breaking news
Labbipet
-
ముస్లిం పర్సనల్ లాపై దుష్ప్రచారం
విజయవాడ(లబ్బీపేట) : ముస్లిం పర్సనల్ లాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు ముస్లిం మహిళలు పేర్కొన్నారు. పర్సనల్ లాపై దేశ వ్యాప్తంగా చర్చ నేపథ్యంలో ముస్లిం మహిళల జాయింట్ యాక్షన్ కమిటీ శనివారం లబ్బీపేటలో సమావేశమైంది. మహిళలు మాట్లాడుతూ ఇద్దరు.. ముగ్గురికి తలాక్ విషయంలో అన్యాయం జరిగిందనే సాకుతో దేశంలోని 25 కోట్ల ముస్లింలపై కామన్ సివిల్కోడ్ను రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం మహిళలకు న్యాయం చేయాలని భావిస్తే సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ రీజినల్ ఆర్గనైజర్ ఫాలిమా కౌసర్, జిల్లా అధ్యక్షురాలు ఖాదితా సల్మా, ఇఖరా ఇంటర్నేషనల్ స్కూల్ సెక్రటరీ ఆయుషాతయ్యాత, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఆయుషా మొయినుద్దీన్, జేఐహెచ్ దావా సెల్ ప్రతినిధి షరీఫా పాల్గొన్నారు. -
షిర్డీసాయి ఆలయాన్ని సందర్శించిన వైఎస్ జగన్
-
బెజవాడలో బోర్డు తిప్పేసిన 'శుభదర్శి'
విజయవాడ లబ్బిపేటలోని శుభదర్శి చిట్ఫండ్ కంపెనీ మంగళవారం బోర్డు తిప్పేసింది. సుమారు రూ. కోటి మేర టోకరా వేసి నిర్వహాకులు పరారైయ్యారు. దాంతో విషయం తెలుసుకున్న బాధితులు శుభదర్శి చిట్ఫండ్ కంపెనీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం వారు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.