breaking news
lady harrased
-
అత్యాచారయత్నానికి గురైన ఫాతిమా మృతి
-
అత్యాచారయత్నానికి గురైన ఫాతిమా మృతి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో సామూహిక అత్యాచార యత్నానికి గురైన బాధితురాలు ఫాతిమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మృత్యువుతో పోరాడుతూ ఈరోజ ఉదయం కన్నుముసింది. సీతాఫల్మండి చిలకలగూడకు చెందిన ఫాతిమాను గత నెల 29న నలుగురు యువకులు కిరోసిన్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. -
యువతిపై కిరోసిన్ పోసి.. నిప్పంటించిన దుండగులు
సికింద్రాబాద్లోని చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ సమీపంలో దారుణం జరిగింది. ఓ యువతిపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న ఆమె మంటలతోనే వీధిలోకి కేకలు పెడుతూ వచ్చిందని, దాంతో చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసి, తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యువతిపై అత్యాచార ప్రయత్నం చేసి ఉంటారని, ఆమె ప్రతిఘటించడం వల్లనే ఈ ఘోరానికి పాల్పడొచ్చని పోలీసులు అంటున్నారు. ఆమెకు కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో, కోలుకునే అవకాశాలు అంతగా లేవని వైద్యవర్గాల ద్వారా తెలుస్తోంది. కానీ ఎంత శాతం కాలిన గాయాలయ్యయనే విషయాన్ని మాత్రం వారు నిర్ధారించడం లేదు.