రూ. 26 కోట్లతో కొత్తపట్నం రోడ్డు
మంత్రి శిద్దా వెల్లడి
ఒంగోలు: నగరంలోని ఎఫ్‌సీఐ గోదాము నుంచి కొత్తపట్నం వరకూ రూ. 26 కోట్లతో రహదారి నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖామంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. స్థానిక ఆయన నివాసంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావుతో చర్చించిన అనంతరం శుక్రవారం మీడియాకు వివరాలు విడుదల చేశారు. కోర్నెట్ రోడ్ల పథకం కింద నిధులు మంజూరు చేయాలని నిర్ధారించామని తెలిపారు. చీమకుర్తి నుంచి బైపాస్ చివరి కాలువల వరకు సిమెంట్ రహదారి నిర్మాణానికి రూ. 21 కోట్లు, కరవది–గుండాయపాలెం రహదారి నిర్మాణానికి రూ. 26 కోట్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ రమేశ్‌బాబు, ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.