breaking news
lady farmer
-
ఇదీ రైతు పోరాటమే
‘ఎకార్డింగ్ టు ది గివెన్ సర్వే నెంబర్.. దీజ్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్స్ టు పటేదార్ యూ నో..’ అన్నాడు రెవిన్యూ ఆఫీసర్! అతడేమన్నాడో బసంతీబాయ్‌కి అర్థం కాలేదు. ‘ఈ పొలం నాది. పొలానికి వచ్చిపోయే దారులన్నీ పరమానంద్ పటేదార్, ఆయన కొడుకులు మూసేశారు. దారులు తెరిపించండి’ అని వేడుకుంది. ‘పొలం నీదైతే కావచ్చు. పొలానికి వెళ్లే ఏదారీ నీ దారి కాదు’ అన్నాడు ఆఫీసర్! పొలానికి దారి లేకుంటే బతికే దారీ లేనట్లే బసంతీబాయ్ కుటుంబానికి. పై అధికారులకు ఉత్తరం రాసింది. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కి లెటర్ పెట్టింది. ఆయన దగ్గర్నుంచీ ఎవరూ రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించుకుంది. ఆ లేఖ చేరిందీ లేనిదీ తెలియదు. చివరికి రాష్ట్రపతి రామ్నా£Š కోవింద్‌కి లెటర్ రాసింది. ముందరి ఉత్తరాల్లో తన పొలానికి వెళ్లే దారులను తెరిపించండి అని రాసిన బసంతీబాయ్ రాష్ట్రపతికి రాసిన ఉత్తరంలో అలా రాయలేదు. ఎలా రాస్తే ఆయన తనను పట్టించుకుంటాడని అనుకుందో అలా రాసింది. ‘‘అయ్యా.. మా ఇంటికి కొద్ది రూరంలో ఉన్న నా పొలానికి రోజూ వెళ్లి రావడానికి నాకొక హెలికాప్టర్ అవసరం అయింది. హెలికాప్టర్‌ను కొనడానికి లోన్ మంజూరు చేయించండి. అలాగే హెలికాప్టర్ నడిపే లైసెన్స్ ఇప్పించండి’’ అని విన్నవించుకుంది. రాష్ట్రపతి నుంచి ఇంకా ఏమీ సమాధానం రాలేదు. వచ్చేవరకు ఆమె కుటుంబానికి పస్తులే. ఆ పొలమే ఆమె జీవనాధారం. ∙∙ షగర్ తాలూకాలోని అగర్ గ్రామ రైతు బసంతీబాయ్. మధ్యప్రదేశ్‌లోని మండ్సార్ జిల్లాలో ఉంది ఆ గ్రామం. అక్కడే ఓ రెండెకరాల పొలం ఉంది బసంతీబాయ్‌కి. అందులో పండించుకునే ధాన్యం, కూరగాయలే ఆ కుటుంబాన్ని నడుపుతున్నాయి. ఉదయం వెళ్లడం, పొలం పనులు చేసుకుని చీకటి పడే వేళకు ఇంటికి చేరడం. ఇంట్లోని పశువులు కూడా ఆమె చేతి పలుగు–పారల్లా ఆమె వెంటే పొలానికి వెళ్లివచ్చేవి. అకస్మాత్తుగా ఇప్పుడు పొలానికి దారి లేకుండా పోయింది! పొలం కన్నా దారే ఇప్పుడు ఆమె ప్రాణాధారం అన్నంతగా అయింది. ఆవుదూడ దగ్గరికి వెళ్లనివ్వకపోతే ఆవు ఎంత గింజుకుంటుందో.. ఆవులాంటి పొలం దగ్గరకి తనను వెళ్లనివ్వకుండా చేసినందుకు బసంతీ అంత విలవిల్లాడింది. పటేదార్, ఆయన కొడుకులు పొలానికి వెళ్లే దారులన్నీ మూసేశారు. అడిగితే, ఆ దారులు తమ పొలం లోనివి అన్నారు. ఆమెను అటుగా రానివ్వలేదు. తన పొలంలోకి తనను పోనివ్వడంలేదు. వాళ్లకేదో ఆలోచన ఉన్నట్లు ఆమెకు అర్థమైంది. దారుల పేరు చెప్పి పొలాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసులకు కాళ్లరిగేలా తిరిగితే మనం గల్లీ నుంచి ఢిల్లీకి అంటుంటాం. అక్కడివాళ్లు ‘చౌపాల్ నుంచి భోపాల్’ అంటారు. అలా అన్ని ఆఫీసులకు, అందరు ఆఫీసర్ల దగ్గరకు తిరిగి, ఎవరికీ పట్టకపోవడంతోనే సీఎంకి, ప్రధానికి, రాష్ట్రపతికి ఉత్తరాలు రాసింది బసంతీబాయ్. రాష్ట్రపతికి ఆమె రాసిన ఉత్తరం వైరల్ అవుతోంది తప్పితే.. సహాయానికెవరూ రాలేదు. ఆమె సమస్యేమిటో వెళ్లి చూడమని జిల్లా కలెక్టర్ మనోన్ పుష్ప మహరాజ్ ఒక బృందాన్నయితే పంపారు కానీ, ఆ మహరాజ్ గారి టీమ్‌కు బసంతీరాయ్ బాధేమిటో అర్థం కాలేదు. ‘అంతా సవ్యంగానే ఉంది. దారులన్నీ తెరిచే ఉన్నాయి’ అని కలెక్టర్‌కి నివేదించారు! ఉన్నదారిని మూసేయడం ఏంటని వాళ్లు అడిగి ఉంటే బాధితురాలికి న్యాయం జరిగి ఉండేదేమో. పటేదార్ ఆ టీమ్ వచ్చినప్పుడు తెరిచి ఉంచిన దారిలో పొలానికి వెళ్లొళ్చి, ‘దారి తెరిచే ఉంది’ అని రిపోర్ట్ రాశారు. ఇక సమస్యేం కనిపిస్తుంది! ఈ లోకంలో ఒక చిన్న ప్రాణి బతకడానికి ఎన్ని పెద్ద జీవాలను ఎదుర్కోవాలో బసంతీబాయ్‌కి తెలియంది కాదు కానీ, రాష్ట్రపతి ఏమైనా చేస్తాడా అని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది. రాష్ట్రపతికి రాసిన ఉత్తరాన్ని చూపుతున్న బసంతీబాయ్ -
ప్రాణం తీసిన గెట్ల పంచాయతీ
సాక్షి, నల్గొండ: జిల్లాలోని మాడుగులపల్లి మండలం నారాయణపురం గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. గెట్ల పంచాయతీ ఓ మహిళా రైతు ప్రాణం తీసింది. వివరాలు.. నారాయణపురం గ్రామానికి చెందిన మహిళా రైతు మంజుల(55)కు కొన్ని రోజులుగా బంధువులతో పొలం గెట్ల గురించి వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో మంజుల బంధువులైన అమృతా రెడ్డి, అతని కుమారుడు గురువారం పొలంలో పని చేసుకుంటున్న ఆమెపై గొడ్డలితో దాడి చేసి నరికి చంపారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మంజుల భర్త వాసుదేవ రెడ్డిని కూడా తీవ్రంగా గాయ పర్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంజుల మృత దేహంతో పాటు వాసుదేవ రెడ్డిని కూడా ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూ తగాదాలే హత్యకు కారణంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అమృతా రెడ్డి, అతని కుమారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ముష్టి పారేస్తామంటున్నారు.. అక్కర్లేదు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రైతులు కలవడం అనేది ముందుగా ఎరేంజ్ చేసిన ప్రోగ్రాం అని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మహిళా రైతు శ్యామసుందరి మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని ఆమె స్పష్టం చేశారు. రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కుని వెయ్యి గజాలు ముష్టి ఇచ్చినట్లు ఇస్తామంటున్నారని, అది తమకు అవసరం లేదని అన్నారు. గ్రామాల నుంచి తమకు కావల్సిన వారినే ఎంపిక చేశారని, అందరికీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని శ్యామసుందరి ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే ఒప్పుకొనేది లేదన్నారు. ప్రభుత్వ భూములు ఉన్నచోటే రాజధాని నగరాన్ని నిర్మించుకోవాలని ఆమె చెప్పారు. -
కరెంటు లేక.. పంట ఎండి.. మహిళారైతు ఆత్మహత్య
-
కరెంటు లేక.. పంట ఎండి.. మహిళారైతు ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వచ్చీరాని కరెంటుతో తమకున్న ఎకరన్నర పొలం కాస్తా ఎండిపోవడంతో అప్పుల బాధ భరించలేక పార్వతి అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రంధన్ తండాకు చెందిన పార్వతి దంపతులకు ఒకటిన్నర ఎకరాల పొలం ఉంది. అయితే రోజుకు రెండు మూడు గంటలు కూడా కరెంటు సక్రమంగా రాకపోవడంతో ఆ పొలం కాస్తా ఎండిపోయింది. వీళ్లు పిల్లలకు స్కూలు ఫీజులు కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నారు. దాంతో పిల్లలను శుక్రవారం మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి పంపేశారు. దాంతో భార్యాభర్తల మధ్య ఇదే విషయమై చర్చ కూడా జరిగింది. ఆ తర్వాతే.. పార్వతి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. ఆమెను వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే, ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా వాళ్ల దగ్గర డబ్బులు లేకపోవడంతో గ్రామస్థులు తలా కొంత డబ్బు వేసుకుని శవయాత్రకు ఏర్పాట్లు చేశారు.