breaking news
Male Version
-
పుష్ప ఐటెం సాంగ్ మేల్ వెర్షన్ .. 'ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప..'
Samantha Special Song In Pushpa Movie Male Version Goes Viral: ఈ మధ్య ఏదైనా పాట కానీ, డైలాగ్‌లు కానీ హిట్ అయ్యాయంటే చాలు వాటిని స్ఫూఫ్‌లు, కవర్స్‌గా మలుస్తున్నారు నెటిజన్లు. ఇటీవల వచ్చిన బుల్లెట్టు బండి పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ సాంగ్‌కు మేల్ వెర్షన్లో పాటను రాశాడు ఓ నెటిజన్. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు', సూర్యవంశీ మూవీలోని 'నాజా' సాంగ్స్‌ను అనేక మంది కవర్స్‌గా చేసి సోషల్ మీడియాలో వదిలారు. అవి నెట్టింట్లో తెగ ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని సమంత స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా' విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పాటలో లిరిక్స్‌కు తగినట్లుగా ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహన్ తన హస్కీ వాయిస్‌తో మెస్మరైజ్ చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్‌కుపైగా దూసుకెళ్లింది. సమంత నటించిన ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్‌లో మగాళ్లది వంకర బుద్ధి, అందరూ మగాళ్లు ఒకటే అన్నట్లుగా ఉంటాయి లిరిక్స్. అయితే తాజాగా ఈ పాటకు మేల్ వెర్షన్ సాంగ్ వచ్చింది. 'మీ కళ్లల్లోనే వంకర ఉంది.. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి.. ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప' అంటూ సాగుతోన్న ఈ సాంగ్ వైరల్ అవుతోంది. ఈ మేల్ వెర్షన్ పాటకు సంబంధించిన వీడియోను ఒక ట్విటర్ యూజర్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ పాటకు తగినట్టుగా పలు సినిమాల్లోని వీడియో, డ్యాన్స్ స్టెప్పుల క్లిప్‌లతో వీడియో తయారు చేయడం ఆకట్టుకుంటోంది. మేల్ వెర్షన్ అదిరిపోయిందని కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్స్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రేపు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పుష్ప రాజ్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో అలరించబోతున్నారు. Fun male version of #OoAntavaOoOoAntava 😀 #Pushpa pic.twitter.com/hIeOFjfS2s — Vaali (@vaaalisugreeva) December 15, 2021 -
అలాంటి మగవాళ్ల కోసమే మై చాయిస్
‘‘మహిళలను హీనంగా చూసే పురుషులు ఇంకా ఉన్నారు. సంకుచిత స్వభావంతో ఉన్నవారు కోకొల్లలు. అలాంటి మగవాళ్ల కోసమే ‘మై చాయిస్’. స్త్రీ, పురుష సమానత్వం అనే అంశం మీద ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది’’ అంటున్నారు దీపికా పదుకొనే. ‘‘ప్రేమలో పడితే అది నా చాయిస్, బ్రేకప్ అయితే అది నా చాయిస్, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో అది నా చాయిస్. నా జీవితం నా చాయిస్’’ అంటూ దీపికా నటించిన డాక్యుమెంటరీ ‘మై చాయిస్’ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ ప్రశంసలతో పాటు విమర్శలను కూడా దక్కించుకుంది. కొంతమంది యువకులైతే ఏకంగా ‘మై చాయిస్’ వీడియోకి కౌంటర్‌గా ‘మై చాయిస్ - మేల్ వెర్షన్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. ఇన్నాళ్లూ తన డాక్యుమెంటరీ గురించి మౌనం వహించిన దీపికా ఇప్పుడు నోరు విప్పారు. ‘‘మా ఈ చిన్న ప్రయత్నాన్ని అభినందించినవారికి థ్యాంక్స్. విమర్శించినవాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తున్నా. కానీ ఈ చిత్రం ద్వారా ఇచ్చిన సందేశం అస్పష్టంగా వెళ్లిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే చాలా మందికి నా ఉద్దేశం సరిగ్గా అర్థం కాలేదు. ఇలాగే చేయమని ఎవరికీ చెప్పడం లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలో ప్రతి మహిళా తెలుసుకోవాలనీ, ఎవరి ఇష్టం మేరకు వాళ్లు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాలన్నదే నా ఉద్దేశం’’ అన్నారు.