breaking news
KaneWilliamson
-
మూడో వన్డే కూడా రద్దు.. వన్డే సిరీస్ న్యూజిలాండ్‌దే
క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగుతున్న భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. కాగా 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 18 ఓవర్లలో వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. ఈ క్రమంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఆఖరికి అంపైర్లు రద్దు చేశారు. కాగా వరుసగా రెండు వన్డేలు కూడా వర్షం కారణంగానే రద్దయ్యాయి. అంతకుముందు టీ20 సిరీస్‌లో కూడా ఆఖరి టీ20 వర్షం కారణంగానే ఎటువంటి ఫలితం తేలలేదు. ఇక తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన టామ్ లాథమ్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. రాణించిన వాషింగ్టన్ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో కేవలం 219 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(49) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, మిచెల్ తలా మూడు వికెట్లు సాధించగా.. సౌథీ రెండు, శాంట్నర్ ఒక్క వికెట్ సాధించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Ind Vs NZ: అతడు వెలకట్టలేని ఆస్తి! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! -
ఇంగ్లండ్‌తో టెస్టులకు కివీస్ జట్టును ప్రకటన.. కేన్ విలియమ్సన్ వచ్చేశాడు!
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో 20 మంది సభ్యలతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. కాగా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. నవంబర్ 2021లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను విలియమ్సన్ ఆడాడు. మరో వైపు దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న మైఖేల్ బ్రేస్‌వెల్, వికెట్ కీపర్ క్యామ్ ఫ్లెచర్, ఓపెనర్ హమీష్ రూథర్‌ఫోర్డ్, పేసర్లు జాకబ్ డఫీ,బ్లెయిర్ టిక్నర్కు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. ఇక మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జాన్2న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జాకబ్ డఫీ, కామెరాన్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్, రచిన్ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్ చదవండి: IPL 2022: ఐపీఎల్లో ధావన్ అరుదైన ఫీట్.. కోహ్లి రికార్డు బద్దలు..! With the 5 players at the IPL unlikely to be available for the warm-up matches at Hove and Chlemsford, the initial squad of 20 will be reduced to 15 ahead of the 3 Tests against @englandcricket, the 1st of which begins at Lord’s on June 2. More | https://t.co/lDfWsK6mMX #ENGvNZ pic.twitter.com/FRtIowyMoi — BLACKCAPS (@BLACKCAPS) May 3, 2022