breaking news
Kuwait Airport
-
కల్లలైన కుటుంబం కల
ఉజ్జయిని: పశ్చిమాసియా యుద్ధం మధ్యప్రదేశ్‌లోని ఒక భారతీ యుని ఇంట్లో విషాదం నింపింది. గత 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ టైలర్‌గా పనిచేస్తున్న 55 ఏళ్ల మన్జూర్ అహ్మద్ ఈనెల 8వ తేదీన మేనల్లుడి పెళ్లి చూడ్డానికి భారత్‌కు బయల్దేరుతుండగా కువైట్ విమానాశ్రయంలపై జరిగిన దాడిలో ప్రా ణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కువైట్ నుంచి ముంబై బయల్దేరాల్సిన విమానం ఎక్కాల్సిన మన్జూర్ అదే ఎయిర్‌పోర్ట్‌లో చనిపోయారన్న వార్త విని ఉజ్జయిని జిల్లాలోని అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ‘‘మేనల్లుడి పెళ్లి అనగానే మా నాన్న ఎంతో సంబరపడ్డారు. వెంటనే బయల్దేరాలని ఆశ పడ్డారు. బహుమతులతో బ్యాగు సర్దుకుని ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. ముంబైదాకా విమానంలో వచ్చి అక్కడి నుంచి రైళ్లో మధ్యప్రదేశ్‌కు వస్తానని నాతో అన్నారు. నాన్నతో అర్ధరాత్రి 2.30 గంటలకు కూడా మాట్లాడా. ఇంతలోనే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది’’అని మన్జూర్ కుమారుడు, 18 ఏళ్ల అనాస్ అహ్మద్ విలపించారు. ‘‘కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి అంటే ఎవరో చనిపోయారని భావించాం. హఠాత్తుగా బుధవారం మధ్యాహ్నం భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. మన్జూర్ చనిపోయారని చెప్పగానే మా కాళ్ల కింద నేల కదిలినట్లయింది. ఆయనకు ఉజ్జయినిలో రైల్వేస్టేషన్లో ఘనంగా స్వాగతం పలకాలని పూలమాలలు కూడా కొనేశాం. ఇప్పుడు వాటినే ఆయన మృతదేహంపై కప్పేందుకు, మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గుజరాత్ వెళ్తున్నాం’’అని అతని బావ మొహమ్మద్ ఇస్మాయిల్ ఏడుస్తూ చెప్పారు. సన్నిహిత బంధువుల వివాహం తర్వాత దగ్గరి బంధువుల ఇళ్లకు వెళ్లి కలిసిరావాలని మన్జూర్ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మన్జూర్కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబ పోషణభారం మొత్తం ఒక్కడే మోస్తున్నాడు’’అని ఆప్తులు తెలిపారు. నేడు భారత్‌కు మన్జూర్ పార్థివదేహం విమానంలో కువైట్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మన్జూర్ పారి్థవదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకల్లా భారతప్రభుత్వం తరలించనుంది. అక్కడి నుంచి ఉజ్జయిని నగరానికి రోడ్డు మార్గంలో తీసుకురానున్నారు. బాధితుని స్వస్థలం ఉజ్జయిని జిల్లాలోని చంబా నదీతీరంలోని నాగ్డా పట్టణం. ‘‘ఎయిర్పోర్ట్ టరి్మనల్1పై ఇరాన్ డ్రోన్లు దాడిచేయడంతో మన్జూర్ చనిపోయారు. మరో 13 మంది భారతీయులు గాయపడ్డారు. మన్జూర్ పారి్థవదేహం తరలింపు విషయంలో ఆయన కుటుంబంతో నిరంతరం మంతనాలు జరుపుతున్నాం. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’’అని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి ఆసీం ఆర్ మహాజన్ తెలిపారు. -
కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్‌కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్‌లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా దాడులు చేసింది. -
కువైట్ ఎయిర్ పోర్ట్ లో 13 గంటల పాటు భారతీయుల అవస్థలు
-
కువైట్‌లో ఘోర అవమానం: ప్రముఖ సింగర్
కువైట్: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పర దేశంలో తన సిబ్బందికి అవమానం జరిగినందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ట్విటర్ ద్వారా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఒక కార్యక్రమం కోసం కువైట్‌కు వెళ్లిన అద్నాన్ సమీ బృందంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది దుర్భాషలాడారు. దీనిపై కువైట్‌లోని ఇండియన్ ఎంబబీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా ఏ చర్యలు చేపట్టలేదని అద్నాన్ సమీ వాపోయారు. ఇలా అనడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు. అద్నాన్ ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ స్పందిస్తూ.. ఈ విషయంపై మీరు నాతో ఫోన్లో మాట్లాడండి అంటూ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించినందుకు సుష్మాకు అద్నాన్ ధన్యవాదాలు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా... సింగర్ అద్నాన్ బదులిస్తూ.. ‘మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. సుష్మా స్వరాజ్ లాంటి వారు విదేశాంగ మంత్రిగా ఉంటే.. మాలాంటి వాళ్లు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆమె రక్షిస్తూనే ఉంటారు. ఆమెను చూస్తే నాకు గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంపై సుష్మా స్వరాజ్ వెంటనే చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. Thank you so much for your concern my dear. @SushmaSwaraj is a lady full of heart & she is in touch with me & is looking after our people.. I’m so proud that she is our foreign minister & looks after us all over the world. https://t.co/2KjCIyRG6f — Adnan Sami (@AdnanSamiLive) May 6, 2018 -
కువైట్‌లో అత్యవసరంగా దిగిన విమానం
దుబాయి : కువైట్ నుంచి ముంబై బయలుదేరిన కువైట్ ఎయిర్వేస్కి చెందిన విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో సదరు విమానాన్ని అత్యవసరంగా కువైట్ ఎయిర్ పోర్ట్‌లో దింపివేసినట్లు ఆ విమాన సంస్థ ఆదివారం వెల్లడించింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానానికి చేర్చినట్లు తెలిపింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి విమానం కాక్ పిట్‌ను ఢీ కొట్టిందని పేర్కొంది. ఈ మేరకు కువైట్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది.


