 50 మంది కార్మికులు భూమికి దిగువన 300 మరియు 350 మీటర్ల (985 నుండి 1,150 అడుగులు) మధ్య రెండు వేర్వేరు ప్రాంతాలలో చిక్కుకుని ఉంటారని రెస్క్యూ టీం అంచనా వేస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెఉలస్తోంది. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ ఉదయం నుంచి చర్యలు మొదలుకానున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని.. శనివారం ప్రమాద స్థలానికి చేరుకుంటారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో.. 2014లో టర్కీ పశ్చిమ పట్టణం సోమాలో సంభవించిన ఎయ్నజ్ బొగ్గు గని ప్రమాదంలో 310 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. Update- #Rescue operation underway.. At least 25 killed and dozens trapped underground after massive blast tears through coal mine in #Turkey. Around 110 workers were in the mine at the time of the #explosion.#bartin #bartinamasra #MineBlast #News pic.twitter.com/g3mwAgfmkQ — Chaudhary Parvez (@ChaudharyParvez) October 15, 2022 -
రష్యాలో గనిలో పేలుడు..36 మంది మృతి
మాస్కో: ఉత్తర రష్యాలోని సెవెర్నయ గనిలో ఆదివారం మరోమారు మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐదుగురు రెస్క్యూ సిబ్బంది, ఒక గని కార్మికుడు మృతి చెందారు. మరో 11 మంది గాయాలపాలయ్యారు. గత గురువారం జరిగిన పేలుడులో నలుగురు మరణించగా.. 26 మంది గల్లంతయ్యారు. వీరి జాడ కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతుండగా మరోమారు పేలుడు సంభవించింది. కాగా, గల్లంతైన ఆ 26 మంది బతికుండే అవకాశం లేదని, వారంతా చనిపోయినట్లేనని వొర్కుటౌగోల్ మైన్స్ అధికార ప్రతినిధి తత్యాన బుషుకోవా తెలిపారు. రెండో పేలుడు జరిగిన అనంతరం సహాయక చర్యలను నిలిపివేశామని, గల్లంతైన వారితో కలుపుకుని మొత్తంగా 36 మంది మృతి చెందారని పేర్కొన్నారు.


