breaking news
Kankipati venkatesvararavu
-
సఖ్యత చర్చలు విఫలం
నక్కపల్లి, న్యూస్‌లైన్: పాయకరావుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అనితపై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు ఆమె వ్యతిరేక, అనుకూల వర్గీయుల మధ్య శనివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సీతారామపురం సర్పంచ్ ఉరుకుట్ల వెంకటరమణ మధ్యవర్తిత్వంతో ఆ గ్రామంలో ఒక చోట రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సస్పెండైన పార్టీ మండల అధ్యక్షుడు కంకిపాటి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్త చింతకాయల రాంబాబు, మరో 20 గ్రామాల నాయ కులు హాజరయ్యారు. విభేదాలకు స్వస్తి చెప్పి పార్టీ పటిష్టతకు, టికెట్ ఇస్తే అనిత గెలుపునకు కృషి చేయాలని మద్యవర్తి ప్రతిపాదించారు. దీనిపై అసమ్మతి నేతలు ముందు తమపై సస్పెన్షన్ ఎత్తివేస్తే కలసి పనిచేసే విషయం ఆలోచిద్దామని షరతు విధించారు. సస్పెన్షన్ ఎత్తివే త తన పరిధిలోది కాదని, అధిష్టానం, జిల్లా అధ్యక్షుడు తీసుకోవాల్సిన నిర్ణయమని అనిత చెప్పారు. అనిత వర్గీయులు కూడా సస్పెన్షన్ ఎత్తివేతకు అంగీకరించలేదని తెలిసింది. సస్పెన్షన్ వ్యవహారం తేలకపోవడంతో ఇరువర్గాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. వైద్యుడి అండదండలు.. మరోవైపు అసమ్మతి నేతలకు ఈ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న విశాఖకు చెందిన ఓ వైద్యు డి అండదండలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయనకు సినీనటుడు బాలకృష్ణతో సత్సంబంధాలున్నాయని సమాచారం. తెరవెనక అసమ్మతిని ప్రోత్సహిస్తున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడానికి వైద్యవృత్తికి దీర్ఘకాలిక సెలవు కోసం ప్రభుత్వానికి ధరఖాస్తు చేసినట్లు తెలి సింది. అనుమతి రాగానే పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా వైద్య శిబి రాలు, సేవా కార్యక్రమాలు చేపడుతూ గుర్తింపు కోసం యత్నిస్తున్నారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అనిత తీరు పార్టీకి నష్టం: నాయకులు నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అనితకు నక్కపల్లి మండలంలో కూడా అసమ్మతి సెగ తగిలింది. ఆమె వ్యవహారశైలి పార్టీకి నష్టం కలిగించేలా ఉందని పార్టీ సీనియర్ నాయకులు దేవవరపు కొండలరావు (గొల్ల), మండల టీడిపి అధ్యక్షుడు దేవవరపు శివ, మండల మై నార్టీ సెల్ అధ్యక్షుడు అజీమ్, తెలుగు యువత నాయకులు ముద్దా నానాజీలు ఆరోపించారు. శనివారం వారు విలేకర్లతో మాట్లాడుతూ అనిత పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పోవడం లేదని, ఇతర పార్టీల నుంచి వ చ్చిన వారికి ప్రాధాన్యమిస్తూ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిని విస్మరిస్తున్నారని విమర్శించారు. తాము పార్టీని వదిలిపెట్టే ప్రసక్తిలేదన్నారు. ముద్దా నానాజీ మాట్లాడుతూ తమకు వ్యక్తి కాదు.. పార్టీయే ముఖ్యమన్నారు. ఇటీవల పార్టీలో చేరిన వెంకటేష్ వల్ల గతంలో పార్టీకి నష్టం వాటిల్లిందని, పార్టీ ఫిరాయించి ఏడాది తర్వాత గత్యంతరం లేక మళ్లీ టీడీపీలో చేరారన్నారు. ఇప్పటికైనా అనిత పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసే వారికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. -
అనితను మార్చాల్సిందే...
నక్కపల్లి/పాయకరావుపేట, న్యూస్‌లైన్: పాయకరావుపేట నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించిన అనితను మార్చాల్సిందేనని తెలుగుతమ్ముళ్లు పార్టీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు కంకిపాటి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 11మంది సర్పంచ్‌లు బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసి అనిత వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అనిత నియామకంతో పాయకరావుపేటలో తెలుగుతమ్ముళ్లు రెండుగా చీలిపోయారు. ఇద్దరు ముఖ్యనేతలు రాజీనామా చేశారు. ఈ దశలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గవిరెడ్డిరామానాయుడు రాజీ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. దీంతో అసమ్మతినేతలంతా పార్టీ అధినేతకు ఇక్కడి పరిస్థితిని వివరించారు. మొదటి నుంచి అనిత నియామకాన్ని పాయకరావుపేట మండలంలోని ఒక బలమైన వర్గం వ్యతిరేకిస్తోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ దీని ప్రభావం కనిపించింది. పలుగ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో మండల మాజీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు గొర్లె రాజబాబు పార్టీ పదవికి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఇరువర్గాలను ఏకంచేసి రాజీ కుదిర్చేందుకు రూరల్ జిల్లా అధ్యక్షుడు రామానాయుడు మంగళవారం పాయకరావుపేటలో ఒకవర్గం ఏర్పాటుచేసిన కార్యాలయం వద్దకు వచ్చి రెండోవర్గంవారు రమ్మని కబురు పంపారు.అక్కడకు వచ్చేపనిలేదని కంకిపాటి వెంకటేశ్వరరావు తదితరులు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన రామానాయుడు రాజబాబు రాజీనామాను ఆమెదించేది లేదని ఆయనపార్టీలోనే కొనసాగుతారంటూ చెప్పి వెళ్లిపోయారు. దీంతో రెండో వర్గానికి చెందిన వెంకటేశ్వరరావు, చింతకాయలరాంబాబు,దేవవరపు వెంకట్రావు తదితరుల ఆధ్వర్యంలో పలువురు ఎకాయెకిన బస్సులో మంగళవారం రాత్రి హైదరాబాద్వెళ్లారు. బుధవారం ఉదయాన్నే చంద్రబాబును కలిసి గెలుపొందిన సర్పంచ్‌లను పరిచయం చే శారు. అనంతరం అనితపై ఫిర్యాదు చేశారు. అనిత వ్యవహారం నియోజవర్గంలో పార్టీకి తీరని నష్టం కలుగిస్తోందంటూ వాపోయారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల ఓటమికి ఆమె కృషి చేశారని, ఆమె వ్యవహార శైలి బాగాలేదని, తక్షణం మార్చకుంటే తాము పార్టీలో కొనసాగలేమని తేల్చిచెప్పినట్టు బాబును కలిసిన కొందరు నాయకులు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. అనిత వ్యవహారం తన దృష్టికి వచ్చిందని, తొందర పడొద్దని,సమస్యపరిష్కారానికి చర్యలు చేపడతానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. చంద్రబాబును కలిసిన వారిలో పెదిరెడ్డిశ్రీను,దేవవరపుసత్యనారాయణ,లెక్కలగోవిందు సర్పంచ్‌లు చించలపు సన్యాసమ్మ, తదితరులతోపాటు మరో50మంది కార్యకర్తలు, ముఖ్యనాయకులు ఉన్నారు.