breaking news
Mamata Banerjee Office
-
‘నబన్నా’ ముట్టడి, కోల్‌కతాలో ఉద్రిక్తత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సచివాలయం ‘నబన్నా’ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. సచివాలయ ముట్టడికి వచ్చిన వందలాది మంది బీజేపీ నిరసకారులకు, పోలీసులకు మధ్య గురువారం ఘర్షణ జరిగింది. కరోనా మార్గదర్శకాల నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని పోలీసులు సూచించగా, నిరసనకారులు మాట వినలేదు. దీంతో పోలీసు వారిపై టియర్‌గ్యాస్, వాటర్ ప్రయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. "పోలీసులు మా వాళ్లపై లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఖిదిర్పూర్ వైపు నుంచి రాళ్ళు రువ్వడాన్ని వారు చూడలేదా’ అని బీజేపీ నాయకుడు లాకెట్ ఛటర్జీ ప్రశ్నించారు. పెద్ద పెద్ద సమూహాలుగా ఏర్పడి సమావేశాలను నిర్వహించడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి నిరసనగా బీజేపీ ‘ఛలో నబన్నా’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర బీజేపీ యువజన విభాగం చీఫ్ తేజస్వి సూర్య ఈ నిరసనలో పాల్గొన్నారు. ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయం శుభ్రం చేయాలి అనే వంకతో రెండు రోజుల పాటు మూసివేస్తున్నారు ఇది ఆమె భయాన్ని ప్రతిబింబిస్తుంది’ అని బీజేపీ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఇదిలా వుండగా కరోనా సమయంలో ఇలా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడం ప్రమాదమం కదా అని బీజేపీ నేతలను ప్రశ్నించగా ర్యాలీలో పాల్గొన్న వారందరూ మాస్క్‌లు ధరించారని బీజేపీ బెంగాల్ ఇన్ఛార్జ్ కైలాష్ విజయవర్గియా పేర్కొన్నారు. చదవండి: సీఎం మమతాపై గవర్నర్ అసంతృప్తి -
సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయానికి గురువారం బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. కోల్ కతా హౌరాలోని 'నబాన్న' ప్రభుత్వ సచివాలయ కార్యాలయంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని దుండగులు కాల్ చేసి బెదిరించారు. ఈ సమయంలో సీఎం మమత సచివాలయం 14వ అంతస్తులోని తన కార్యాలయంలో ఉన్నారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సచివాలయ భవనంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బాంబు దొరకకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్ ఉత్తిదేనని తేల్చారు.