breaking news
The law
-
ధర్మ పోరాటం చేస్తున్న గిరిజనులు
భూములు ఇవ్వకపోగా ఉన్న భూములను లాక్కోవడం అన్యాయం అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వాగొడ్డుగూడెం(అశ్వారావుపేట రూరల్): పోడుసాగు విషయంలో గిరిజనులు, పేదలు చేస్తున్నది.. ధర్మ పోరాటమని, రాష్ట్రప్రభుత్వం చేస్తున్నది.. ఆ ధర్మమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మండలంలోని వాగొడ్డుగూడెం పోడుభూముల్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు పంపిణీ చేయకపోగా, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. గిరిజనులకు 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలని నిబంధనలున్నాయని, వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. 2005 కంటే ముందుగానే సాగులో ఉన్న భూములను లాక్లోవడం మానుకోవాలన్నారు. దీనిపై గిరిజనులు చేస్తున్న ధర పోరాటానికి సీపీఎం అండగా ఉంటుందన్నారు. పట్టాలు ఉన్న ఐదు లక్షల ఎకరాలను అన్యాయంగా గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అనంతరం పోడు కేసుల్లో జైళ్లకు వెళ్లి వచ్చిన 120 మంది గిరిజనులను పరామర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, నాయకులు ఏజే రమేష్, ఐలయ్య, డివిజన్ నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, ధర్ముల సీతారాములు, చిరంజీవి, ప్రసాదు, కుంజా మురళీలున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తా : సున్నం రాజయ్య, ఎమ్మెల్యే, భద్రాచలం పోడు భూముల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. పోలీస్, అటవీ అధికారులు వ్యవహారిస్తున్న తీరు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తానన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పోడు జోలికి వెళ్లమని చెప్పిన ప్రభుత్వ తీరును ఎండగడతానన్నారు. ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో ముగ్గురు మంత్రులు కూడా పోడు జోలికి వెళ్లవద్దని అధికారులకు చెప్పి.. దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. -
దొంగచాటు పెళ్లిళ్లకు... చట్టం చుట్టమై రాదు
కేస్ స్టడీ రమేష్, అజయ్, శ్రీనివాస్‌లు మంచి స్నేహితులు. వారంతా ‘కాంపస్’ హాస్టల్లో ఉంటూ ఉన్నత చదువులు చదువుతున్నారు. ఒక రోజు ఉన్నట్లుండి వీరి కామన్ ఫ్రెండ్ సుధీర్‌ను పోలీసులు ఎక్కడికో పిలిపించి బాగా కొట్టి కేస్ పెట్టారని, పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలిసింది. వెంటనే క్యాంపస్ మిత్రులంతా వెళ్లి స్టేషన్ బెయిల్ ఇప్పించి సుధీర్‌ను బయటకు తెచ్చుకున్నారు. అదే రోజు న్యాయవాదిని సంప్రదించారు. సుధీర్‌ను అన్ని విషయాలు వివరంగా అడిగిన న్యాయవాది అతనిపై నిర్భయ చట్టం క్రింద కేస్ బుక్ అయిందని చెప్పారు. సుధీర్ నివ్వెరపోయాడు. ఆ కేస్ పెట్టిన అమ్మాయితో తనకు నాలుగేళ్లుగా సంబంధం ఉందని, రహస్యంగా తాళి కట్టానని, పెద్దలను ఎదిరించలేక తనపై కేస్ పెట్టిందని వాపోయాడు. తల్లిదండ్రులు కడుపు కట్టుకొని హాస్టళ్లలో ఉంచి చదివిస్తుంటే మీరేమో ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కొని బంగారంలాంటి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని న్యాయవాది ఆవేదన వ్యక్తం చేస్తూ, రహస్యంగా తాళికట్టి సంసారం చేస్తే అది వివాహం కాదని చెప్పారు. ఇద్దరూ హాస్టల్స్‌లో ఉంటూ, అదీ ఆ అమ్మాయి వేరే జిల్లాలో హాస్టల్లో ఉంటూ, ఫ్రెండ్స్ రూమ్స్‌లో దొంగచాటుగా కలిస్తే అది వివాహమెలా అవుతుందని, అది చెల్లదని స్పష్టం చేశారు. ఒకవేళ తాళి కడితే, దానికి ఎవరైనా సాక్ష్యం ఉండాలని, కనీసం ఫొటోలైనా ఉండాలని, లేకుంటే ఎక్కడైనా కలిసి కాపురం చేసినట్లు దాఖలాలైనా ఉండాలని అన్నారు. వారి మధ్య ప్రేమ కంటే ఆకర్షణ ఎక్కువగా ఉందని, ఆ అమ్మాయిని బలవంతంగా తన భార్య అని రప్పించుకొనే అవకాశం లేదని, అలా చేస్తే అది ఇంకో కేస్ కిందకు వస్తుందని తెలియచేశారు. ఆవేశంతో ఊగిపోతూ అమ్మాయిలంతా మోసగత్తెలంటూ వచ్చిన మిత్రబృందం సుధీర్ చేసిన పిచ్చి పనికి బాధపడి బెయిలబుల్ సబ్‌సెక్షన్ కింద కేస్ బుక్ చేసిందుకు కాస్త ఊరట చెందుతూ లాయర్‌గారి సలహా ప్రకారం కాంప్రమైజ్‌కు వచ్చేలా, కేస్ ఎత్తివేసేలా ఆ అమ్మాయిని ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కనుక ఎవ్వరికీ తెలియకుండా, జీవితంలో స్థిరపడకుండా, వేరే వేరే ఊళ్లలో ఉంటూ, ఎక్కడో కలుసుకుంటూ, కుదరకపోతే బెదిరిస్తూ ఉంటే సుధీర్‌లాగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. విలువైన భవిష్యత్తుకు భంగం వాటిల్లుతుంది. కుటుంబ సభ్యులకు మనోవేదన మిగులుతుంది. -
హిందు దత్తత నిర్వహణ చట్టంలో మార్పులు