breaking news
maharashtra schools
-
హిందీని రుద్దితే ఊరుకోం
ముంబై: మహారాష్ట్రలోని స్కూళ్లలో హిందీ భాష బోధనకు వ్యతిరేకంగా పోరాడుతామని శివసేన ‘యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సోదరుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. గురువారం వీరిద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ భాష ఆధారంగా ప్రజలను విభజించాలని చూస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. బలవంతంగా హిందీని రుద్దా లని చూస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. మరాఠా మాట్లాడే మహారాష్ట్రలో భాషాపరమైన అత్యవసర పరిస్థితిని తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. హిందీకి తాము వ్యతిరేకం కాదు, హిందీని ద్వేషించడం లేదంటూ.. తప్పనిసరి చేస్తే మా త్రం అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. మరాఠా, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు హిందీని బోధించడంపై ఆయన పైవిధంగా స్పందించారు. స్కూళ్లలో హిందీ బోధనను తప్పనిసరి చేయబోమని సీఎం ఫడ్నవీస్ ప్రకటిస్తేనే ఈ వివాదం సమసిపోతుందని ఠాక్రే తెలిపారు. స్కూళ్లలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ముంబైలో జూలై 7వ తేదీన జరిగే నిరసన ప్రదర్శనలో తమ పార్టీ పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) గురువారం స్పష్టం చేసింది. జూలై 5వ తేదీన ముంబైలోని గిర్గామ్ చౌపట్టి నుంచి ర్యాలీ చేపడతామని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే చెప్పారు. తమకు ఏ రాజకీయ పారీ్టతోనూ సంబంధం లేదన్నారు. హిందీని తప్పనిసరిగా బోధించాలనుకుంటే 5వ తరగతి తర్వాతే అమలు చేయాలని ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్ పవార్ సూచించారు. ఒకటో తరగతి నుంచే హిందీని నిర్బంధంగా బోధించాలన్న విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఉద్ధవ్, రాజ్ ఠాక్రే సోదరుల వైఖరిని ఆయన సమరి్థంచారు. మరాఠా భాషకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. దీనిపై వారితో కలిసి ముందుకు సాగుతామన్నారు. మరాఠా భాష కోసం జరిగే నిరసనల్లో తామూ పాల్గొంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్థన్ సప్కాల్ తెలిపారు. 1, 2 తరగతులకు పుస్తకాలుండవు ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఎలాంటి పుస్తకాలు ఉండవని పాఠశాల విద్యా శాఖ మంత్రి దాదా భుసే చెప్పారు. ఈ రెండు తరగతుల చిన్నారులకు మౌఖికంగాను పాటలు, చిత్రాల ద్వారా బోధన ఉంటుందన్నారు. ఈ తరగతుల విషయంలో హిందీ ప్రసక్తే లేదని వివరించారు. -
స్కూలుకు పుస్తకాలు అక్కర్లేదు!
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా మహారాష్ట్రలో విద్యార్థులకు ఓ మంచి వరం ప్రకటించారు. విద్యార్థులెవరూ గురువారం ఒక్క రో్జు ఇళ్ల నుంచి పుస్తకాల సంచులు తేనక్కర్లేదని, స్కూళ్లలో కూడా క్లాసుకు సంబంధంలేని మామూలు పుస్తకాలు చదవాలని చెప్పారు. కలాం జయంతి సందర్భంగా మహారాష్ట్రలో ప్రతియేటా అక్టోబర్ 15వ తేదీని 'రీడర్స్ డే'గా జరుపుకొంటున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లలో 'గిఫ్ట్ ఎ బుక్' కార్యక్రమాన్ని అమలుచేయాలని, పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. వచన్ ప్రేరణా దిన్ సందర్భంగా మంత్రి తావ్డే ఓ జిల్లా పరిషత్ హైస్కూలును సందర్శించి, అక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రీడింగ్ హబ్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాల బాక్సును బహూకరించారు.