breaking news
jury award
-
కాన్స్ హంగామా మొదలు
కాన్స్ చలన చిత్రోత్సవాల కాంతులు ఫ్రాన్స్‌లో వెలిగిపోతున్నాయి. 78వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్‌లో ఈ నెల 13నప్రారంభమై, 24 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ మేకర్ క్వెంటిన్ టరంటినో ఈ 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ వేడుకనుప్రారంభించి, ఆయన మైక్‌ను వెంటనే కిందపడవేయడం వీక్షకులను సర్ప్రైజ్ చేసింది. ఎందుకిలా చేశారనే చర్చ జరుగుతోంది. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతదేశాని కిప్రాతినిధ్యం వహిస్తూ, ఈ ఏడాది జ్యూరీలో ఓ సభ్యురాలిగా ఇండియన్ ఫిల్మ్ మేకర్పాయల్ కపాడియా ఈ వేడుకకు హాజరయ్యారు. కాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక ‘పామ్ డి ఓర్’ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ అమెరికన్ నటుడు, దర్శకుడు రాబర్ట్ డి నీరో అందుకున్నారు. అమెరికన్ నటుడు లియోనార్డో డికాప్రియో చేతుల మీదుగా రాబర్ట్ డి నీరో ‘పామ్ డి ఓర్’ అవార్డును స్వీకరించారు. అలాగే విదేశాల్లో చిత్రీకరణ జరుపుకునే చిత్రాలను అమెరికాలో ప్రదర్శించాలనుకుంటే వంద శాతం టారీఫ్‌ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనను రాబర్ట్ డి నీరో తన అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో తప్పుబట్టారు. దీంతో అమెరికాలో సినిమాలపై వంద శాతం టారీఫ్ విధానం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చర్చనీయాంశమైంది. ముంబై ఫిల్మ్ మేకర్పాయల్ కపాడియా జ్యూరీ మెంబర్‌గా ఉండటం పట్ల రాబర్ట్ డి నీరో హర్షం వ్యక్తం చేశారు. అలాగే జూన్‌లో వందేళ్లు పూర్తి చేసుకోనున్న చార్లీ చాప్లిన్ ‘ది గోల్డ్ రష్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇక ఈసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేవారి వస్త్రధారణపై జ్యూరీ ప్రత్యేక నియమ నిబంధనలను విధించింది. ఇండియన్ డిజైనర్ గౌరవ్ సిద్ధం చేసిన ఓ ప్రత్యేక కాస్ట్యూమ్‌ను కాన్స్ ప్రస్తుత రూల్స్ వల్ల తాను ధరించలేకపోయాయని అమెరికన్ నటి హాలీ బెర్రీ పేర్కొన్నారు. కాన్స్‌లో భారతీయం: సత్యజిత్ రే దర్శకత్వంలోని ప్రముఖ బెంగాలీ ఫిల్మ్ ‘అరణ్యేర్ దిన్ రాత్రి’, అనుపమ్ ఖేర్ డైరెక్షన్‌లోని తాజా చిత్రం ‘తన్వి: ది గ్రేట్’, హైదరాబాద్ ఫిల్మ్‌మేకర్ నీరజ్ దర్శకత్వం వహించిన ‘హోమ్ బౌండ్’ (జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ లీడ్ యాక్టర్స్‌గా చేశారు), చరక్, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టి్టట్యూట్ నిర్మాణంలోని ‘ఏ డాల్ మేడప్ ఆఫ్ క్లే’ చిత్రాలు కాన్స్‌లో ప్రదర్శితం కానున్నాయి. దీంతో ఈ సినిమాలకు చెందిన కొందరు నటీనటులు, దర్శక–నిర్మాతలు ఈ చిత్రోత్సవాలకు హాజరు కానున్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్స్’ విభాగంలో అవార్డు కోసం ‘హోమ్‌బౌండ్’ చిత్రం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోపాల్గొననున్నట్లుగా ఆలియా భట్ ఓ సందర్భంగా చెప్పారు. అయితే భారత్–పాక్ యుద్ధం నేపథ్యంలో ఆమె ఈ ఫెస్టివల్‌కు హాజరు కాకూడదనుకున్నారట. ఇంకా దాదాపు పది రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి ఆలియా మనసు మారొచ్చేమో. ఇక కాన్స్ అంటే ఐశ్వర్యా రాయ్ ఉండా ల్సిందే. ఈసారి ఆమెతోపాటు ఇంకొందరు భారతీయ తారలు కాన్స్ చిత్రోత్సవాల్లో మెరవనున్నారు. ఊహూ... ఉర్ఫీకి చేదు అనుభవం బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్‌కి చేదు అనుభవం ఎదురైంది. ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025’లో తొలిసారిపాల్గొనే అవకాశం అందుకున్నారామె. హ్యాపీగా వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఊహూ... అంటూ వీసాని తిరస్కరించడంతో ఉర్ఫీ నిరుత్సాహపడ్డారు. కానీ తిరస్కరణలు తనకు కొత్తేం కాదంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారామె. ‘‘కాన్స్‌లో కొన్ని వైవిధ్యమైన దుస్తుల్లో కనిపించాలని ΄్లాన్ చేసుకున్నాను. కానీ, విధిరాత వల్ల నా వీసా తిరస్కరణకు గురైంది. నా జీవితంలో వ్యాపారంలో ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. జీవితంలో ఎన్నో తిరస్కరణల తర్వాత కూడా నేను ఎక్కడా ఆగిపోలేదు. నాలాగా మీలో చాలామంది తిరస్కరణకు గురై ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటే... షేర్ చేసుకుని, అందరికీ ఆదర్శంగా నిలవాలి’’ అని పోస్ట్ చేశారు ఉర్ఫీ జావేద్.అప్పుడు మొసలి.. ఇప్పుడు చిలుక!కాన్స్ చిత్రోత్సవాల ఎర్ర తివాచీ పై రంగురంగుల గౌనులో సందడి చేశారు నటి ఊర్వశీ రౌతేలా. కొందరు నెటిజన్స్ మాత్రం ఆమె లుక్‌పై విమర్శలు చేస్తున్నారు. 2018లో జరిగిన కాన్స్ చిత్రోత్సవాల్లోపాల్గొన్న ఐశ్వర్యా రాయ్ ఇలాంటి మల్టీ కలర్ గౌను ధరించారని, ఆమె లుక్‌ని ఊర్వశి కాపీ కొట్టారనీ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఆమె మేకప్ ఎక్కువైందని, హెయిర్ స్టైల్ బాగోలేదని విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఊర్వశీ రౌతేలా చేతిలో ఉన్న చిలుక ఆకారం ఉన్న క్లచ్ (పర్సు) అందర్నీ ఆకట్టుకుంది. చిలుక ఆకారంలో క్రిస్టల్స్ ΄÷దిగిన ఈ క్లచ్ ధర సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని టాక్. కాగా 2023లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోపాల్గొన్న ఊర్వశీ రౌతేలా ధరించిన మొసలి ఆకారంలోని నెక్లెస్ అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. కోట్ల రూపాయలు విలువ చేసే ఆ నెక్లెస్ అంత బాగా లేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా మేకప్, హెయిర్ స్టైల్ విషయంలో విమర్శలు ఎదురయ్యాయి. అయితే ‘΄్యారెట్ క్లచ్’ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు..
మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్ కంటితో చూడొచ్చు.. దానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం.. సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు.. మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్ (వెనుక వైపు ఫొటో).. ఈ చిత్రాలు.. 2022 డ్రోన్ ఫొటో పురస్కారాల్లో అర్బన్ కేటగిరీలో జ్యూరీ ప్రశంసలను అందుకున్నాయి. 116 దేశాల నుంచి 2,600 మంది ఫొటోగ్రాఫర్లు తమ ఎంట్రీలను పంపారు. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్ -
'నగ్న వీడియో' కేసు: యాంకర్ కు రూ.370 కోట్లు
నాష్ విల్లే: మారియట్ హోటల్ గదిలో తాను దుస్తులు మార్చుకుంటుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంపై న్యాయపోరాటానికి దిగిన టీవీ చానెల్ యాంకర్ ఎరిన్ ఆండ్రూస్ కు గొప్ప ఊరటలభించింది. అమెరికా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ చానెల్ యాంకరైన ఎరిన్ ను వీడియో తీయడమేకాక, సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేసి ఆమెను క్షోభకు గురిచేశారంటూ ప్రతివాదులపై మండిపడ్డ కోర్లు.. నష్టపరిహారంగా ఎరిన్ కు 55 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.370 కోట్లు) చెల్లించాలని తీర్పుచెప్పింది. సోమవారం తల్లిదండ్రులతో కలిసి కోర్టుకు హాజరైన ఎరిన్ తీర్పు అనంతరం కాస్త ఊరటచెందినట్లు కనిపించారు. కోర్టు ఆవరణలో వేచిఉన్న తన అభిమానులకు ఆటోగ్రాఫులిచ్చారు. ఈ ఘటనతో నేను అవమాన భారంతో కుంగిపోయాననీ, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని విచారణ సందర్భంగా కోర్టు జ్యూరీ ముందు ఎరిన్ తన వాంగ్మూలాన్నిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. 2008లో ఈఎస్పీఎన్ చానెల్‌కు పనిచేస్తున్నప్పుడు ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కవర్ చేయడం కోసం ఎరిన్ అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ సమీపంలోని మారియట్ నేష్‌విల్లే హోటల్లో బసచేసింది. పక్క గదిలోనే బసచేసిన మైకేల్ డేవిడ్ బారెట్ అనే వ్యక్తి ఎరిన్ గదిలోకి రంధ్రం చేసి..ఆమె డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. ఈ వీడియో తర్వాత ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడంతో పబ్లిసిటీ కోసం ఎరినే స్వయంగా ఈపని చేసిందంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతంపై ఎరిన్ కోర్టుకెక్కడంతో అసలు విషయం బయటపడింది. ఎరిన్ కు చెల్లించాల్సిన జరిమానాను ప్రధాన దోషి అయిన మైకేల్ డేవిడ్, రెండో దోషి మారియట్ హోటల్ గ్రూపులు చెరిసగం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. కాగా, హోటల్ నిర్వహణను రెండు కంపెనీలు చూస్తున్నందున ఆ రెండూ ఎంతెంత శాతం చెల్లించాలనే నిర్ణయాన్ని వారికే వదిస్తున్నట్లు కోర్లు చెప్పింది. ఎట్టకేలకు కేసు గెలవడంతో ఏళ్లుగా తాను అనుభవిస్తున్న క్షోభ నుంచి ఎరిన్ విముక్తురాలైనట్లైంది.