breaking news
Kakka kakka
-
జోడీ కడుతున్నారు
‘కాక్క కాక్క’.. హీరో సూర్య కెరీర్ టర్నింగ్ మూవీ. తమిళ ఇండస్ట్రీలో తనకో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమే కాకుండా తన ప్రేమను సంపాదించుకున్నారు ఈ సినిమా ద్వారా. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే సూర్య–జ్యోతిక ప్రేమలో పడ్డారని అప్పట్లో కోలీవుడ్‌లో చెప్పుకునేవారు. అలా సూర్య–జ్యోతికల లైఫ్‌లో స్వీట్ మెమరీగా నిలిచిపోయే ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే ప్లాన్ ఇప్పుడు జరుగుతోందట. ఈ సీక్వెల్‌తోనే సూర్య– జ్యోతిక మళ్లీ కలసి నటించ బోతున్నారట. పెళ్లికి ముందు ‘నువ్వు నేను ప్రేమ’ చిత్రంలో ఇద్దరూ కలసి నటించారు సూర్య, జ్యోతిక. పెళ్లయిన పన్నెండేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌ను షేర్ చేసుకోనుండటం విశేషం. నిర్మాత కలైపులి యస్. థాను ఇటీవలే ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించమని దర్శకుడు గౌతమ్ మీనన్‌ను సంప్రదించినట్టు సమాచారం. ‘ధృవనక్షత్రం, ఎనై నోక్కి పాయుమ్ తోట్టా’ సినిమాలతో బిజీగా ఉన్న గౌతమ్ వీటిని పూర్తి చేసిన వెంటనే ఈ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడతారట. మొదటి భాగానికి సంగీతం అందించిన హ్యారిస్ జయరాజ్నే సంగీత దర్శకుడిగా తీసుకోనున్నారట. ఈ చిత్రం ‘ఘర్షణ’ పేరుతో వెంకటేశ్, అసిన్లతో తెలుగులో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. -
సోనాక్షి వచ్చిందోచ్!
గాసిప్ నాలుగు సంవత్సరాల క్రితం జాన్ అబ్రహాం హీరోగా నటించిన ‘ఫోర్స్’ సినిమా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కాక్కా కాక్కా’ సినిమాకు రిమేక్. ‘ఫోర్స్’లో జెనీలియా డిసౌజా జాన్ సరసన నటించింది. ‘ఫోర్స్-2’కు మాత్రం డెరైక్టర్, హీరోయిన్లు మారారు. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కోసం చాలామంది హీరోయిన్లను సంప్రదించారు దర్శక,నిర్మాతలు. రకరకాల కారణాలతో ఎవరూ ఒకే కాలేదు. ‘ఫోర్స్-2’లో కత్రినా కైఫ్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీటిని కత్రినా ఖండించారు. ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి పెంచడానికే ‘ఫోర్స్-2’ మేకర్స్ వ్యూహాత్మకంగా కత్రినా కైఫ్ పేరును ప్రచారంలో పెట్టారని కొందరు అంటారు. మరికొందరి కథనం ప్రకారం... భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో ‘ఫోర్-2’లో నటించడానికి కత్రినా ఒప్పుకుందట. తీరా స్క్రిప్ట్ పూర్తిగా విన్న తరువాత నీరుగారి పోయిందట. దీనికి కారణం జాన్ అబ్రహం పాత్రతో పోల్చితే, తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమేనట. స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడానికి దర్శక,నిర్మాతలు ఒప్పుకున్నా హీరోగారు మాత్రం ససేమిరా అన్నాడట. దీంతో కత్రినా ఆ సినిమా నుంచి తప్పుకుందట. జాన్ సరసన జోడిగా ఇప్పుడు సోనాక్షి సిన్హా ‘ఫోర్స్-2’లో నటించనుంది. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి. తాను స్క్రిప్ట్‌లో సూచించిన చిన్న చిన్న మార్పులకు ఒప్పుకున్న తరువాతే సోనాక్షి ‘ఫోర్స్-2’ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే మాట కూడా వినబడుతోంది. అంటే, కండల కథనాయకుడు జాన్‌లాగే సోనాక్షి కూడా డిష్యుం డిష్యుం ఫైట్లు ఏమైనా చేయనుందా? వేచి చూడాలి మరి!