breaking news
kurlon
-
షీలా ఫోమ్ చేతికి కర్లాన్
న్యూఢిల్లీ: స్లీప్‌వెల్ పేరిట మ్యాట్రెస్‌లను తయారు చేసే షీలా ఫోమ్ తాజాగా కర్లాన్ ఎంటర్‌ప్రైజెస్‌లో 94.66% వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.2,035 కోట్లు వెచి్చంచనుంది. అలాగే, ఆన్లైన్ ఫరి్నచర్ బ్రాండ్ ఫర్లెంకో మాతృ సంస్థ హౌస్ ఆఫ్ కిరాయా ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 300 కోట్లతో 35% వాటాలు కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన రెండు ప్రతిపాదనలకు జూలై 17న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు షీలా ఫోమ్ తెలిపింది. ‘రూ. 2,150 కోట్ల ఈక్విటీ వేల్యుయేషన్‌తో కేఈఎల్ (కర్లాన్ ఎంటర్ప్రైజెస్)లో 94.66% వాటాను కొనుగోలు చేయబోతున్నాం‘ అని వెల్లడించింది. మ్యాట్రెస్లు, ఫోమ్ ఆధారిత ఉత్పత్తుల విభాగంలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని షీలా ఫోమ్ తెలిపింది. కేఈఎల్లో 94.66% వాటా కొనుగోలు వ్యయం రూ.2,035 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. దేశీయంగా ఆధునిక మ్యాట్రెస్‌ల విభాగంలో రెండింటి సంయుక్త మార్కెట్ వాటా దాదాపు 21 శాతంగా ఉంటుందని వివరించింది. దక్షిణాదికి చెందిన బిజినెస్ గ్రూప్ పాయ్ కుటుంబం 1962లో కర్ణాటక కాయిర్ ప్రోడక్ట్స్ (ప్రస్తుతం కేఈఎల్)ను ఏర్పాటు చేసింది. 1995లో దాని పేరు కర్లాన్ అని మారగా 2011లో కేఈఎల్ పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటైంది. అటు పైన 2014లో వ్యాపారం కేఈఎల్కు బదిలీ అయింది. కంపెనీ ప్రస్తుతం ప్రధానంగా కర్లాన్ బ్రాండ్ కింద ఫోమ్, కాయిర్ ఆధారిత మ్యాట్రెస్లు మొదలైనవి తయారు చేస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.809 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. ఫరి్నచర్ రెంటల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఫర్లెంకోలో పెట్టుబడులు ఉపయోగపడగలవని షీలా ఫోమ్ వివరించింది. -
వచ్చే ఏడాదికల్లా ఏపీలో కర్లాన్ ప్లాంటు
♦ రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి ♦ సోలార్ రంగంలోకి ప్రవేశిస్తున్నాం ♦ సాక్షితో కర్లాన్ సీఎండీ సుధాకర్ పాయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరుపుల తయారీ దిగ్గజం కర్లాన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ప్లాంటును నెలకొల్పుతోంది. 2017లో ఈ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించాలని సంస్థ కృతనిశ్చయంతో ఉంది. స్థలం తమ చేతుల్లోకి రాగానే నిర్మాణ పనులు మొదలు పెడతామని కర్లాన్ సీఎండీ టి.సుధాకర్ పాయ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అన్నీ అనుకూలిస్తే జనవరిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు. స్థలం తమ చేతుల్లోకి రావడమే ఆలస్యమని వివరించారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రకు ఈ యూనిట్ నుంచి పరుపులను సరఫరా చేస్తామని వెల్లడించారు. 1,000 మందికి పైగా ఉపాధి.. చిత్తూరు ప్లాంటు పూర్తి సామర్థ్యానికి చేరుకునే నాటికి మొత్తం రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి చేయనున్నట్టు సీఎండీ చెప్పారు. ప్రత్యక్షంగా 1,000 మందికిపైగా ఉపాధి అవకాశాలు ఉంటాయని అంచనాగా తెలిపారు. ఇటీవలే కంపెనీ ఉత్తరాంచల్‌లోని రూర్కీలో రూ.50 కోట్ల వ్యయంతో ప్లాంటును ఏర్పాటు చేసింది. కంపెనీకి చెందిన 9 ప్లాంట్లు కర్ణాటక, ఒరిస్సాతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. కొద్ది రోజుల్లో మరిన్ని విదేశీ పరుపుల బ్రాండ్లను కర్లాన్ భారత మార్కెట్లో పరిచయం చేయనుంది. రూ. లక్ష ఆపైన ఖరీదున్న సూపర్ ప్రీమియం పరుపుల వాటా సంస్థ ఆదాయంలో 10 శాతముంది. ఫర్నీచర్‌తోపాటు లినెన్, పిల్లోస్, బ్లాంకెట్స్ వంటి విభాగాల్లోకి కర్లాన్ గతేడాది ప్రవేశించింది. కొత్త విభాగాల్లోకి.. సౌర విద్యుత్ రంగంలోకి ప్రవేశించాలని కర్లాన్ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్న సోలార్ పాలసీలను అధ్యయనం చేస్తున్నట్టు సుధాకర్ పాయ్ వెల్లడించారు. కాగా, భారత్‌లో పరుపుల మార్కెట్ సుమారు రూ.6,000 కోట్లుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా రూ.2,000 కోట్లపైమాటే. వ్యవస్థీకృత రంగంలో కర్లాన్‌కు 45 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇక 2020 నాటికి రూ.5,000 కోట్ల టర్నోవర్ సాధించాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. 2018లో ఐపీవోకు వెళ్లాలని కంపెనీ భావిస్తోంది.