breaking news
land corrption
-
Yediyurappa: యడ్యూరప్పకు భారీ షాక్
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు గట్టి షాక్ తగిలింది. ఆయనపై నమోదు అయిన భూ ఆరోపణలకు సంబంధించి.. ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యడ్యూరప్పకు సమన్లు కూడా జారీ చేసింది. భూ సంబంధిత ‘డీనోటిఫికేషన్ వ్యవహారం’లో అవినీతికి పాల్పడ్డారంటూ యడ్యూరప్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు చేయాలని ఆదేశించింది బెంగళూరులోని ప్రత్యేక కోర్టు. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి క్రిమినల్ కేసులపై విచారణ కోసమే ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు యడ్యూరప్పపై ఈ ఫిర్యాదు 2013లోనే నమోదు అయ్యింది. యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలో ఈ అవినీతి జరిగిందని, వాసుదేవ రెడ్డి అనే బెంగళూరువాసి ఈ ఫిర్యాదు నమోదు చేశారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్-ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఉన్న ఐటీకారిడార్‌లో స్థలానికి సంబంధించి ఈ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. డీనొటిఫికేషన్ తర్వాత ఆ స్థలాలను పలువురు ఎంట్రప్రెన్యూర్లకు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో.. అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం 1988 కింద.. యడ్యూరప్పపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్పెషల్ జడ్జి బీ జయంత కుమార్ ఆదేశించారు. అంతేకాదు తన ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో యడ్యూరప్పను ఆదేశించారు కూడా. చదవండి: హత్యా రాజకీయాలు బీజేపీ సంస్కృతి కాదు-షా -
నిమ్మల భూ కిరికిరికి రెవెన్యూ చెక్
గోరంట్ల : హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అక్ర మ మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించిన భూమిని రెవెన్యూ అధికారులు తిరిగి బాధిత రైతు మల్లేశప్ప పేరిట అడంగల్‌లో నమోదు చేయించారు. ‘ నిమ్మల భూ కిరికిరి’ శీర్షికన 15 వతేదీ సాక్షిలో వార్తాకథనం ప్రచురితమైన విషయం విదితమే. అలాగే బాధిత రైతు మల్లేశప్ప జిల్లా కలెక్టర్, ఎస్పీని మీ కోసం కార్యక్రమంలో కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 18న స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 2011లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు బాధిత రైతు మల్లేశప్ప తహశీల్దార్ ఎదుట హాజరై తమ వాంగ్మూలంతో పాటు భూములకు సంబంధించిన పక్కా రికార్డులను సమర్పించారు. ఈ మేరకు ఆమె పంపిన నివేదిక ఆధారంగా మల్లేశప్ప పేరిట అడంగల్ ను య«థాస్థానంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారని స్థానిక తహశీల్దార్ హసీనాసుల్తానా సాక్షికి ఫోన్ ద్వారా తెలిపారు.