breaking news
kanaganapalli mptc election
-
అనంత కలెక్టర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
-
అనంత కలెక్టర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
అనంతపురం: కనగానపల్లి ఎంపీపీ ఎన్నికను సజావుగా నిర్వహించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ను కలిశారు. కనగానపల్లిలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉందని ఎలక్షన్‌కు పరిటాల వర్గీయులు ఆటంకాలు కలిగించే అవకాశం ఉందని నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు.