ఫుట్బాల్ లీగ్ ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా వ్యాప్తంగా ఫుట్బాల్ లీగ్ ప్రారంభమైంది. ఫుట్బాల్ సంఘం జిల్లా నూతన కార్యదర్శి నాగరాజు జిల్లాలోని ఆత్మకూరులో జరిగిన లీగ్ పోటీలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికే పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్డీటీ సహకారంతోనే నిర్వహించే ఈ పోటీలు ఫిబ్రవరి వరకు కొనసాగుతాయని చెప్పారు. పోటీలను స్పెయిన్ శిక్షకుడు మికేల్, విజయభాస్కర్ పర్యవేక్షిస్తారన్నారు.